ప్రస్తుతం టాలీవుడ్ లో ట్రెండింగ్ లో ఉన్న హీరోయిన్ శ్రీలీల త్వరలో పెళ్లిచేసుకోబోతోందనే వార్త చక్కర్లు కొడుతోంది. ఇదే నమ్మేలా లేదనుకుంటే తను ఓ పెద్దింటికి కోడలు కాబోతోందనే న్యూస్ పై ఓ రేంజ్ లో చర్చ జరగుతోంది..ఇంతకీ శ్రీల పెళ్లిపై సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న న్యూస్ ఏంటంటే…
వసుంధర మనసులో మాట ఇదేనా!
నందమూరి బాలకృష్ణ సతీమణి వసుంధర ఇప్పటివరకు ఆయనకు సంబంధించిన సినిమాలలో,రాజకీయ విషయాల్లో ఎందులోనూ ఇన్వాల్వ్ కాలేదు. తాజాగా వసుంధర మనసులో మాట ఇదేనంటూ ఓ వార్త బయటకొచ్చింది. వసుంధర దేవి తన కొడుకు మోక్షజ్ఞ విషయంలో బాలకృష్ణని కోరిక కోరారట. శ్రీలీల పేరు చెప్పి ఆమె తన ఇంటికి కోడలిగా వస్తే బావుంటుందనే అభిప్రాయం వ్యక్తం చేశారట. బాలకృష్ణ-అనిల్ రావిపూడి కాంబినేషన్లో భగవంత్ కేసరి మూవీ వస్తోంది. ఈ మూవీ ఈవెంట్లో తన కొడుకు మోక్షజ్ఞ శ్రీలీల విషయంలో తనని క్వశ్చన్ చేశాడని స్వయంగా బాలకృష్ణ బయటపెట్టి ట్రోల్స్ కి గురయ్యారు.
సినిమా మాత్రమే కాదు పెళ్లికూడా ఫిక్స్ చేశారు
ఈ వార్తలు వైరల్ అయ్యాక మోక్షజ్ఞ ఫస్ట్ మూవీలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోందన్నారు…మరో అడుగు ముందుకేస్తూ మోక్షజ్ఞ శ్రీలీల పెళ్లి జరగబోతుందంటూ హడావుడి మొదలెట్టారు. బాలకృష్ణ భార్య వసుంధర స్వయంగా ఈ విషయం అడిగారని..బాలయ్య నవ్వి ఊరుకున్నారని అంటున్నారు. ఈ వార్తల్లో నిజం ఎంతుందో తెలియదు కానీ సోషల్ మీడియాలో మాత్రం తెగ తిరిగేస్తోంది. ఇదే నిజమైతే శ్రీలీల జాక్ పాట్ కొట్టినట్టే, ఏకంగా నందమూరి ఇంటికి కోడలుగా అడుగుపెట్టడం అంటే అంతకుమించిన అదృష్టం ఏం ఉంటుంది అంటున్నారు.
నెలకో సినిమా
పెళ్లి సందD మూవీతో తెలుగు వారికి పరిచయమై శ్రీలీల శ్రీకాంత్ తనయుడు రోషన్ తో నటించింది. ఆ తర్వాత మాస్ మహరాజా రవితేజతో కలిసి నటించిన ధమాకా మూవీతో ఒక ఊపు ఊపేసింది. ఈ మధ్యే స్కంద సినిమాతో ప్రేక్షకులను అలరించిన ఈ ముద్దుగుమ్మ త్వరలో బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి సినిమాతో రానుంది. ఇదే కాకుండా దసరా నుంచి స్టార్ట్ చేస్తే సంక్రాంతి వరకు ఒక్కో నెలకు ఒక్కో సినిమాతో రెడీగా ఉంది శ్రీలీల. ఇలాంటి కెరీర్ పీక్స్ సమయంలో శ్రీలీల పెళ్లి చేసుకోనుందంటూ రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి.