దటీజ్ మోదీ – తెలంగాణ రాజకీయం మార్చేస్తున్న సోషల్ ఇంజనీరింగ్

ప్రధానమంత్రి నరేంద్రమోదీ అపర చాణక్యుడని .. తెలంగాణ ఎన్నికల్లో వస్తున్న మార్పులతో మరోసారి స్పష్టమైంది. ఎవరూ ఊహించని సామాజిక సమీకరణాలతో బీజేపీని ఒక్క సారిగా టాప్ పొజిషన్ లో నిలబెట్టారు. బీజేపీ వైపు ఇప్పుడు బీసీలు, మాదిగలు, కాపు సామాజికవర్గం మాత్రమే కాదు.., రెడ్డి వర్గం కూడా ఉంది. ఇదంతా మోదీ అనుసరించిన వ్యూహమే.

బీసీ, మాదిగ, కాపు వర్గాలు బీజేపీ వైపు

మేరా పాస్ పవన్ కల్యాణ్ హై అన్నారు బీసీ ఆత్మగౌరవ సభలో మోదీ. వర్గీకరణ ఉద్యమంలో మా నాయకుడు మందకృష్ణే అన్నారు మోదీ. అంటే ఆ రెండు వర్గాలకు ప్రధాని మోదీ ఇచ్చిన గౌరవం ఇది. మోదీ అంతటి స్థాయి నాయకుడి గౌరవాన్ని ఆ రెండు వర్గాలు వదులుకునే అవకాశం ఉండదు. ఎందుకంటే… మోదీ వారికి ఇచ్చిన గౌరవం.. వారి వర్గాలకే కానీ.. వ్యక్తులకు కాదు.త

మోదీ గౌరవం ఆ సామాజికవర్గాలకే !

జనసేనకు తెలంగాణలో కనీస బలం లేదు. గత పార్లమెంట్ ఎ్నికల్లో ఎనిమిది పార్లమెంట్ స్థానాల్లో జనసేన అభ్యర్థులు సాధించిన ఓట్లు 85వేలు మాత్రమే. ఆ తర్వాత కూడా జనసేన పార్టీకి నిర్మాణం లేదు . క్యాడర్ లేదు. ఇంకా అసలు ఎలాంటి ప్రజాందోళన కార్యక్రమాలూ నిర్వహించలేదు. మందకృష్ణ కూడా రాజకీయంగా విజయాలు సాధించలేదు. స్వయంగా వర్థన్నపేటలో కూడా ఓడిపోయారు. అందుకే మోదీ ఇచ్చిన గౌరవం, ప్రాధాన్యం ఆయా వర్గాలకే. ఇది వారికి అర్థమవుతుంది.
బీజేపీ వైపే రెడ్డి వర్గం

ఈ సామాజిక సమీకరణంలో ఎవరూ ఊహించని మరో కోణం కూడా ఉంది. అది రెడ్డి వర్గాన్ని ఆకట్టుకోవడం. తెలంగాణలో రెడ్డి సామాజికవర్గాన్ని కాదని రాజకీయం చేయడం అంత తేలిక కాదు. రాజకీయపార్టీలు ప్రకటించిన జాబితాను చూస్తే ఇది అర్థం అయిపోతుంది. బీసీ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించాలనుకున్నారు కాబట్టి రెడ్డి నేతను రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా నియమించారు. సీనియర్ నేత నల్లు ఇంద్రసేనారెడ్డికి గవర్నర్ పోస్టు ఇచ్చారు. అంతర్గతంగా బీజేపీకి ఇచ్చే ప్రాధాన్యం తగ్గలేదని సందేశం పంపారు. కానీ మోదీ గేమ్ ప్లే చేస్తున్నారు . ఈ వ్యూహం తెలంగాణలోని బీజేపీ ప్రత్యర్థుల్ని సైతం ఊహించని షాక్ కు ఇచ్చాయి.

తెలంగాణలో బీజేపీ సోషల్ ఇంజనీరింగ్ చేస్తోంది. ఈ ఇంజినీరింగ్ చివరికి వరకూ అంటే ఓటింగ్ వరకూ పక్కాగా సాగితే.. మైండ్ బ్లాంక్ అయ్యే ఫలితాలు వస్తాయనడంతో సందేహం ఉండదు.