లేడీ సూపర్ స్టార్ నయనతార ల్యాండ్ మార్క్ 75వ మూవీని చాలా డిఫరెంట్ గా ప్లాన్ చేసుకుంది. లేడీ ఓరియెంటెడ్ కాన్సెప్ట్ తో బాక్సాఫీస్ వద్ద సోలోగా సత్తా చాటాలని ఫిక్సైన నయన్ చాలా కథలు వింది. చివరకు నీలేష్ కృష్ణ అనే కొత్త కుర్రాడిక కథకు కనెక్ట్ అయింది. ఈ మూవీ టైటిల్ నుంచి నయన్ లుక్ వరకూ అంతా కొత్తగానే ఉంది..
‘అన్నపూరాణి’-‘ది గాడెస్ ఆఫ్ టేస్ట్”
అన్నపూరాణి అనే టైటిల్ తో తెరకెక్కుతోంది నయనతార 75వ సినిమా. ప్రస్తుతం సెట్స్ మీదున్న ఈ మూవీ నుంచి తాజాగా ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేసారు. ‘అన్నపూరాణి’-‘ది గాడెస్ ఆఫ్ టేస్ట్” అనేది క్యాప్షన్. సంప్రదాయ బ్రహ్మాణ కుటుంబంలో పుట్టిన అమ్మాయి నయనతార. పూజాకార్యక్రమాలతో రోజు మొదలవుతుంది…అదే కార్యక్రమాలతో రోజు ముగుస్తుంది. అలాంటి కుటుంబంలో పుట్టిన నయనతార నాన్ వెజ్ ప్రియురాలు. తల్లిదండ్రులు పూజ పనుల్లో ఉంటే బిజినెస్ మేనేజ్ మెంట్ బుక్ పై నాన్ వెజ్ పీస్ లు..లెగ్ పీసుల్ని చూసి నోరూరిపోతుంది. ఇక్కడే ఓ ట్విస్ట్ కూడా ఉన్నట్టు క్లారిటీ ఇచ్చారు కానీ అదేంటన్నది మాత్రం సస్పెన్స్ మెంటైన్ చేశారు. బ్రాహ్మణ యువతి పాత్రలో నయనతార ఆహర్యం బాగుంది.
‘అదుర్స్’ లుక్ మరోసారి
ఇప్పటికే అదుర్స్ మూవీలో బ్రాహ్మణ యువతి చంద్రకళగా నటించి అదుర్స్ అనిపించింది నయన్. అటు మోడ్రన్ లుక్ లో మెప్పించింది.. లంగాఓణీలో అమాయకంగానూ ఆకట్టుకుంది. ఇప్పుడు అన్నపూరాణి సినిమాలో కూడా నయనతార లుక్ ఇంచుమించు అలాగే ఉంది. చక్కగా లంగాఓణీలో కనిపిస్తోంది. పైగా రీసెంట్ మూవీ ‘జవాన్’ లో హాట్ హాట్ గా కనిపించిన ఈ బ్యూటీ ఒక్కసారిగా సర్ ప్రైజింగ్ లుక్ లో దర్శనమిచ్చింది.
‘అన్నపూరణి”లో జై, సత్యరాజ్, అచ్యుత్ కుమార్, కెఎస్ రవికుమార్, సురేష్ చక్రవర్తి నటిస్తున్నారు. ఈ సినిమాకు సినిమాటోగ్రఫీ సత్యన్ సూర్యన్, ఎడిటర్‌గా ప్రవీణ్ ఆంటోని వ్యవహరి స్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఎస్. ఆర్.రవీంద్రన్ సమర్పణలో, నాస్ స్టూడియోస్ -ట్రైడెంట్ ఆర్ట్స్ సహకారంతో జీ స్టూడియోస్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.