వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో త్రిముఖ పోటీ ఏ్పడింది. హన్మకొండ నగరం మొత్తం వరంగల్ పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గంలోనే ఉంటుంది. హన్మకొండ రాజకీయంగా చైతన్యం ఉన్న గడ్డ. ప్రధాన పార్టీల మధ్య పోటీ ఉన్నా రూలింగ్ పార్టీదే హవా కొనసాగుతుంది. విద్యావంతులు, మేధావుల అడ్డగా ఉన్న హన్మకొండలో ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ కు పట్టున్నా… ప్రజలు గులాబీ పార్టీకే పట్టంకడుతున్నారు. ప్రస్తుత ఎన్నికల్లో వరంగల్ పశ్చిమలో త్రిముఖ పోటీ నెలకొంది. అయితే ఈ సారి సెంటిమెంట్ లేకపోవడంతో బీఆర్ఎస్ బలహీనపడింది. కాంగ్రెస్ మూడో స్థానానికి పడిపోయింది.
బీజేపీ నుంచి రావు పద్మ పోటీ
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పట్టణ ప్రాంతాల్లో ఓటు బ్యాంకు పెంచుకుంటోంది. ప్రజా పోరాటాలు చేయడం ద్వారా నేతలు పోటీ పడుతున్నారు. బీజేపీ నుంచి పోటీ చేయడానికి ముగ్గురు పోటీ పడ్డారు. మాజీ ఎమ్మెల్యే ధర్మారావు, హన్మకొండ జిల్లా బీజేపీ అధ్యక్షురాలు రావు పద్మ, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాకేష్ రెడ్డిల పేర్లు ప్రధానంగా వినిపించాయి. అయితే వివిధ సమీకరణాలు చూసుకుని రావు పద్మకు టిక్కెట్ కేటాయించారు. మహిళా ఓటర్లు అధికంగా ఉన్న ఈ నియోజకవర్గంలో మహిళగా రావు పద్మ విజయం సాధిస్తారన్న అంచనాలు ఉన్నాయి
వర్గపోరాటంలో కాంగ్రెస్
కాంగ్రెస్ నుంచి నాయిని రాజేందర్ రెడ్డి, జంగా రాఘవరెడ్డి పోటీకి సిద్ధమవుతున్నారు. రాజేందర్ రెడ్డి ప్రస్తుతం హన్మకొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కాగా, కష్టకాలంలో కూడా పార్టీని వీడలేదు. 2018 ఎన్నికల్లో రాజేందర్ రెడ్డికి నిరాశే ఎదురైంది. పొత్తులో భాగంగా ఈ స్థానం టీడీపీకి ఇవ్వడంతో రేవూరి ప్రకాష్ రెడ్డి పోటీ చేసి ఓడిపోయారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో రెడ్డి ఓట్లు ఎక్కువ. ఈ నియోజకవర్గంలో 2009 నుంచి ఇప్పటి వరకు బీఆర్ఎస్ మినహా మిగిత ప్రధాన పార్టీల్లో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులు పోటీ చేసిన నాన్ రెడ్డి విజయం సాధిస్తున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే దాస్య వినయ భాస్కర్ అభ్యర్థిగా ఖరారు కాగా, కాంగ్రెస్ గ్రూప్ పాలిటిక్స ్కారణంగా పోటీపడే వారు ఎక్కువ మంది ఉండడంతో ఎవరికి సీటు ఖరారు చేయలేదు.
బీజేపీకి అడ్వాంటేజ్
హన్మకొండ కేంద్రంగా ఉన్న వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో తాజా ఓటర్ల జాబితా ప్రకారం 2,72,162 మంది ఓటర్లు ఉన్నారు. అందులో మహిళలు లక్షా 36 వేల 856 మంది కాగా, పురుషులు లక్షా 35వేల 297 మంది, ఇతరులు పది మంది ఉన్నారు. ఉమ్మడి జిల్లాకు, ప్రస్తుత హన్మకొండ జిల్లా కేంద్రంగా ఉన్న వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో అధికార పార్టీకి దీటుగా బీజేపీ ఎదిగింది. మోదీ హవా… ప్రముఖుల ప్రచారం కలసి వస్తే.. ఈ సారి వరంగల్ కోట మీద బీజేపీ జెండా ఎగురుతుందని అంచనా వేస్తున్నారు.