హుజూరాబాద్‌లో మరోసారి ఈటలే – రేసులో లేని కాంగ్రెస్ – పోటీ ఇవ్వలేని కౌశిక్ రెడ్డి !

వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఖచ్చితంగా గెలిచే నియోజకవర్గాల్లో మొదట ఉండేది హుజూరాబాద్ నియోజకవర్గం. ఈటల రాజేందర్ మరోసారి అక్కడ్నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన ప్రచారానికి పెద్దగా సమయం కేటాయించక పోయినా గెలుపు ఖాయమని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. గజ్వేల్ లో కేసీఆర్ పై కూడా పోటీ చేస్తున్నారు. రెండు చోట్ల పోటీ చేస్తున్నా… హుజూరాబాద్ లో మాత్రం పరిస్థితి ఆయనకు అనుకూలంగానే ఉండనుంది.

ఉపఎన్నికల్లో వందల కోట్లు ఖర్చు పెట్టినా గెలవని బీఆర్ఎస్

సాధారణంగా బైపోల్‌లో అధికార పార్టీదే హవా ఉంటుందని తెలుసు. కానీ, హుజూరాబాద్‌లో మాత్రం అలా జరుగలేదు. అధికార టీఆర్ఎస్ పార్టీని ఢీకొట్టి మరీ ధీటుగా నిలిచారు ఈటల రాజేందర్. హుజూరాబాద్‌లో మరోసారి జయకేతనం ఎగురవేశారు. టీఆర్ఎస్‌పై ఛాలెంజ్‌ చేసి మరీ ఈటల రాజేందర్ మరోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. నియోజవర్గంలోని 5 మండలాల్లోనూ ఆధిపత్యం చేలాయించారు. వచ్చే ఎన్నికల్లోనూ ఇదే పరిస్థితి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈటలను ఓడించడానికి కేసీఆర్ వందల కోట్లు ఖర్చు చేశారు. అయినా ప్రయోజనం లేకపోయింది.

ఈటలకు అనుకూలంగా సామాజిక సమీకరణాలు

క్యాస్ట్ ఈక్వేషన్స్‌ కూడా ఈటలకు కలిసొస్తున్నాయి. బీసీ ఓట్లు మొత్తం ఈటలకే మద్దతుగా ఉంటున్నాయి. ఆయన భార్య రెడ్డి సామాజికవర్గానికి చెందిన వారు కావడంతో.. రెడ్డి సామాజికవర్గం కూడా ఈటలకు అండగా నిలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ అక్కడ పూర్తిగా నిర్వీర్యం అయింది. కాంగ్రెస్ ఓటుబ్యాంక్‌. మొత్తం ఈటలకు మళ్లింది. అదే సమయంలో దళితబంధుతో ఇతర కుల్లాల్లో అసంతృప్తి.. దళితబంధు పథకం రివర్స్‌ అయింది. ఇప్పటికి చాలా మందికి దళిత బంధు రాలేుదు. ఆరుసార్లు గెలిచిన అనుభవం.. ఈటలకు నియోజకవర్గంపై మంచి పట్టు ఉంది. సొంత గ్రామం కమలాపూర్‌లోనూ తిరుగులేని ఓటు బ్యాంక్ ఉంది. మరోసారి ఆయనకు తిరుగులేని విజయం ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.

అంతకంతకూ పెరుగుతున్న బీజేపీ బలం

నియోజకవర్గంలో పరిచయాలు.. ఈటలకు నియోజకవర్గంలోనూ వ్యక్తిగత పరిచయాలున్నాయి. మొత్తం 5 మండలాల్లోనూ వ్యాపారవేత్తలు, రైతులు, కులసంఘాల నేతలు… ఇలా అందరితోనూ మంచి సంబంధాలున్నాయి. పార్టీలకు అతీతంగా ఆ ఓట్లన్నీ ఈటలకు పడతాయి. ఈటల రాజేందర్ క్రమంగా బీజేపీని బలపర్చుకుంటూ వస్తున్నారు. గ్రామ స్థాయిలోనూ బీజేపీ బలపడింది.