నలుగురు న్యాయమూర్తులు భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం చేశారు. స్వలింగ సంపర్కుల వివాహాలపై సుప్రీం కోర్టు సంచలనమైన తీర్పు ఇచ్చింది. చట్టాల్లో మార్పులపై కూడా తీర్పులో ప్రత్యేకంగా ప్రస్తావించారు..
అనుకూలంగా సీజేఐ డీవై చంద్రచూడ్
స్వలింగ వివాహాల ధ్రువీకరణ కోరుతూ దాఖలైన పిటిషన్లపై సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం విచారణ పూర్తిచేసి.. మే 11న తీర్పును రిజర్వు చేసిన విషయం తెలిసిందే. స్వలింగ వివాహాల చట్టబద్ధతను కేంద్రం పూర్తిగా వ్యతిరేకించిన సంగతి కూడా తెలిసిందే. ఇది పట్టణ ప్రాంతాల్లోని ఉన్నత వర్గాల భావన అని, దీనిపై పార్లమెంట్‌లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని సుప్రీంకోర్టులో అఫిడ్‌విట్ దాఖలు చేసింది. ఈ వివాహాలను గుర్తించే కోర్టు ఉత్తర్వులను ఆమోదించవద్దని, స్వలింగ వివాహాలకు గుర్తింపు కల్పించకపోవడం వివక్ష కాదని ప్రభుత్వం వాదించింది.సంప్రదాయబద్దమైన, విశ్వ ఆమోదం పొందిన పెళ్లి లాంటి సంబంధాలు అన్ని మతాల్లోనూ ఉన్నాయని తెలిపింది. హిందూమతంలోనే కాకుండా.. ఇస్లాం సైతం స్వలింగ వివాహాలను విభేధిస్తుందని, స్త్రీ, పురుషుల మధ్య మాత్రమే వివాహం చెల్లుబాటు అవుతుందని కేంద్రం తన వైఖరిని స్పష్టం చేసింది. స్వలింగ వివాహాలు సమాజంలో కొత్త సమస్యను సృష్టిస్తాయని కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది.అయితే ప్రస్తుత తీర్పులో న్యాయమూర్తుల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. స్వలింగ సంపర్కుల వివాహాలకు అనుకూలంగా సిజెఐ డివై చంద్రచూడ్ తీర్పు చెప్పారు.
భాగస్వామిని ఎంచుకునే స్వేచ్ఛ
పౌరుల హక్కులను కాపాడాలని రాజ్యాంగం స్పష్టం చేస్తోంది…స్వలింగ సంపర్కులకూ హక్కులుంటాయి..ప్రత్యేక వివాహ చట్టంలో పార్లమెంటు మార్పులు చేయాలని చంద్రచూడ్ తీర్పు రాశారు. సహచర భాగస్వామిని ఎంచుకునే స్వేచ్చ ప్రతీ ఒక్కరికి ఉంటుందన్నారు. పైగా సహచర భాగస్వామిని ఎంచుకోవడం జీవితంలో ముఖ్యమైన ఘట్టం అన్నారు. రాజ్యాంగంలోని 21వ అధికరణం స్వలింగ సంపర్కులకు కూడా మిగతావారిలాగే అన్ని హక్కులు కల్పించిందన్నారు. స్వలింగ సహజీవనం పట్టణ పరిస్థితుల్లో భాగమని అనుకుంటే పొరబాటేనని, అది గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఉంటుందని న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారు. వివాహం అనేది మానవతా దృక్పథంతో కలిసి ఉండాలని భావిస్తూ జరిగే ప్రక్రియ అని కూడా అత్యున్నత న్యాయస్థానం తేల్చింది. అది భావోద్వేగాలను పంచుకునే అంశమని కూడా కోర్టు అభిప్రాయపడింది. స్త్రీ పురుషుల మాత్రమే పెళ్లి చేసుకోవాలని ఎక్కడా రాసి పెట్టలేదన్నారు.
జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ వ్యతిరేక తీర్పు
స్వలింగ్ వివాహాలకు వ్యతిరేకంగా జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ తీర్పు చెప్పారు. జస్టిస్ చంద్రచూడ్ అభిప్రాయంతో ఆయన ఏకీభవించలేదు.స్పెషల్ మ్యారేజీ యాక్ట్.. ఆర్టికల్ 14కు విరుద్ధమని జస్టిస్ కౌల్ అభిప్రాయపడ్డారు.అది విపత్కర పరిస్థితులను సృష్టిస్తుందని తేల్చారు. ప్రస్తుత తీర్పుకు హిందూ వివాహ చట్టంతో సంబంధం లేదు. అది కేవలం స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ పై దాఖలైన 12 పిటిషన్లకు సంబంధించినది మాత్రమే….