గత ఎన్నికల్లో కరీంనగర్ లోక్ సభ స్థానం నుంచి గెలిచిన బండి సంజయ్ ఈ సారి కరీంనగర్ అసెంబ్లీ నుంచి గెలవడం ఖాయమన తేలిపోయింది. ఎంపీగా గెలిచిన తర్వతా కన్నా ఇప్పుడు బండి సంజయ్ ఇమేజ్ రాష్ట్ర స్థాయిలో ఊహించనంతగా పెరిగింది. తెలంగాణలో ఉన్న ప్రధాన నేతల్లో ఒకరిగా మారారు. ఆయన పట్ల ప్రజలకు ముఖ్యంగా కరీంనగర్ ప్రజలకు, యువతకు సానుకూలత ఉంది. అందుకే .. అసెంబ్లీ ఎన్నికల్లో మంత్రి గంగుల కమలాకర్‌కు షాక్ తప్పదని అంచనాలు వినిపిస్తున్నాయి.
గంగుల కమలాకర్ పై తీవ్ర వ్యతిరేకత
కరీం నగర్ లో ఇతర రాజకీయ పార్టీలు మజ్లిస్ కు తొత్తుల్లా మారిపోతున్న సమయంలో బండి సంజయ్ హందూత్వ వాదంతో తెరపైకి వచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచినా పార్లమెంట్ ెన్నికల్లో మాత్రం ఘన విజయం సాధించారు. స్వయంగా కరీంనగర్ అసెంబ్లీ స్థానంలో భారీ మెజార్టీ వచ్చింది. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అధికారపార్టీ కన్నా బిజేపి గేలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దానికి ప్రధాన కారణం అక్కడి హిందుత్వం కొసం పోరాడుతున్నా బిజేపి నాయకుడు బండి సంజయ్ కు యూత్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉంది. బండి సంజయ్ అంటే ఓక రకమైనా యూత్ ఫాలోయింగ్ ఎక్కువ ఉన్న నేతగా మారారు. అదే సమయంలో సిట్టింగ్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పై వ్యతిరేకత బాగా పెరిగింది.
పూర్తిగా పట్టు కోల్పోయిన కాంగ్రెస్
బీజేపీ, బీఆర్ఎస్ మధ్యనే పోటీ నెలకొంది. కాంగ్రెస్ పార్టీ పూర్తిగా పట్టు కోల్పోయింది. బలమైన నేతగా ఉన్న పొన్నం ప్రభాకర్ పోటీ చేయడానికి కూడా వెనుకాడుతున్నారు కాంగ్రేస్ శ్రేణులు ఇతర పార్టీల్లో చేరిపోయారు. ముస్లిం ఓట్లు నియోజకవర్గంలో సుమారు ముప్పై ఆరు వేల పైచీలుకు ఉండడంతో ఎంఐఎం నేతలతో గంగుల కమలాకర్ చర్చలు జరపడం నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. బండి సంజయ్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీగా ఉంటానన్న మరుక్షణమే తాను చర్చలు జరపడం వారితో కలిసిన ఫొటోలు మీడియాకు విడుదల చేయడం క్షణాల్లో జరిగిపోయాయి. ముక్కోణపు పోటీలో బలాబలాలను ఎవరికి వారు అంచనాలు వేస్తూ ముందుకు సాగుతున్నారు. ఇదంతా వ్యూహాత్మకమేనని భావిస్తున్నారు.
గెలుపుపై బీజేపీ ధీమా
గత అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ సెగ్మెంట్‌లో గంగుల కమలాకర్‌కు 80,983 ఓట్లు రాగా…. బండి సంజయ్‌కు 66,009 ఓట్లతో రెండో స్ధానంలో నిలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్ అభ్యర్థి పొన్నం ప్రభాకర్ 39,500 ఓట్లతో మూడో స్థానంలో ఉన్నారు. కరీంనగర్ అసెంబ్లీ స్థానంలో గత ఎన్నికల్లో ఓడిపోవడంతో ఈ సారి బండికి సెంటిమెంట్ కలిసొచ్చే అవకాశముంటుందని బీజేపీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కేంద్రం వద్ద ఉన్న పలుకుబడి కూడా బండి సంజయ్ కు ప్లస్ కానుంది.