హాయిగా నిద్రపోవాలి అనుకుంటున్నారా..ఈ టిప్స్ ఫాలో అవండి!

నిద్ర పట్టకపోవడం..చాలామందికి సమస్యగా మారిన సమస్య. నిద్రలేకపోవడం వల్ల ఏకాగ్రత తగ్గుతుంది, రకరకాల అనారోగ్య సమస్యలు మొదలవుతాయి, నిస్సత్తువ – చిరాకు పెరుగుతుంది. అందుకే నిద్ర త్వరగా పట్టాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి… అవేంటంటే…

తొందరగా భోజనం చేయండి
హాయిగా నిద్ర పోవాలంటే..తినగానే పడుకోవద్దు అందుకే రాత్రి భోజనం నిద్ర పోయే 2 గంటల ముందు తినాలి.

బాదం పాలు
రాత్రి పూట త్వరగా నిద్ర పట్టడంలో ఇబ్బంది ఉంటే పడుకునే ముందు బాదం పాలు తాగాలి. ఎందుకంటే ఇందులో మంచి నిద్రకు తోడ్పడే పోషకాలు ఉంటాయని నిపుణులు సూచిస్తున్నారు. కాబట్టి నిద్రలేమితో బాధపడుతున్నట్లయితే, బాదం పాలు తాగితే మంచిది.

పసుపు పాలు
నిద్ర రాకపోతే పడుకునే ముందు పసుపు పాలు తాగవచ్చు. ఈ పాలు తాగడం వల్ల ఆరోగ్యం మెరుగుపడటమే కాక నిద్ర కూడా బాగా వస్తుంది.

పుస్తకాలు చదవాలి..
నిద్ర త్వరగా రావాలంటే మంచి పుస్తకాలు చదవడం అలవాటు చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మంచి నిద్ర మీ సొంతం అవుతుంది. కాబట్టి పుస్తకాన్ని చదవడం అలవర్చుకోవాలి. దీనివల్ల ఏకాగ్రత పెరిగి మంచిగా నిద్ర పడుతుంది.

ధ్యానం
నిద్ర పోవడానికి ధ్యానం అనేది బాగా ఉపయోగపడుతుంది. ఒత్తిడిని తొలగించడం ద్వారా మనస్సును ప్రశాంతంగా ఉంచడంలో అది సహాయపడుతుంది. ఇది మెలటోనిన్, సెరోటోనిన్‌లను పెంచుతుంది. రక్తపోటు, హృదయ స్పందనను కూడా తగ్గిస్తుంది.

ఫోన్ ముట్టుకోకండి
మంచి నిద్ర కోసం మీ గదిలో ఉన్న ఫోన్, ఇతర ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌లను తీసివేయాలి. మీ దృష్టిని.. మీ శ్వాసపై ఉంచండి. ఆ సమయంలో మీ మనసులో మరేదైనా ఆలోచన వస్తే.. మీ శ్వాసపై పూర్తి దృష్టి పెట్టండి.

ఆల్కహాల్ వద్దు
కొంతమంది నిద్రపట్టడం లేదని ఆల్కాహాల్ తీసుకుంటారు కానీ ఇలా చేయడం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది కానీ నిద్రపట్టదని చెబుతున్నారు నిపుణులు

త్వరగా బెడ్ ఎక్కేయండి
నిద్ర రావడం లేదని టైమ్ పాస్ చేయకుండా త్వరగా బెడ్ ఎక్కేయడమే మంచిది. త్వరగా పడుకున్నప్పుడు శరీరానికి విశ్రాంతి దొరుకుతుంది. దీంతో మళ్లీ మన శరీరంలో తిరిగి శక్తి పొందడానికి తగినంత సమయం లభిస్తుంది.

గమనిక: ఆరోగ్య నిపుణులు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. దీనిని ఏ మేరకు విశ్వశించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం.