తెలుగు రాష్ట్రాల్లో ఘాటెక్కుతోన్న ‘గుంటూరు కారం’ బిజినెస్

సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గుంటూరు కారం. అతడు,ఖలేజా తర్వాత వస్తున్న హ్యాట్రిక్ మూవీ కి ఘాటైన టైటిల్ పెట్టడమే కాదు ఫస్ట్ లుక్ టీజర్ తోనే సినిమా పై అంచనాలు తారాస్థాయికి తీసుకెళ్లారు. సంక్రాంతికి విడుదలకానున్న ఈ మూవీకి సంబంధించి రికార్డు స్థాయిలో బిజినెస్ జరిగడం సన్షేషన్ అవుతోంది..

రీజనల్ కింగ్ మహేష్
మహేష్ బాబు లేటెస్ట్ మూవీ గుంటూరుకారం మూవీ షూటింగ్ క్లైమాక్స్ కి వచ్చినట్టు తెలుస్తోంది. సంక్రాంతి కానుకగా విడుదల కానున్న ఈ సినిమాకు అప్పుడే కళ్లు చెదిరే రేంజ్ లో బిజినెస్ జరగడం హాట్ టాపిక్ గా మారింది. రెండు తెలుగు రాష్ట్రాలలో జరిగిన బిజినెస్ దిమ్మతిరిగేలా చేస్తోంది. ఏపీ, తెలంగాణ థియేట్రికల్ హక్కులే 120 కోట్ల వరకు జరిగే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఈ బిజినెస్ లెక్కలను చూస్తుంటే మహేష్ రీజనల్ కింగ్ అని మరోసారి నిరూపిస్తోంది. పాన్ ఇండియా కాకుండా తెలుగులో మాత్రమే రిలీజయ్యే ఒక కమర్షియల్ మూవీకి ఇంత ధర పలకడం .. కేవలం మహేష్ మేనియా , ‌త్రివిక్రమ్ క్రేజ్ అంటున్నారు ఫ్యాన్స్..

సంక్రాంతికి తీవ్రమైన పోటీ
వాస్తవానికి సంక్రాంతికి విపరీతమైన పోటీ నెలకొనడంతో బయ్యర్లు సినిమాలు కొనే విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. బరిలో వెంకటేష్ , విజయ్ దేవరకొండ, రవితేజ ఉండటంతో ఓపెనింగ్స్ పట్ల కొంత టెన్షన్ ఉంది. అయితే మహేష్ బాబుకి మాత్రం ఈ టెన్షన్లు మినహాయింపు అని డిస్ట్రిబ్యూటర్ల నమ్మకం. ఎందుకంటే ఫ్యామిలీస్, మాస్ ఇద్దరికీ గుంటూరు కారమే ఫస్ట్ ఛాయిస్ అవుతుంది..పైగా సంక్రాంతి మహేష్ కి కలిసొచ్చిన టైమ్. అందుకే ఈ మూవీ కొనుగోలుపై డిస్ట్రిబ్యూటర్లకు ధీమా ఉంది. దీంతో ఈ మూవీకి బిజినెస్ భారీగా జరిగినట్లు తెలుస్తోంది.

సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు మేకర్స్. ఈ సినిమా నుంచి రిలీజైన ప్రచార చిత్రాలకి ఇప్పటికే ప్రేక్షకుల నుంచి, అభిమానుల నుండి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. మరి విడుదల తర్వాత ఈ సినిమా కలెక్షన్స్ ఆ రేంజులో ఉంటాయో లేదో వెయిట్ అండ్ సీ…