నిర్మలా జిల్లా కేంద్రం నిర్మల్ నియోజకవర్గంలో బీజేపీ హవా కనిపిస్తోంది. బీజేపీ అభ్యర్థి ఏలేటి మహేశ్వర్ రెడ్డి హాట్ ఫేవరేట్ గా కనిపిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బిజెపి పార్టీలో చేరడంతో అప్పటినుండి నిర్మల్ నియోజకవర్గంలో రాజకీయా సమీకరణలు చకచకా మారిపోతున్నాయి నియోజకవర్గంలో పార్టీ బలోపేతం కోసం నడుం బిగించారు. కార్యకలాపాలను తీవ్రతరం చేశారు. ఆయా రాజకీయ పార్టీల్లో బలం ఉన్న నేతలను పార్టీలో చేర్చుకున్నారు. ప్రజల కోసం పోరాటం చేశారు. దీంతో బీజేపీ కీలక స్థానంలోకి వచ్చింది. అనేక సర్వేల్లో నిర్మల్ లో బీజేపీ గెలిచే అవకాశం ఉందని తేలింది.
మంత్రి అల్లోలపై తీవ్ర వ్యతిరేకత
నిర్మల్ నియోజకవర్గంలో 2.38 లక్షల ఓట్లు ఉన్నాయి. ఈ నియోజకవర్గం నుంచి గెలిచిన అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ నియోజకవర్గం నుంచి 1999, 2004లో కాంగ్రెస్ పార్టీ తరపున అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి గెలిచారు. 2009లో ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన ఏలేటి మహేశ్వర్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. 2014 ఎన్నికల్లో అల్లోల ఇంద్రకరణ్ రెడ్డిని కాదని, ప్రజారాజ్యం తరపున గెలిచిన సిట్టింగ్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ టిక్కెట్టు ఇచ్చింది. దీంతో ఇంద్రకరణ్ రెడ్డి బీఎస్పి తరపున పోటీ చేసి విజయం సాధించారు. టీఆర్ఎస్ అభ్యర్థి కూచడి శ్రీహరిరావుపై 8,628 ఓట్ల ఆధిక్యతతో గెలిచారు. ఇంద్రకరణ్ రెడ్డికి 61,368 ఓట్లు రాగా, కూచడి శ్రీహరిరావుకు 52,871 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థి 38,951 ఓట్లతో మూడో స్థానాన్ని సరిపెట్టుకున్నారు. ఆ తరువాత ఇంద్రకరణ్ రెడ్డి టిఆర్ఎస్లో చేరి కెసిఆర్ మంత్రివర్గంలో దేవాదాయ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2018 ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ తరపున ఇంద్రకరణ్ రెడ్డే గెలిచారు. కాంగ్రెస్ అభ్యర్థి ఏలేటి మహేశ్వర్ రెడ్డిపై 9,271 ఓట్ల మెజార్టీతో ఇంద్రకరణ్ రెడ్డి విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో ఇంద్రకరణ్ రెడ్డికి 79,985 ఓట్లు రాగా, మహేశ్వర్‌రెడ్డికి 70,714 ఓట్లు వచ్చాయి. కేసిఆర్ రెండో మంత్రివర్గంలో కూడా స్థానం దక్కించుకున్న ఇంద్రకరణ్ రెడ్డి, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బిఆర్ఎస్ టిక్కెట్టు దక్కించుకున్నారు. ఇంద్రకరణ్‌రెడ్డి ఆరోసారి నిర్మల్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. మహేశ్వర్ రెడ్డి బీజేపీ తరపున పోటీ చేస్తున్నారు.
బీఆర్ఎస్ నుంచి బీజేీలో చేరికలు
నిర్మల్ నియోజకవర్గంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి తన సొంత ఇలాకాలో వరుసగా గట్టి దెబ్బలు తగులుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీ పట్టణ యూత్ అధ్యక్షులు మున్నూరు కాపు యువజన సంఘం మాజీ అధ్యక్షులు అప్పల వంశీ శుక్రవారం గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పారు. ర్మల్ నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఏలేటి మహేశ్వర్ రెడ్డి సమక్షంలో కమలం గూటికి చేరారు. మున్నురుకాపు యువజన సంఘం సభ్యులు గంజి రాజు, బండారి రాజేష్ లు సైతం బీజేపీలో చేరారు. మంజులపూర్ కు చెందిన రెండు వందల మంది బిఅరెస్ కు చెందిన నాయకులు ,కార్యకర్తలు, యువకులు పెద్ద ఎత్తున బీజేపీ అభ్యర్థి మాహేశ్వరెడ్డి సమక్షంలో కాషాయ కాండువ కప్పుకున్నారు. ఇలాంటి ద్వితీయశ్రేణి నేతల చేరికలు వరుసగా జరుగుతున్నాయి.
పలు సర్వేల్లో మహేశ్వర్ రెడ్డి గెలుపు సంకేతాలు
పలు సర్వేల్లో నిర్మల్ బీజేపీ అభ్యర్థి మహేశ్వర్ రెడ్డి గెలుపు ఖాయమని చెెబుతున్నారు. బీజేపీకి 35 శాతం ఓట్లు వస్తూంటే.. బీఆర్ఎస్కు 30 శాతం.. కాంగ్రెస్‌కు ఇరవై ఆరు శాతం ఓట్లు వస్తాయని అంచనా వేస్తున్నారు. ఎలా చూసినా ఈ సారి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి గడ్డు పరిస్థితేనని.. బీజేపీకి అడ్వాంటేజ్ ఉందని తేలిపోయింది.