ఆర్మూరులో బీజేపీ నేతకు టిక్కెట్ ఇచ్చిన కాంగ్రెస్ – కానీ కమల వికాసమే !

నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని ఆర్మూరు నియోజకవర్గంలో ఈ సారి బీజేపీ జెండా ఎగరడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ నియోజకవర్గం నుంచి పారిశ్రామికవేత్త పైడి రాకేష్ రెడ్డి పోటీ చేస్తున్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా మంచి సంబంధాలు ఉన్న రాకేష్ రెడ్డికి నుంచి టిక్కెట్ ను ఖరారు చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి 30వేలకుపైగా మెజార్టీ ఈ నియోజకవర్గంలో బీజేపీకి వచ్చింది.

కాంగ్రెస్ కు అభ్యర్థి కరవు – బీజేపీకి నేతకు టిక్కెట్

నిన్నామొన్నటిదాకా బీజేపీ నేతగా ఉండి…. గత ఎన్నికల్లో కూడా పోటీ చేసిన ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి కి కాంగ్రెస్ టిక్కెట్ ఇచ్చింది. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్న ఆర్మూర్ లో.. ప్రస్తుతం ఆ పార్టీ పరిస్థితి ఏమాత్రం ఆశాజనకంగా లేదు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి రెండో స్థానంలో నిలిచిన ఆకుల లలిత, అంతకు ముందు పోటీ చేసిన మాజీ స్పీకర్ సురేశ్ రెడ్డి సైతం కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ లో చేరారు. దీంతో అధికార పార్టీ ఇక్కడ మరింత బలపడగా.. కాంగ్రెస్ బలహీనమైంది. ఆర్మూర్ లో సరైన అభ్యర్థి లేని పరిస్థితి. చివరికి బీజేపీ నేతకు టిక్కెట్ ిచ్చారు.

బీఆర్ఎస్ – బీజేపీ మధ్యనే పోటీ

బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఆశన్నగారి జీవన్ రెడ్డి ఉన్నారు. ఆయనపై తీవ్ర వ్యతిరేకత ఉంది. ఆర్మూరు నియోజకవర్గంలో రాజకీయాలన్నీ బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీగా అన్నట్లుగా సాగాయి. రేవంత్ రెడ్డి రైతు దీక్ష చేపట్టిన తర్వాత ఆర్మూర్ లో కాంగ్రెస్ పెద్దగా కార్యక్రమాలేవీ చేపట్టలేదు. దీంతో పార్టీ కేడర్ అసంతృప్తితో ఉంది. గ్రెస్ కు బలమైన క్యాడర్ ఉన్నప్పటికీ, పార్టీని ముందుకు నడిపే నాయకుడు లేకపోవడంతో కార్యకర్తలు నిరుత్సాహంతో ఉన్నారు. బీజేపీ నుంచి వచ్చిన వినయ్ కుమార్ రెడ్డి పెద్దగా ప్రభావం చూపే పరిస్థితి లేదు.

ఎంపీ అర్వింద్ ప్రత్యేక దృష్టి

1952 లో ఆర్మూర్ నియోజకవర్గం ఏర్పాటైంది. టీడీపీ ఆవిర్భావం వరకూ ఇక్కడ కాంగ్రెస్ హవానే కొనసాగింది. ఆ తర్వాత టీడీపీ సత్తా చాటింది. 2014, 2018లో బీఆర్ఎస్ అభ్యర్థి ఆశన్నగారి జీవన్ రెడ్డి వరుసగా విజయం సాధించారు. మరోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని ఆయన తహతహలాడుతున్నారు. జిల్లా అధ్యక్ష బాధ్యతలను కూడా జీవన్ రెడ్డికి కట్టబెట్టిన బీఆర్ఎస్ అధిష్టానం ఆయనపై పూర్తి విశ్వాసంతో ఉంది. ఆర్మూర్ నియోజకవర్గంలో రాకేష్ రెడ్డి లాంటి నాయకులు బీజేపీలో పార్టీని ముందు నడిపిస్తున్నందున రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్మూర్ నియోజకవర్గంలో బీజేపీ విజయం ఖాయమని రాజకీయ విశ్లేషకుల్లో చర్చ జరుగుతోంది. ఎంపీ అర్వింద్ ఈ నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి పెట్టారు.