టీటీడీ ఆదాయంలో ఒక్క శాతం నిధులు తిరుపతి అభివృద్ధికి కేటాయించాలన్న పాలక మండలి సిపారసును ఏపీ ప్రభుత్వం ప్రభుత్వం తిరస్కరించింది. ఈ అంశంపై రెండు రోజుల కిందటే ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి సీఎం జగన్‌కు లేఖ రాశారు. ఒక్క రోజు వ్యవధిలోనే నిర్ణయాన్ని ఆమోదించేది లేదని ప్రభుత్వం టీటీడీకి తెలిపింది. ఇది శ్రీవారి భక్తులు, హిందుసంస్థల గొప్ప విజయమని ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు ఎస్.విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు.
భక్తుల ఆందో్ళన గుర్తించిన ప్రభుత్వం
తిరుమల శ్రీవారికి తాము భక్తితో ముడుపు కట్టి ఇచ్చే కానుకల్ని భక్తుల సౌకర్యాలకు, హిందూ ధర్మ ప్రచారానికి మాత్రమే వినియోగించడం భక్తులను గౌరవించడం అన్నారు. టీటీడీ పాలకమండలిలోని కొంత మంది సభ్యులు ఏ ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారో కానీ భక్తులు ఆందోళన చెందారు. ఈ అంశంపై భక్తుల ఆందోళనను విష్ణువర్దన్ రెడ్డి లేఖ ద్వారా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుని వెళ్లారు. ప్రభుత్వం భక్తుల ఆందోళనను వెంటనే గుర్తించి టీటీడీ ప్రతిపాదనను తిరస్కరించడం మంచిదేనన్నారు. ఇప్పటికైనా టీటీడీ పాలక మండలి.. శ్రీవారి నిధుల విషయంలో కీలకమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు.. హిందూ సమాజం , పీఠాధిపతులు మరియు హిందు సమాజంలో పెద్దలతో మేథోమథనం జరపిన తర్వాతనే నిర్ణయానికి రావాలని విజ్ఞప్తి చేశారు.
పాలకమండలి విచిత్ర నిర్ణయం
ప్రపంచంలోని హిందువులందరికీ శ్రీవారికి ఆరాధ్యదైవం. అందుకే అందరూ ఆయనకు తృణమో, పణమో సర్పించుకుంటారు. భక్తుల ఉద్దేశం ఆ సొమ్మును ప్రభుత్వాలో లేకపోతే మరొక వ్యవస్థో తీసుకుని ఖర్చు పెట్టాలని కాదు. నిజంగా అలాంటి ఉద్దేశం ఉంటే నేరుగా ఆయా కార్యక్రమాలకే వారు విరాళిచ్చేవారు. వారి ఉద్దేశం శ్రీవారి భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం.. హిందూ ధర్మ ప్రచారం చేయడం. ఆ విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. టీటీడీ పాలకమండలిలోని కొంత మంది సభ్యులు ఏ ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారో కానీ భక్తులు ఆందోళన చెందారు. ఈ అంశంపై భక్తుల ఆందోళనను నేను కూడా లేఖ ద్వారా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుని వెళ్లానని.. ప్రభుత్వం భక్తుల ఆందోళనను వెంటనే గుర్తించి టీటీడీ ప్రతిపాదనను తిరస్కరించడం అభినందనీయమని విష్ణు వర్ధన్ రెడ్డి ెలిపారు.
హిందూ ధర్మ ప్రచారానికే భక్తుల విరాళాలు
దేశంలోనే కాదు ప్రపంచంలో ఏ హిందూ దేవాలయానికి వచ్చే ఆదాయాన్ని ఏ ప్రభుత్వాలూ, వ్యక్తులు ఆశించరు, ఇతర అవసరాలకు వినియోగించరు. చివరికి భక్తులు ముడుపు కట్టిన సొమ్ములు కూడా దేవునికి తప్ప మరే కార్యక్రమం కోసం వాడరని తెలిసిందే. దేవునికి వచ్చే ఆదాయాన్ని ఆలయాల అభిృవద్ధికి, భక్తుల సౌకర్యాలకు, హిందూ ధర్మ ప్రచారానికి అర్చకులుకు మాత్రమే వినియోగిస్తారు. కానీ తిరుపతి ఎమ్మెల్యేగా ఉన్న భూమన కరుణాకర్ రెడ్డి టీటీడీ ఛైర్మన్ అయ్యాక ఆలయ ఆదాయంలో ఒక్క శాతం తిరుపతి అభివృద్ధి కోసం కేటాయించాలని టీటీడీ ప్రతిపాదన పంపింది. టీటీడీ ప్రతిపాదనను తిరస్కరించింది.