మనదేశంలో ఎన్నో ఆలయాలు ఉన్నాయి . వాటిలో ఎన్నో అంతుచిక్కని మిస్టరీలు ఉన్నాయి . వీటిలో కొన్ని చూసి తరించేవిగా ఉంటే .. మరికొన్ని ఆశ్చర్యాన్ని, కలిగించేవిగా ఉన్నాయి. పురావస్తు శాఖ నిపుణులు సైతం చెప్పలేని ఎన్నో అద్భుతాలను మన పూర్వీకులు అప్పట్లోనే కట్టడాల రూపంలో నిర్మించి చూపించారు. అలాంటి అద్భుత ఆలయాల విశేషాలు మీకోసం…
పంజాబ్ లోని మొహాలీ లో గురుద్వారా
సిక్కుల ఏడో గురువు గురు హర్ రాయ్ 16వ శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని సందర్శించాడని చెబుతారు. ఈ గురుద్వారాలో మామిడి చెట్టుకి ఓ ప్రత్యేకత ఉంది. సాధారణంగా మామిడి చెట్టుకి ఎండాకాలంలోనే కాస్తుంది. కానీ ఇక్కడున్న మామిడి చెట్టు సంవత్సరంలో అన్ని రోజులూ, సీజన్లతో సంబంధం లేకుండా కాస్తుంది. అది ఎలా సాధ్యం అనేది ఎవరికీ తెలియదు.
ద్వారేశ్ దర్గా
ద్వారేశ్ దర్గా దగ్గర 90 కేజీల రాయి ప్రత్యేక ఆకర్షణ. ఇక్కడ కరెక్ట్ గా 11 మంది ఒక రాయిని కేవలం ఒక వేలుతో పైకి లేపాలి. రాయిని ముట్టుకున్న వెంటనే హజరత్ కమర్ అలీ దర్వేష్ అని పలుకుతూ రాయిని పైకి ఎత్తాలి. ఇలా చేసిన వెంటనే ఆ రాయి 10 నుంచి 11 అడుగుల ఎత్తులోకి వెళ్లి అలా గాల్లో తేలుతూ ఉంటుంది. ఆలా ఎలా జరుగుతుంది అనేది ఇప్పటికి మిస్టరీగానే ఉంది.
బృహదీశ్వరాలయం
తంజావూర్ లో బృహదీశ్వరాలయం ఇప్పటికీ రహస్యంగానే ఉన్నది. దీనిని రాజరాజ చోళుడు 11 వ శతాబ్దంలో నిర్మించాడు. ఆలయంలో ప్రధాన రహస్యం నీడ. గోధూళి వేళ ఈ ఆలయ నీడలు కనిపించవు. సంవత్సరం పొడవునా ఏ రోజూ కూడా సాయంత్రం వేళ ఆలయ నీడలు భూమిమీద పడకపోవటం అంతుచిక్కని రహస్యం.
తెప్పేరుమనల్లూర్ శివాలయం
తమిళనాడులోని తెప్పేరుమనల్లూర్ శివాలయంలో నాగుపాము స్వయంగా శివారాధన చేయడం అందరినీ విస్తుపోయేలా చేసింది. 2010లో ఒక రోజు ఉదయం ఆలయ పూజారి ఆలయానికి వచ్చే సమయానికి ఒక పాము శివలింగంపై ఉండటం గమనించారు. తర్వాత ఆ పాము ఆలయంలో ఉన్న బిల్వ చెట్టు ఎక్కి బిల్వ పత్రాలు సేకరించి.. తర్వాత శివలింగం దగ్గరకు చేరుకుని నోటి ద్వారా ఆ బిల్వ పత్రాలను శివుడికి సమర్పించింది.
పూరీ జగన్నాథ్ ఆలయం
పూరీ జగన్నాథ ఆలయంలో సముద్ర శబ్దం సింహద్వారం దాటిన తర్వాత వినిపించదు. ద్వారం బయట అడుగుపెడితే సముద్ర ఘోష వినిపిస్తుంది. ఇది ఇప్పటికీ అంతుచిక్కని రహస్యంగానే ఉండిపోయింది.
అజంతా ఎల్లోరా
కొండలని తొలచి శిల్పాలు మార్చిన గొప్ప నైపుణ్యం మన భారతీయ శిల్పులది. దానికి ప్రతీకే ఎల్లోరాలోని కైలాశనాథ ఆలయం. ఒకే రాతితో ఆలయ నిర్మాణం జరగడం విశేషం . చుట్టూ ఉన్న ఆలయాలు, డిజైన్స్ అన్నీ కూడా ఒక రాతితోనే నిర్మించారు. ఎలాంటి టెక్నాలజీ లేని సమయంలో ఇలాంటి నిర్మాణం ఒక అద్భుతం
మహారాష్ట్ర షోలాపూర్
మహారాష్ట్ర షోలాపూర్ షేప్టల్ గ్రామంలో పాముల పూజ చేయడం ఆనవాయితీ . ఈ గ్రామంలో ప్రతి ఇంట్లో మనుషులతో పాటూ పాములు తిరుగుతూ ఉంటాయి. కానీ ఇంతవరకు ఎవరిని కూడా పాము కరిచిన దాఖలాలు లేవు .. ఇది ఎలా అనేది ఇప్పటికి అంతుచిక్కకుండానే ఉంది.
గమనిక: కొందరు పండితులు, కొన్ని పుస్తకాలు ఆధారంగా సేకరించిన సమాచారం ఇది. దీనిని ఎంత వరకూ విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం.