కామారెడ్డి నియోజకవర్గం.. ఇప్పుడు అందరి దృష్టి ఆకర్షిస్తోంది. ఎందుకంటే బీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కామారెడ్డిని రెండో నియోజకవర్గంగా ఎంచుకుని పోటీ చేయబోతున్నారు. తెలంగాణలో బీఆర్ఎస్‌కు సిద్దిపేట లాంటి కొన్ని కంచుకోట నియోజకవర్గాలు ఉన్నాయి. ఆ జాబితాలో కామారెడ్డి లేదు. ఎందుకంటే ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడినప్పుడు ఉత్తరతెలంగాణలో బీఆర్ఎస్ మెజార్టీలు కళ్లు తిరిగే స్థాయిలో ఉన్నప్పుడు కూడా కామారెడ్డిలో బీఆర్ఎస్‌కు ఏకపక్ష విజయాలు రాలేదు.
కామారెడ్డిలో బీఆర్ఎస్ పై తీవ్ర వ్యతిరేకతత
కామారెడ్డిలో కేటీఆర్ బహిరంగ సభ నిర్వ హించారు. కేసీఆర్ తరపున ఎమ్మెల్సీ సుభాశ్‌రెడ్డి, ఎమ్మెల్యే గంప గోవర్ధన్, జిల్లా అధ్యక్షుడు ము జీబుద్దీన్‌లు అన్నీ తామై పని చేస్తున్నారు. ఇక్కడి నుంచి 2018లో టీఆర్‌ఎస్‌వ పక్షాన గంపా గోవర్దన్, కాంగ్రెస్ తరపున సీనియర్ నేత, మాజీ మంత్రి, శాసనమండలిలో ప్రతిపక్ష నేతగా పనిచేసిన షబ్బీర్ అలీ పోటీ పడగా, గోవర్దన్ నే విజయం వరించింది. గోవర్దన్ 4557 ఓట్ల తేడాతో విజయం సాదించగలిగారు. గోవర్దన్ బిసిలలోని పెరిక సామాజికవర్గానికి చెందినవారు.గతంలో ఈయన టిడిపిలో ఉండేవారు.తెలంగాణ ఉద్యమ సమయంలో ఆయన పార్టీ నుంచి బయటకు వచ్చి టిఆర్‌ఎస్‌లో చేరారు. అప్పటి నుంచి వరసగా గెలుస్తున్నారు. కామారెడ్డిలో బీజేపీ పక్షాన పోటీచేసిన కె.వెంకటరమణారెడ్డికి పదిహేనువేలకు పైగా ఓట్లు వచ్చాయి. గంపా గోవర్దన్ రెండువేల తొమ్మిదిలో టిడిపి పక్షాన గెలిచినా, ఆ తర్వాత పార్టీకి రాజీనామా చేసి ,టిఆర్‌ఎస్ లో చేరి తిరిగి ఉప ఎన్నికలో విజయం సాధించారు.
కామారెడ్డి మాస్టర్ ప్లాన్ పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత
ఈ ఏడాది జనవరిలో రెండు, మూడు వారాల పాటు కామారెడ్డి మొత్తాన్ని వణించిన ఉద్యమం మాస్టర్ ప్లాన్ కు వ్యతిరేకింగా జరిగింది. కామారెడ్డి పట్టణానికి మున్సిపల్ అధికారులు ఓ మాస్టర్ ప్లాన్ ముసాయిదా రూపొందించారు. దానిపై ప్రజాభిప్రాయాన్ని సేకరించారు. అయితే ఈ మాస్టర్ ప్లాన్ కారణంగా భూములు పోతున్నాయన్న ఆందోళనతో 8 గ్రామాల రైతులు ఉద్యమం ప్రారంభించారు. డ్రాఫ్ట్ మాస్టర్ ప్లాన్‌ను 2022 నవంబర్ చివరిలో ప్రకటించారు. ఇందులో చూపెట్టిన ఇండస్ర్టియల్ జోన్, గ్రీన్ జోన్, రీక్రియేషన్ జోన్, 100 ఫీట్లు, 80 ఫీట్ల రోడ్ల ప్రతిపాదనలపై ఆయా గ్రామాలకు చెందిన రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. భూములు పోతాయన్న ఆందోళనతో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నారు. మరో రైతు ఆత్మహత్యాయత్నం చేశారు. ఇటీవల జిల్లా కేంద్రంలో రైతుల భారీ ర్యాలీ, కలెక్టరేట్ ఎదుట ధర్నా, జిల్లా కేంద్రం బంద్ పోగ్రాములు సక్సెస్ అయ్యాయి. దీంతో రైతుల ఉద్యమం రాష్ర్ట వ్యాప్తంగా చర్చగా మారింది. అప్పట్లో ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ రద్దుపై ఆసక్తి చూపలేదు. కానీ రైతుల ఆగ్రహంతో మున్సిపాలిటీలో తీర్మానం చేశారు. అధికారికంగా రద్దు కాలేదు. పరిసథితి గమనించిన కేటీఆర్ హ ఠాత్తుగా మాస్టర్ ప్లాన్ రద్దు ప్రకటించారు.
అబివృద్ధి పనలన్నీ మాటల్లోనే !
కామారెడ్డిలో చాలా కాలంగా పనులు పెండింగ్ లో ఉన్నాయి. కామారెడ్డి టౌన్‌కు మంత్రి కేటీఆర్ రూ.45 కోట్ల ఫండ్స్ శాంక్షన్ చేస్తున్నట్లు ప్రకటించారు. మున్సిపాలిటీ పరిధిలో రోడ్ల వెడల్పు పనులు, సెంట్రల్ లైటింగ్, డివైడర్ల నిర్మాణం, వార్డులో సీసీ, బీటీ రోడ్లు, డ్రైనేజీలు, కొన్ని చోట్ల కమ్యూనిటీ హాల్స్ నిర్మాణాలకు ఈ ఫండ్స్ ఖర్చు చేస్తారు. స్టేడియం కాంప్లెక్స్ తదితర పనులకు మిగతా రూ. 20 కోట్లు కేటాయిం చారు. కానీ పనులు ఊపందుకోలేదు. అదే సమయంలో సంక్షేమ పథకాల విషయంలో సమస్యలు ఉన్నాయి. దళిత బంధు కొంత మందికే వచ్చింది. అదీ కూడా బీఆర్ఎస్ నేతలకే దీనిపై దళిత వర్గాలు అసంతృప్తిగా ఉన్నాయి. ఇతర పథకాల విషయంలోనూ అంతే. అందుకే .. కామారెడ్డిలో కేసీఆర్‌కు అంత సులువు కాదన్న వాదన వినిపిస్తోంది.