ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ కాస్త బలంగా ఉంటుంది. కానీ కొంత కాలంగా ఆ పార్టీ పూర్తిగా నిర్వీర్యం అవుతోంది. ఉపఎన్నికల ద్వారా అయినా సరే ప్రస్తుతం ఎమ్మెల్యే సీట్లు మొత్తం బీఆర్ఎస్ చేతిలో ఉన్నాయి. కాంగ్రెస్ పరిస్థితి ఏ మాత్రం మెరుగుపడకపోగా గ్రూపు తగాదాలతో మరింత బలహీనపడింది. కానీ సైలెంట్ గా గ్రౌండ్ వర్క్ చేసుకున్ బీజేపీ మరింత బలపడింది. పలు నియోజకవర్గాల్లో గట్టి పోటీ ఇచ్చే స్థాయికి చేరింది.
మునుగోడు, సూర్యాపేటలో బీజేపీ విజయం ఖాయం
ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 12 నియోజకవర్గాలు ఉన్నాయి. మునుగోడులో బీఆర్ఎస్ ప్రస్తుత ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి కూడా ఓటమి పాలవుతారని టాక్ నడుస్తోంది. ఇక్కడ బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ మధ్య పోరు ఉండనుంది. ఉపఎన్నికలో ఓడిపోయినా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి విజయం సాధిస్తారని సర్వేల్లో స్పష్టమైంది. మరోవైపు దేవరకొండ ఎస్టీ నియోజకవర్గంలో కూడా బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. సూర్యాపేట నియోజకవర్గంలో వచ్చే ఎన్నికల్లో మంత్రి జగదీష్‌రెడ్డికి ఎదురుగాలి తప్పదని సర్వేలు చెప్తున్నాయి. వరుసగా రెండుసార్లు గెలిపించినా జగదీష్‌రెడ్డి చేసిన అభివృద్ధి ఏమీ లేదని ప్రజలు అభిప్రాయపడుతున్నారని.. అందుకే బీజేపీ అభ్యర్థి సంకినేని వెంకటేశ్వరరావును గెలిపించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. సర్వేల్లో వెల్లడయింది.
మరో నాలుగు నియోజకవర్గాల్లో బీజేపీ వర్సెస్ బీఆర్‌ఎస్ పోటీ
రెండు స్థానాల్లో బీజేపీ విజయం ఖాయంగా చేసుకోగా.. నాలుగు స్థానాల్లో బీఆర్ఎస్ తో హోహారీ తలపడుతోంది. మిర్యాలగూడ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి నల్లమోతు భాస్కర్‌రావు పై తీవ్ర వ్యతిరేకత ఉంది. ఆశల్లేకపోవడంతో కాంగ్రెస్ పార్టీ పొత్తులో భాగంగా కమ్యూనిస్టులకు ఇచ్చేస్తోంది. అక్కడ బీజేపీ నేతలు స్ట్రాటజిక్ గా చాపకింద నీరులా పని చేసుకుంటున్నారు. కోదాడ నియోజకవర్గంలో గత ఎన్నికల్లో స్వల్ప తేడాతో బీఆర్ఎస్ అభ్యర్థి బొల్లం మల్లయ్య యాదవ్ విజయం సాధించారు. అక్కడ బీజేపీ బలం పెంచుకుంది. తుంగతుర్తి ఎస్సీ నియోజకవర్గంలోనూ బీఆర్ఎస్ పార్టీకి షాక్ తప్పేలా లేదు. భువనగిరి నియోజకవర్గంలో కూడా బీజేపీ గట్టిపోటీ ఇస్తోంది.
విష్ణువర్ధన్ రెడ్డి నేతృత్వంలో విస్తృత ప్రచారం
అభ్యర్థుల ఖరారుతో సంబంధం లేకుండా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కేంద్రం నియమించిన ప్రచార కమిటీ ప్రచారసభలు నిర్వహిస్తోంది. విష్ణువర్ధన్ రెడ్డి … ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పలు నియోజవర్గాల్లో ప్రచారం చేస్తున్నారు. తెలంగాణలో బీజేపీ రావాలని నల్గొండ జిల్లాలో వివిధ నియోజకవర్గాల్లో ప్రజలు స్పష్టంగా వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారని ఆయన చెబుతున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేటప్పటికీ ఎన్నికల గాలి బీజేపీకి పూర్తి అనుకూలంగా మారుతుందని భావిస్తున్నారు.