పార్లమెంట్ ఫలితాలు రిపీట్ అయితే అసెంబ్లీకి ధర్మపురి అర్వింద్ – కోరుట్లలో ప్రస్తుత పరిస్థితి ఇదీ !

తెలంగాణ బీజేపీ ఈసారి సీనియర్ నేతలను రంగంలోకి దించుతోంది. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ కోరుట్ల నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతున్నార. నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్‌లోని అన్ని అసెంబ్లీ స్థానాల్లో కాషాయ జెండా ఎగురవేయాలని ఎంపీ ధర్మపురి అరవింద్ భావిస్తున్నారు. కోరుట్ల నుంచి స్వయంగా బరిలో నిలవాలని అరవింద్ నిర్ణయించుకోవడంతో హైకమాండ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

పార్లమెంట్ ఎన్నికల్లో కోరుట్లలో బీజేపీకి 20వేల మెజార్టీ

నిజామాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధిలో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. ఈ ఏడింటిలో ఐదు అసెంబ్లీ స్థానాల్లోనూ బీజేపీ ఆధిక్యాన్ని ప్రదర్శించింది. ఆర్మూర్‌ నియోజకవర్గంలో అత్యధికంగా బీజేపీకి 31,588 ఓట్ల మెజారిటీ వచ్చింది. నిజామాబాద్‌ రూరల్‌లో 13,185 ఓట్లు, బాల్కొండలో 11,731 ఓట్లు, కోరుట్లలో 20,022 ఓట్లు, జగిత్యాలలో 7,320 ఓట్ల ఆధిక్యం సాధించింది. నిజామాబాద్‌ అర్బన్, బోధన్‌ సెగ్మెంట్లలో టీఆర్‌ఎస్‌ కంటే స్వల్ప మెజారిటీ తగ్గింది. మొత్తం మీద 70 వేలపైచిలుకు మెజారిటీ దక్కింది.

ధర్మపురి అరవింద్‌కు సామాజికవర్గం

నిజామాబాద్‌ పార్లమెంట్‌ పరిధిలోని కోరుట్ల అసెంబ్లీ నియోజక వర్గంలో సొంత సామాజిక వర్గం ఓట్లు ఎక్కువగా ఉండటం, ఇటీవలే ప్రధాని నరేంద్రమోదీ నిజామాబాద్‌ బహిరంగసభలో పసుపు బోర్డును మంజూరు చేస్తున్నట్లు ప్రకటించడం.. ఎన్నోఏళ్లుగా మూతపడ్డ షుగర్‌ ఫ్యాక్టరీని ప్రధాని మోదీ, అమిత్‌షాల దృష్టికి తీసుకెళ్లానని త్వరలోనే పునః ప్రారంభింపజేస్తాననే హమీతో అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లు అడిగేందుకు అరవింద్ సిద్ధమయ్యారు. కోరుట్ల నియోజక వర్గంలో పసుపు, చెరుకు పంటలు పండించే రైతులు అత్యధికంగా ఉండటం ఎన్నికల్లో కలిసొస్తేందునే ఆశాభావంతో కోరుట్ల నుంచే పోటీ చేసేందుకు సిద్ధమ్యయారు.

కోరుట్లలో బలంగా బీజేపీ క్యాడర్

కోరుట్లలో బీజేపీ పార్టీకి క్షేత్రస్థాయిలో ఇప్పటికి కార్యకర్తలు, నాయకులకు కొదవలేకపోవడం కూడా పార్టీ గెలుపుణకు దోహదపడుతుందని ఎంపీ ధర్మపురి అర్వింద్‌ భావిస్తున్నారు. కోరుట్లలో విజయం సాధించడం సులువు అవుతుందని .. . బీజేపీ కేంద్ర కమిటీ నాయకులు పార్లమెంట్‌ సభ్యులంతా అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్లమెంట్‌ పరిధిలోని ఏదోఒక అసెంబ్లీ నుంచి పోటీ చేయాల్సిందేనని స్పష్టం చేయడంతో నిజామాబాద్‌ పార్లమెంట్‌ పరిధిలోని కోరుట్ల అసెంబ్లీ నుంచి బరిలో దిగేందుకే ఎంపీ ధర్మపురి అర్వింద్ నిర్ణయానికి వచ్చారు. గ్రౌండ్ వర్క్ కూడా ప్రారంభించారు. ఇటీవలి కాలంలో చేరికల్నీ ప్రోత్సహించారు. అందుకే ఈ సారి కోరుట్ల బీజేపీ ఖాతాలో పడుతుందని ఎక్కువ మంది నమ్ముతున్నాు.