2 వారాల్లో బీజేపీకి పెరిగిన 5 శాతం సీట్లు – సంచలనం సృష్టిస్తున్న రిపోర్టులు !

తెలంగాణ ఎన్నికల రాజకీయం క్రమంగా మారుతోంది. ఇప్పటి వరకూ బీజేపీని లోప్రోఫైల్‌లో ఉంచేందుకు ప్రయత్నిచిన మీడియా, సోషల్ మీడియా బీజేపీ రైజ్ ను ఒప్పుకోక తప్పడం లేదు. కాంగ్రెస్ కు మద్దతుగా అభిప్రాయ సేకరణలు అంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేసే వారు ఇప్పుడు బీజేపీ పుంజుకుంటోందని చెబుతున్నారు. గత రెండు వారాల కాలంలో ఐదు శాతం ఓట్లు బీజేపీకి పెరిగాయని అంచనా వేస్తున్నారు.

ఆ మూడు జిల్లాల్లో బీజేపీ క్లీన్ స్వీప్ ?

బీజేపీ మూడు జిల్లాల్లో తిరుగులేని ప్రభావం చూపించబోతోందన్న అంచనాలు వస్తున్నాయి. ఆదిలాబాద్, నిజామాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో బీజేపీ క్రమంగా బలపడుతోంది. అభ్యర్థుల్ని ప్రకటించిన తర్వాత ఎవరూ ఊహించని స్పందన వస్తోంది. ఆ మూడు జిల్లాల్లో 70 శాతానికిపైగా సీట్లు బీజేపీ ఖాతాలో పడతాయన్న అంచనాలు వస్తున్నాయి. బలమైన అభ్యర్థుల్ని నిలబెట్టడమే కాదు.. పూర్తి స్థాయిలో ప్రచారబరిలోకి దిగారు. సైలెంట్ ప్రచారం ఎక్కువగా జరుగుతోంది. ఓటర్లను నేరుగా కలిసి బీజేపీకి మద్దతుగా ఉండేలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ఫలితం ఓటింగ్ లోనే ఎక్కువగా కనిపిస్తోంది.

ఆదిలాబాద్ జిల్లాలో ఏకపక్షమేనా ?

ఆదిలాబాద్ జిల్లాలో మొదటి నుంచి బీజేపీ బలంగా ఉంది. అక్కడ బీఆర్ఎస్ పార్టీ మజ్లిస్ కే ఎక్కువ ప్రాధాన్యమిస్తూండటం.. ముస్లిం ఓటర్లను ఆకట్టుకునేందుకు హిందువుల ప్రాధాన్యాన్ని తగ్గించడం.. గిరిజనులపై బీఆర్ఎస్ నేతల వివక్ష.. అన్నీ కలిపి వారికి వ్యతిరేకమయ్యాయి. కాంగ్రెస్ పార్టీ రేసులో లేకపోవడంతో బీజేపీ పూర్తి స్థాయిలో రాజకీయాన్ని సద్వినియోగం చేసుకుంటోంది. అక్కడ బాధ్యతల్ని బండి సంజయ్ తీసుకున్నారు. ఆయన దూకుడుతో పార్టీ మరింత దూసుకెళ్తోంది.

నిజామాబాద్ లో అర్వింద్ పట్టు

నిజామాబాద్ లోక్‌సభ పరిధిలో అన్ని స్థానాల్లో గెలుపు బాధ్యతల్ని ఎంపీ ధర్మపురి అర్వింద్ తీసుకున్నారు. ఆయన స్వయంగా కోరుట్ల నుంచి బరిలోకి దిగారు. అర్వింద్ లోక్ సభ స్థానాన్ని గెలిచిన వైనం గురంచి తెలిసిన వారికి.. ఆయనను ఎదుర్కోవడం ఎంత కష్టమో చెప్పాల్సిన పనిలేదు. నిజామాబాద్ జిల్లాలో అత్యధిక స్థానాలు బీజేపీ ఖాతాలో పజడతాయని ఈ కారణంగానే అంచనా వేస్తున్నారు. మరో వైపు రంగారెడ్డి జిల్లాలో … క్రమంగా బలం పుంజుకుంటున్న బీజేపీ.. ఎన్నికల నాటికి స్వీప్ చేస్తుందన్న అంచనాలు వినిపిస్తున్నాయి.