బ్రెయిన్ స్ట్రోక్ మహా డేంజర్..ఈ అలవాట్లు మార్చుకోవాల్సిందే!

బ్రెయిన్ స్ట్రోక్ చాలా అరుదుగా వచ్చేది. కానీ ఇప్పుడు సాధారణం అయిపోయింది. మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా 45 ఏళ్ల లోపు వ్యక్తులు బ్రెయిన్ స్ట్రోక్ ని ఎదుర్కొంటున్నారు. ఓ అధ్యయనం ప్రకారం భారతదేశంలో 40 ఏళ్ల లోపు వారిలో 10-15 శాతం మంది బ్రెయిన్ స్ట్రోక్ బారిన పడుతున్నట్టు తేలింది.

స్ట్రోక్ ఎలా వస్తుంది
రక్తప్రసరణలో ఇబ్బంది తలెత్తినప్పుడు ధమనిలో గడ్డ ఏర్పడుతుంది. ఇది స్ట్రోక్ కి దారి తీస్తుంది. ఈ స్ట్రోక్ రెండు రకాలు. ఒకటి మోడిఫైబుల్, నాన్ మోడిఫైబుల్ స్ట్రోక్. వయస్సు సంబంధిత మార్పుల కారణంగా నాన్ మోడిఫైబుల్ స్ట్రోక్ వస్తుంది. దీన్ని నివారించలేము. మోడిఫైబుల్ స్ట్రోక్ మధుమేహం, రక్తపోటు, మద్యపానం, ఊబకాయం, కొలెస్ట్రాల్, మాదక ద్రవ్యాల వినియోగం వల్ల వస్తుంది.

అనారోగ్యపు ఆహారపు అలవాట్లే కారణం
మద్యం సేవించడం
ఎక్కువ కాలం ఆల్కాహాల్ తీసుకుంటే ధమనిలో మార్పులు వస్తాయి. వాళ్ళు స్ట్రోక్ కి గురయ్యే అవకాశం ఉంది. ఈ అలవాటు మార్చుకోవడం వల్ల బ్రెయిన్ స్ట్రోక్ కి గురయ్యే అవకాశం తక్కువగా ఉంటుంది. ధూమపానం కూడా మెదడు, గుండెకు ప్రమాదకరం.

సరిపడా నిద్ర
శరీరం అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉండాలంటే నిద్ర, వేళకి తినడం అవసరం. నిర్ణీత సమయానికి నిద్రపోవడం, నిద్రలేవడం ముఖ్యం. నిద్రకి అంతరాయం ఏర్పడినప్పుడు దాని ప్రభావం శరీరం మొత్తం మీద పడుతుంది.

ఆహారపు అలవాట్లు
ఫ్యాషన్ పేరుతో జంక్ ఫుడ్ తొలగించి వాటికి బదులుగా పండ్లు, కూరగాయలు అధికంగా ఉండే ఆహారాన్ని ఎంచుకోవాలి. భోజనం సరైన సమయానికి చేయకపోతే ఆ ప్రభాలం మొదడుపై పడుతుంది. ముఖ్యంగా అవసరం అయినన్ని ద్రవాలు తీసుకోవాలి.

ఒత్తిడి
ఒత్తిడి సాధారణ సమస్యగా మారిపోతుంది. ఇది ఎక్కువ మందిని ప్రభావితం చేస్తుంది. యువతలో బ్రెయిన్ స్ట్రోక్ రావడానికి అధిక కారణం ఇదే.

వ్యాయామం
రోజులో కనీసం 30 నుంచి 45 నిమిషాల పాటూ వ్యాయామం చేయాలి. కఠనమైన వ్యాయామం కాకుండా తేలికపాటి వ్యాయామంతో రోజు ప్రారంభించాలి. ఎందుకంటే ఊబకాయం కూడా స్ట్రోక్ కి ప్రధాన కారణం.

గమనిక: ఆరోగ్య నిపుణులు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. దీనిని ఏ మేరకు విశ్వశించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం.