తెలంగాణలో బీజేపీ గెలిచే నియోజకవర్గాల్లో ఖచ్చితంగా ఉండే నియోజకవర్గంగా మహబూబ్ నగర్ పేరు వినిపిస్తోంది. అక్కడి నుంచి మాజీ ఎంపీ ఏపీ జితేందర్ రెడ్డి కుమారుడు మిథున్ కుమార్ రెడ్డి పోటీ చేస్తున్నారు. గతంలో బీజేపీ ఈ స్థానం నుంచి ఎవరి పొత్తు లేకుండా విజయం సాధించింది. ఇప్పుడు మరోసారి అలాంటి విజయం సాధించేందుకు ఏర్పాట్లు చేసుకుంటోంది.
జితేందర్ రెడ్డి పట్టుకున్నదల్లా బంగారం
రాజకీయాల్లో సీనియర్ నేత ఏపీ జితేందర్ రెడ్డి గురించి వేరేగా చెప్పనక్కర్లేదు, ప్రజలకు పరిచయమే అక్కరలేని వ్యక్తిగా ఆయన రాజకీయాల్లో ఎదిగారు. ఆయన ఏ పార్టీలో ఉన్నా.. ఏ టాస్క్ తీసుకున్నా విజయం సాధించి పెడతారు. బీజేపీలో ఉపఎన్నికల్లో ఆయన బాధ్యతలు తీసుకున్న అన్ని నియోజకవర్గాల్లో బీజేపీకి విజయమే లభించిదంి. పొలిటికల్ వ్యూహాల్లో ఆయనను మించిన వారు లేరని చెబుతూంటారు. అలాంటి నేత.. ఇప్పుడు తన కుమారుడుకి మహబూబ్ నగర్ టిక్కెట్ ఇప్పించి పోటీ చేయిస్తున్నారు. గెలిపించి తీసుకు వస్తానని హైకమాండ్ కు మాటిచ్చి ఆ ప్రకారం పని చేస్తున్నారు.
మిధున్ రెడ్డికి యువతలో క్రేజ్
2009లో మిథున్ రెడ్డి విదేశాల నుండి ఇక్కడికి వచ్చారు. తండ్రి వెంటే రాజకీయ ఓనమాలు నేర్చుకుని రాజకీయ వారసుడిగా రంగంలోకి దిగారు. పార్లమెంట్ పరిధిలోని ఆయా నియోజకవర్గాల్లో మిథున్ రెడ్డికి మంచి పేరు ఉంది. ఎంతో మంది కార్యకర్తలతో ఆయనకు నేరుగా సంబంధాలు ఉన్నాయి. చదువు పూర్తి చేశాక హాంకాంగ్ లో మూడు సంవత్సరాల పాటు ఉద్యోగం చేశారు. ఆ తర్వాత 2009లో దేశానికి తిరిగి వచ్చేశారు. ఏదైనా వ్యాపారం చేయాలనే సంకల్పంతో ఏరోప్ స్పేస్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ ను స్థాపించారు. మిస్సైల్ కాంపోనెంట్స్ అండ్ అసెంబుల్స్ పరికరాలను సంబంధించిన కంపెనీ ఇది. రాజకీయాల్లో రాణించి.. తనను తాను ప్రూవ్ చేసుకునేందుకు మిథన్ రెడ్డి కష్టపడుతున్నారు.
మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై వ్యతిరేకత – కాంగ్రెస్ అభ్యర్థి ఒకప్పుడు బీజేపీ నేత
మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. ఆయన ఉద్యోగిగా ఉన్నప్పుడు ఎన్నో సార్లు ఏసీబీ రైడ్స లో దొరికిపోయారు. మంత్రి అయిన తర్వాత ఎదురు లేనట్లుగా వ్యవహరిస్తున్నారు. కబ్జాలతో హోరెత్తిస్తున్నారు. ఆయన పేరు వింటేనే మహబూబ్ నగర్ జనం భయపడుతున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థి లేకపోవడంతో మాజీ బీజేపీ నేత యన్నం శ్రీనివాసరెడ్డికి చాన్సిచ్చింది. ఆయన చాలా కాలంగా చురుకుగా లేకపోవడంతో కాంగ్రెస్ రేసులో లేదని భావిస్తున్నారు.
ఎలా చూసినా మహబూబ్ నగర్లో పోటీ బీఆర్ఎస్, బీజేపీ మధ్యనే ఉంది. బీజేపీకి అడ్వాంటేజ్ కనిపిస్తోంది.