ఆహా ఏమి రూచి అనరా మైమరచి..అనే పాటే ఊంది వంకాయపై. గుత్తివంకాయ, వంకాయ కారం, మసాలా వంకాయ, వంకాయ ఫ్రై సహా ఇతర కూరగాయలతో కలసి వంకాయను వండుతారు. ఎలా చేసినా ఈ కూరటేస్టే వేరు. అయితే టేస్ట్ ఎంత బావున్నా కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్న వాళ్లు వంకాయ కూరను తినకపోవడమే మంచిది అంటున్నారు ఆరోగ్య నిపుణులు…
వంకాయలో ఎన్నో ఔషధగుణాలుంటాయి. శరీరానికి అవసరమైన ఎన్నో రకాల పోషకాలను అందిస్తుంది. సీజన్ తో సంబంధం లేకుండా మార్కెట్ లో దొరుకుతాయి. బరువు తగ్గడానికి కూడా వంకాయ ఉపయోగపడుతుంది. ఇంకా మధుమేహులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. దీన్ని తింటే రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. అలాగే గుండె జబ్బులకు కూడా దూరంగా ఉంటారు. అయితే ఆయుర్వేదం ప్రకారం కొన్ని వ్యాధులతో బాధపడేవారు వంకాయకు దూరంగా ఉండాలి. ఎందుకంటే ఈ వంకాయ ఆ సమస్యలను మరింత పెంచుతుంది.
కిడ్నీల్లో రాళ్లు
కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడేవారు వంకాయలకు దూరంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వంకాయల్లో ఆక్సలేట్ అనే మూలకం ఉంటుంది. ఇది మూత్రపిండాల్లో రాళ్ల పరిమాణాన్ని మరింత పెంచుతుంది.
రక్త లోపం
రక్తహీనత సమస్య ఉన్నవారు కూడా వంకాయను తినకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే వంకాయను తింటే శరీరంలో ఇనుము లోపం మరింత పెరుగుతుంది. దీంతో మీ సమస్య మరింత పెరుగుతుంది.
అలెర్జీ సమస్య
మీకు ఎలాంటి అలెర్జీ సమస్య ఉన్నా వంకాయలను పొరపాటున కూడా తినకండి. ఎందుకంటే వంకాయల్లో ఎన్నో సమ్మేళనాలు అలెర్జీ సమస్యను మరింత పెంచుతాయి.
బలహీనమైన జీర్ణవ్యవస్థ
మీ జీర్ణవ్యవస్థ బలహీనంగా ఉన్నా, కడుపు సమస్యలతో తరచుగా బాధపడుతున్నా వంకాయను పొరపాటున కూడా తినకండి. ఎందుకంటే ఇది మీ సమస్యలను మరింత పెంచుతుంది. గ్యాస్, ఎసిడిటీ వంటి జీర్ణసమస్యలు ఉంటే వంకాయను తినకపోవడమే మంచిది.
కంటి సమస్యలు
కంటి సమస్యలున్నవారు కూడా వంకాయను తినకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇది కంటిసమస్యలను పెంచుతుంది. అందుకే దీన్ని పొరపాటున కూడా తినకండి.
గమనిక: ఆరోగ్య నిపుణులు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. దీనిని ఏ మేరకు విశ్వశించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం.