తెలంగాణలో కాంగ్రెస్‌ను ఓడించబోతున్న కర్ణాటక కాంగ్రెస్ !

తెలంగాణలో కాంగ్రెస్ కు తెలంగాణ లో కాంగ్రెస్ విజయం బూస్ట్ ఇచ్చిందనుకున్నారు. కానీ రోజులు గడుస్తున్న కొద్దీ అసలు విషయం మాత్రం తేడాగా మారుతోంది. కర్ణాటకలో కాంగ్రెస్ వైఫల్యాలు ఇక్కడ కాంగ్రెస్ మెడకు చుట్టుకుంటున్నాయి. అక్కడ విఫలమైన పాలనతో ప్రజల అవస్తలు ఇక్కడ హైలెట్ అవుతున్నాయి. బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పుడు… కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎలా ఉందో పోల్చుకుంటూ అక్కడి ప్రజలు ఇస్తున్న పిలుపులు తెలంగాణలో ప్రభావం చూపిస్తున్నాయి.

కర్ణాటకలో విఫలమైన కాంగ్రెస్ హామీల అమలు

కర్ణాటకలో గెలవడానికి కాంగ్రెస్ పార్టీ లెక్కలేన్ని హామీలు ఇచ్చింది. ఐదు గ్యారంటీల పేరుతో అన్ని వర్గాల వారికి డబ్బులు పంచుతామని ప్రకటించింది. ఓటర్ల ఆశలను వాడుకుని ఓట్లు పొందింది. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేయడానికి తంటాలు పడుతున్నారు. అరకొరగా అమలు చేసి ప్రజాగ్రహాన్ని చూస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణలోనూ అవే హామీలు అమలు చేస్తామంటూ కాంగ్రెస్ ముందుకు వచ్చింది. దీంతో కర్ణాటక ప్రజలు కాంగ్రెస్ ను నమ్మవద్దని తెలంగాణ ప్రజలకు సందేశాలు పంపుతున్నారు., సోషల్ మీడియా ద్వారా వారి కష్టాలను తెలియచేస్తున్నారు. ఇవి విస్తృతంగా ప్రజల్లోకి వెళ్తున్నాయి.

ఇక్కడ ముఖం చూపించలేకపోతున్న కర్ణాటక నేతలు

డికే శివకుమార్, సిద్ధరామయ్యలతో తెలంగాణలో విస్తృత పర్యటనలు చేయించాలని మొదట కాంగ్రెస్ అనుకుంది. కానీ కర్ణాటకలో వైఫల్యాలపై విస్తృత ప్రచారం జరుగుతూండటంతో.. వారిద్దరినీ ఒకటి, రెండు రోజులకే పరిమితం చేశా రు. మళ్లీ తెలంగాణ వైపు రానీయడం లేదు. వారిని చూస్తే కర్ణాటక వైఫల్యాలు ఇక్కడ ప్రజలకు మరింత ఎక్కువగా గుర్తొస్తాయన్న కారణంగానే పక్కన పెట్టేశారని గుసగుసలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ నేతలు వ్యూహాత్మకంగా… కర్ణాటక గురించి ప్రచారం చేయడం తగ్గించారు. కానీ ఇప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.

బీజేపీ పాలనే బెటరని ప్రజల అభిప్రాయం

బీజేపీని కాదని కాంగ్రెస్ ను గెలింపిచిన ప్రజలు రియలైజేషన్ కు రావడానికి ఆరు నెలల కంటే ఎక్కువ సమయం పట్టలేదు. గతంలో ఐదేళ్లలో బీజేపీ పాలనే అద్భుతంగా ఉందని.. అనుకునే ప రిస్థితి వచ్చింది. అందుకే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇబ్బంది పడనుందన్న విశ్లేషణలు వస్తున్నాయి. అంత కంటే ముందు తెలంగాణ కాంగ్రెస్ పైనా.. కర్ణాటక కాంగ్రెస్ వైఫల్యం పడనుంది. పాపం కాంగ్రెస్ అనుకోవడం తప్ప.. ఏమీ చేయలేరని రాజకీయవర్గాలు సెటైర్లు వేస్తున్నాయి.