రామాయణం ఇతిహాసం ఆధారంగా ఇండస్ట్రీలో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయి. ఈ ఏడాదిలోనే ప్రభాస్ నటించిన ఆదిపురుష్ మూవీని బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కించారు. ఈ మూవీ సినీ ప్రియులనే కాదు ప్రభాస్ ఫ్యాన్స్ ని కూడా తీవ్ర నిరాశకు గురిచేసింది. ఈ మూవీ రిజల్ట్ ఎలా ఉన్నా మరో బాలీవుడ్ డైరెక్టర్ పెద్ద సాహసానికి రెడీ అయ్యారు. రామాయణం ఆధారంగా భారీ ప్రాజెక్ట్‌ను ప్లాన్ చేశారు.
రావణుడి పాత్రకు రూ.50 కోట్లు
ఆదిపురుష్ మూవీ బాక్సాఫీస్ దగ్గర ఘోరంగా డిజాస్టర్ అయిన తర్వాత కూడా బాలీవుడ్ దర్శకుడు నితేష్ తివారీ రామాయణం ఆధారంగా మరో మూవీ తెరకెక్కించేందుకు సిద్దమయ్యాడు. పైగా ఈ సినిమాని భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు. ఇందుపో రాముడిగా రణబీర్ కపూర్,సీతగా సాయిపల్లవి నటిస్తున్నారు. మరో ముఖ్యమైన క్యారెక్టర్ రావణుడు. ఈ పాత్ర కోసం కన్న స్టార్, కేజీఎఫ్ హీరో యశ్‌ను ఫైనల్ చేశారు. అయితే ఈ క్యారెక్టర్ కోసం యశ్ భారీగా డిమాండ్ చేసినట్టు టాక్. రావణుడి పాత్ర కోసం యశ్ 150 కోట్లు డిమాండ్ చేశాడట. ఇందులో నిజమెంతనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఈ భారీ ప్రాజెక్ట్ మూవీను ప్రముఖ టాలీవుడ్ నిర్మాత అల్లు అరవింద్, మధు మంతెన, నమిత్ మల్హోత్రా, నితీష్ తివారీ, రవి ఉద్యవార్తో కలిసి నిర్మించనున్నారు. హనుమంతుడిగా నటించడానికి సన్నీ డియోల్ తో చర్చలు సాగిస్తున్నారని కథనాలొచ్చాయి. అయితే లక్ష్మణుడిగా ఎవరు నటిస్తారు? అన్నదానిపై స్పష్ఠత లేదు. శ్రీరాముడి సోదరుడు, అంగరక్షకుడు అయిన లక్ష్మణ్ పాత్రను అమితాబ్ మనవడు అగస్త్య నందకు ఆఫర్ చేయగా తిరస్కరించినట్లు టాక్.
మూడు భాగాలుగా
మొదటి షెడ్యూల్లోనే రణ్‌బీర్ కపూర్, సాయిపల్లవి చిత్రీకరణలో పాల్గొననున్నరని తెలుస్తోంది. భారీ స్థాయిలో వీఎఫ్ఎక్స్తో రామాయణాన్ని చూపించాలని నితేశ్ తివారీ భావిస్తున్నారు. ఆస్కార్ విన్నింగ్ వీఎఫ్ఎక్స్ కంపెనీ డీఎల్ఈజీ ఈ ప్రాజెక్ట్ కోసం పని చేయనుంది. రామాయణాన్ని మూడు భాగాలుగా రూపొందించాలని దర్శకుడు నితేశ్ తివారీ ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. పార్ట్-1 షూటింగ్ వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి ఆగస్టు వరకు జరుగుతుందని సమాచారం. జూలై తర్వాతే యశ్ షూటింగ్ లో పార్టిసిపేట్ చేయనున్నాడట.