కిడ్నీలో రాళ్లను కరిగించే నీళ్లు ఇవి!

కిడ్నీలో స్టోన్స్ ఇప్పుడు చాలామందిని వేధిస్తోన్న సమస్య. మందులు వాడడం కన్నా నీళ్లు ఎంత ఎక్కువగా తాగితే ఈ సమస్య అంత త్వరగా పరిష్కారం అవుతుందని వైద్యులు చెబుతుంటారు. అయితే వాటర్ కన్నా బార్లీ నీళ్లు తాగితే మరింత త్వరగా రాళ్లు కరిగిపోతాయంటున్నారు ఆరోగ్య నిపుణులు

బార్లీ గింజలను కాసేపు నానబెట్టి మరిగించుకుని తాగడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఇందులో ఫైబర్ తోపాటు ఇతర పోషకాలు , యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది జీర్ణవ్యవస్థకు అద్భుతమైన టానిక్‌గా , మలబద్ధకానికి సహజ నివారణగా పనిచేస్తుంది. బార్లీ నీరు శరీరాన్ని చల్లబరిచే లక్షణాలు ఉన్నాయి. శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడంలో సహాయపడుతుంది. ముఖ్యంగా కిడ్నీలో రాళ్లను కరిగించేందుకు ఇది మంచి మందు అంటారు ఆరోగ్య నిపుణులు.

జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది
బార్లీలో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. పేగుల ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఈ నీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం ప్రేగు కదలికలను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఒత్తిడిని నివారించటంలో సహాయపడుతుంది.

బాడీ టెంపరేచర్ తగ్గిస్తుంది
బార్లీ వాటర్ బాడీ టెంపరేచర్ తగ్గిస్తుంది. రీరానికి హైడ్రేషన్ అందించడం ద్వారా, బార్లీ నీరు ఎలక్ట్రోలైట్ సమతుల్యతను కాపాడటానికి డీహైడ్రేషన్ నిరోధించడానికి సహాయపడుతుంది.

కిడ్నీ ఆరోగ్యానికి మంచిది
బార్లీ నీరు మూత్రపిండాల పనితీరును మెరుగుపరుస్తుంది. కిడ్నీలో రాళ్లను త్వరగా కరిగించే శక్తి వీటికుంది. పైగా శరీరంలోని అదనపు నీటిని బయటకు పంపుతాయి. బార్లీ వాటర్‌లోని యాంటీఆక్సిడెంట్ లక్షణాలు శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌తో పోరాడతాయి. వ్యాధి నిరోధక శక్తి పెంచుతాయి.

బరువు తగ్గిస్తాయి
బార్లీ నీళ్లు బరువు తగ్గించేందుకు దివ్య ఔషధం. శరీరం నుంచి అదనపు నీటిని బయటకు పంపడం వల్ల అధిక రక్తపోటును కంట్రోల్ లో ఉంచేందుకు సహాయపడుతుంది. వీటిలో ఉండే ఫైబర్ బీటా-గ్లూకాన్ షుగర్ స్ధాయిలను నియంత్రణలో ఉంచటానికి సహాయపడుతుంది.

గమనిక: ఆరోగ్య నిపుణులు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. దీనిని ఏ మేరకు విశ్వశించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం.