భగవంత్ కేసరి, టైగర్ నాగేశ్వరరావు, లియో మూవీస్ లో కామన్ పాయింట్ ఇదే!

ఈ దసరా కానుకగా తెలుగులో భగవంత్ కేసరి, టైగర్ నాగేశ్వరరావు, కోలీవుడ్ నుంచి డబ్బింగ్ మూవీగా లియో థియేటర్లలో సందడి చేస్తున్నాయి. వీటిలో భగవంత్ కేసరి చిత్రానికి సూపర్ హిట్ టాక్ వస్తోంది. మిగిలిన రెండింటికి డివైడ్ టాక్ వచ్చినా వీకెండ్ లో కలెక్షన్లు బాగానే ఉన్నాయి.
అయితే లాంగ్ రన్ లో మాత్రం భగవంత్ కేసరిదే ఆధిపత్యం అన్నది క్లారిటీ వచ్చేసింది. అయితే ఈ మూడు సినిమాల్లో కామన్ పాయింట్ ఒకటుంది.. అదేంటో తెలుసా..

టైగర్ నాగేశ్వరరావులో తండ్రి తలని కొడుకు నరికేస్తాడు

లియో సినిమాలో తన వ్యాపార వృద్ధి కోసం కొడుకు, కూతురుని నరబలి ఇవ్వాలని అనుకునే తండ్రిగా సంజయ్ దత్ పాత్ర ఉంటుంది

భగవంత్ కేసరి చిత్రంలో కూడా తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకోవడానికి నెంబర్ వన్ పొజిషన్ కోసం కొడుకుని చంపుకునే తండ్రిగా విలన్ రోల్ ని చిత్రీకరించారు.

ఈ మూడు సన్నివేశాలు యాదృశ్చికంగా దర్శకులు రాసుకున్నా కథని, అందులో నెగిటివ్ క్యారెక్టర్ ని బలంగా చెప్పడం కోసం చూపించారు. అయితే మూడు కథల ట్రీట్మెంట్ మాత్రం వేరే విధంగా ఉంటుంది. లియో సినిమా కథకి కొడుకుని బలి ఇవ్వడమే మెయిన్ ఎలిమెంట్ గా ఉంటుంది. దానిని బేస్ చేసుకుని కథనం అంతా నడుస్తుంది. అయితే భగవంత్ కేసరి మెయిన్ స్టొరీ లైన్ కి ఆ సీన్ కి ఎలాంటి సంబంధం ఉండదు. టైగర్ నాగేశ్వరరావులో కూడా మెయిన్ కథ నాగేశ్వరరావు చుట్టూనే తిరుగుతుంది. ఇలా దసరా బరిలో నిలిచిన మూడు చిత్రాలలో ఓ సన్నివేశం మాత్రం కామన్ గా ఉండటం విశేషం.

మూడు కథలు కూడా బ్లడ్ అండ్ యాక్షన్ చుట్టూనే నడిచాయి. మిగిలిన రెండు సినిమాలతో పోలిస్తే భగవంత్ కేసరి మూవీలో కామెడీ ఉండడంతో ఎక్కువ మంది ప్రేక్షకులకు కనెక్ట్ అయింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో భగవంత్ కేసరి తెరకెక్కింది. ఖైదీ, విక్రమ్ తో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్న లోకేష్ కనగరాజ్ లియోని డైరెక్ట్ చేశాడు. ఇక టైగర్ నాగేశ్వరరావు మూవీకి వంశీ దర్శకుడు. వీటిలో ఏ మూవీకూడా ఫ్లాప్ టాక్ తెచ్చుకోపోవడం దసరా బాగానే ఉందని చెప్పుకోవాలి..