రామలక్ష్మి, శ్రీవల్లి ఇప్పుడు తంగం..ముగ్గురిలో ఎవరు బావున్నారు!

ముఖానికి రంగులు, మోడ్రన్ డ్రెస్సులతో మురిపించే ముద్దుగుమ్మలు ఒక్కసారిగా లుక్ మార్చేస్తున్నారు. పూర్తిగా గ్లామర్ ఫేజ్ నుంచి బయటికొచ్చి పల్లె పడుచులుగా మారిపోతున్నారు. తాజాగా దేవర సినిమా నుంచి జాన్వికపూర్ లుక్ వచ్చింది. లంగాఓణీలో పల్లెపడుచులా కనిపిస్తోన్న జాన్వి లుక్ ను గతంలో రంగస్థలం, పుష్ప మూవీస్ లో హీరోయిన్స్ లుక్ తో పోల్చుతున్నారు నెటిజన్లు..ఇంతకీ ముగ్గురిలో ఎవరు బావున్నారనే డిస్కషన్ నడుస్తోంది..

హీరోయిన్ అంటే అందంగా కనిపించాలనే ఆలోచన నుంచి తారలు బయటకువచ్చేశారు. గ్లామర్ ఫేజ్ నుంచి బయటికొచ్చి పల్లె పడుచులుగా మారిపోతున్నారు. ఓవైపు గ్లామరస్‌ క్యారెక్టర్స్‌కి సై అంటూనే మరోవైపు పర్ఫార్మెన్స్‌కి స్కోప్‌ ఉన్న క్యారెక్టర్లకు ఓటేస్తున్నారు. సమంత నుంచి జాన్వీ వరకూ అందరూ ఈ లుక్ లో అదుర్స్ అనే చెప్పాలి.

‘దేవర’లో తంగం
దేవరలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఊరమాస్ గెటప్ లో వయెలెంట్ గా కనిపించి వావ్ అనిపించడంతో పాటు సినిమాపై అంచనాలు పెంచుతున్నాడు. జాన్వీ మాత్రం పల్లెటూరు పిల్లగా కనిపించి ఫిదా చేస్తోంది. గ్రీన్ విత్ బ్లూ కలర్లో డ్రైస్ , చేతికి మట్టి గాజులతో పాటు జడ వేసుకుంది. చిరునవ్వులు చిందిస్తూ నడుమాందాలు చూపిస్తూ కనువిందు చేస్తోంది. చేపలు పట్టే ఫ్యామిలీకి చెందిన అమ్మాయిగా తంగం రోల్ లో జాన్వీ నటిస్తోంది. జాన్వి లుక్ బయటకు రావడంతో గతంలో సమంత, రష్మికతో కంపేర్ చేస్తున్నారు నెటిజన్లు..

‘రంగస్థలం’లో రామలక్ష్మి
సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘రంగస్థలం’ సినిమాలో సమంత ఆ కథకు తగ్గట్టుగా పల్లెటూరి యువతిగా కనిపించింది. పాపిడి తీసి రిబ్బన్ తో జడ వేసుకుని, లంగా ఓణీతో అచ్చం పల్లెటూరి అమ్మాయిలా కనిపించి ఆకట్టుకుంది. ఈ క్యారెక్టర్ కోసం స్కిన్ కలర్ కూడా తగ్గించుకుంది సామ్.

‘పుష్ప’
‘పుష్ప’ మూవీలో రష్మిక కూడా డీ గ్లామర్ గా కనిపించింది. బంగారం లాంటి మేనిఛాయకి మట్టి రంగు రాసుకుని శ్రీవల్లి పాత్రకి న్యాయం చేసింది. ఈ మూవీతో నేషనల్ లెవల్ లో క్రేజ్ సొంతం చేసుకుంది.

ఇంకా గబ్బర్ సింగ్ లో శృతి హాసన్, గద్దలకొండ గణేష్ లో పూజా హెగ్డేలు పర్వాలేదనిపించుకున్నాడు. ఇప్పుడు ఇంచుమించు ఇదే లుక్ లో కనిపిస్తోంది జాన్వి.