కాన్స‌ర్‌కు క‌ణాల‌కు వ్య‌తిరేకంగా పోరాడే ఈ మొక్క గురించి తెలుసా!

బ్ర‌హ్మ‌జెముడు మొక్క గురించి విన్నాం కానీ ఈ ఎలుక జెముడు మొక్క గురించి ఎప్పుడూ విన‌లేదే అనుకుంటున్నారా?..నిజమే ఈ మొక్క గురించి ఎవరికీ పెద్దగా తెలియదు. తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు. ఆయుర్వేదంలో ఈ ఎలుక‌జెముడు మొక్క‌కు చాలా విశిష్ట‌త ఉంది. గ్రామాల్లో ఎలుక చెవి మొక్క‌గా దీనిని పిలుస్తారు. చెరువు గ‌ట్ల‌పైన‌, వాగుల అంచున ఇవి క‌నిపిస్తాయి. ఆయుర్వేద మందుల్లో ఈ మొక్క‌ను విరివిగా వాడుతుంటారు.

నులిపురుగుల సమస్యకు చెక్
నులిపురుగుల సమస్య తో బాధపడుతున్న వారు బియ్యప్పిండిలో, ఎలుక చెవి ఆకు రసాన్ని, సైంధవ లవణాన్ని చేర్చి రొట్టెలు చేసుకుని తింటే కడుపులో నులి పురుగులు పోతాయి. కడుపులో నొప్పి కూడా తగ్గిపోతుంది.

గర్భం నిలబడుతుంది
చాలామంది గర్భం నిలబడక బాధపడుతుంటారు. అలాంటప్పుడు ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయిన వెంటనే గర్భం నిలబడటానికి ఎలుక చెవి రసాన్ని చెరుకు రసంతో కలిపి తాగితే గర్భస్రావం జరగదు.

కటి సమస్యలు తగ్గుతాయి
కంటి సమస్యలు ఉన్నవారు ఈ ఆకులను కూర వండుకుని తింటే నేత్ర సమస్యలు తగ్గిపోతాయి. ఈ ఆకుల రసాన్ని గోమూత్రం లో కలిపి తాగితే చర్మ సంబంధిత సమస్యలు రావు.

కేన్సర్ కణాలతో పోరాడుతుంది
ఈ మొక్క మన శరీరంలో ఉన్న వేడిని తగ్గించడానికి అద్భుతంగా సహాయపడుతుంది. ఇది రక్తహీనతను తగ్గిస్తుంది. దీనిలో విటమిన్ సి ఉంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. క్యాన్సర్ కణాలకు వ్యతిరేకంగా పోరాడుతుంది. ఎలక జముడు మొక్క క్యాన్సర్ ను నివారించడం లో కీలక పాత్ర పోషిస్తుంది. ఫ్రీ రాడికల్స్ తో పోరాడుతుంది. మూత్ర సంబంధిత సమస్యలను తగ్గించడంతో పాటూ కిడ్నీ లో రాళ్లను కరిగించడానికి చక్కగా పనిచేస్తుంది. మైగ్రేన్ తలనొప్పి, పార్శ్వనొప్పి కూడా తగ్గిస్తుంది.

వైరల్ ఫీవర్స్ తగ్గించే కషాయం
ఎలుక జెముడు ఆకులతో కషాయాన్ని తయారు చేసుకుని మూడు నెలల వ్యవధిలో 15 రోజుల పాటూ తాగాలి. మళ్లీ మూడు నెలల తర్వాత మళ్లీ 15 రోజులు తీసుకోవాలి. ఇలా చేస్తే జ్వరం, దగ్గు, జలుబు సహా వైరల్ ఫీవర్స్ తగ్గుతాయి.

గమనిక: ఆరోగ్య నిపుణులు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. దీనిని ఏ మేరకు విశ్వశించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం.