ఎన్నో రూపాల్లో ఆంజనేయుడు – ఇంట్లో ఎలాంటి ఫొటో ఉండాలి!

ఆంజనేయుడిని ధైర్యానికి, శక్తికి ప్రతీకగా పరిగణిస్తారు. రామభక్తుడిగా, వాయుపుత్రుడిగా, మారుతీగా, భజరంగబలిగా, అంజనీపుత్రుడిగా పిలుస్తారు. ఎక్కడైతే రామ భజన వినిపిస్తుందో అక్కడ ఏదో మూలన ఆంజనేయుడు వచ్చి కూర్చుంటాడని పండితులు చెబుతారు. ఎవరైతే భక్తి శ్రద్ధలతో హనుమంతుడిని పూజిస్తారో వారి కోరికలన్నీ నెరవేరుతాయని విశ్వాసం. అందుకే హనుమంతుడు ఫొటో లేని ఇల్లు ఉండదు. అయితే విభిన్న రూపాల్లో కనిపించే ఆంజనేయుడికి సంబంధించి ఎలాంటి ఫొటో ఇంట్లో ఉంటే మంచిది? ఏ దిశగా ఉండాలి?

పంచముఖ ఆంజనేయుడు
పంచముఖ హనుమాన్ ఫొటో ఇంట్లో పెట్టుకుంటే తలపెట్టిన పనుల్లో ఆటంకాలన్నీ తొలగిపోతాయి. అనారోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి. శత్రువుల బాధ తొలగిపోతుంది.

పర్వతాన్ని మోసుకెళ్తున్నట్లు
సంజీవన పర్వతాన్ని మోసుకెళ్తున్నట్లు కనిపించే హనుమాన్ ఫోటోను ఇంట్లో ఉంచడం వల్ల ధైర్యం, బలం, విశ్వాసం పెరుగుతుంది.

ధ్యానంలో కూర్చున్న హనుమాన్
తెల్లని శరీరంతో ధాన్యం చేస్తున్నట్లు కూర్చుని ఉండే హనుమాన్ ఫోటోను ఇంట్లో ఉంటే మంచి ఉద్యోగం, పదోన్నతి, పని ఒత్తిడి తట్టుకునే శక్తి లభిస్తుందని నమ్మకం

శ్రీరామ భజన చేస్తున్న ఫొటో
శ్రీరామ భజన చేస్తూ భక్తితో పరవశించిపోయే హనుమాన్ ఫోటోను ఇంట్లో ఉంచుకోవడం వల్ల ఆధ్యాత్మిక ఆనందం లభిస్తుంది.

శ్రీరాముడిని కౌగిలించుకున్న ఫొటో
ఆంజనేయుడు, శ్రీరాముడు కౌగిలించుకుని ఉన్నట్లుగా ఉండే రూపంలో ఉన్న హనుమాన్ ఫోటోను ఇంట్లో ఉంచుకోవడం వల్ల కుటుంబంలో ఐక్యత, స్నేహపూర్వక స్వభావం పెరుగుతుంది. దంపతుల మధ్య సాన్నిహిత్యం పెరుగుతుంది

వాస్తు ప్రకారం దక్షిణ దిక్కుకి యముడు అధిపతి. అందుకే చనిపోయినవారి ఫొటోలను ఈ దిశలో పెడతారు. అయితే ఆ ఫొటోలకు ఎదురుగా… అంటే.. ఉత్తరం వైపున్న గోడకి ఆంజనేయుడి ఫొటో పెడితే ఇంట్లో ప్రతికూల శక్తులు తగ్గుతాయని పండితులు చెబుతారు.

గమనిక: కొందరు పండితులు, కొన్ని పుస్తకాలు ఆధారంగా సేకరించిన సమాచారం ఇది. దీనిని ఎంత వరకూ విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం.