తెలంగాణలో బీజేపీ విజయం కోసం కృషి చేసేందుకు ఏర్పాటైన కమిటీలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న విష్ణువర్థన్ రెడ్డి .. కేంద్ర మంత్రి శోభాకరంద్లాజేతో కలిసి నల్లగొండ జిల్లాలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. మిర్యాలగూడ నియోజకవర్గంలో నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వం రైతులకు చేసిన అన్యాయాన్ని వివరించారు.
9 ఏళ్లలో ఆరు వేల మంది రైతుల ఆత్మహత్య
తెలంగాణ రైతులు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారని, గత తొమ్మిదేళ్లలో 6,000 మందికి పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం రాష్ట్రంలోని రైతుల దుస్థితిని తెలియజేస్తోందని విష్ణువర్ధన్ రెడ్డి ప్రచారసభలో గుర్తు చేశారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు రైతులకు ఎన్నో వాగ్దానాలు చేశారని, ఏ ఒక్కటీ నెరవేర్చలేదన్నారు. ‘అతను హామీ ఇచ్చిన ఉచిత ఎరువుల జాడ లేదు. వర్షాభావంతో పంటలు నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.10 వేలు పరిహారం ఇస్తానన్న మాట వినలేదు. రాష్ట్రంలో ఇన్‌పుట్ సబ్సిడీ లేదన్నారు.
ఇరవై నాలుగు గంటల కరెంట్ పేరుతో మసోం
వ్యవసాయ రంగానికి 24 గంటల కరెంటు ఇస్తామన్న హామీ కూడా అబద్ధమని ఇప్పుడు రుజువైందని విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు. ధరణి పోర్టల్ వల్ల రైతులు కూడా బాధితులుగా మారారని, తమ భూములు దోచుకున్నారని గుర్తించిన కొందరు ధరణి పోర్టల్ బాధితులు ఆత్మహత్యలు కూడా చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు రుణమాఫీ చేయకుండా కాల యాపన చేస్తున్న సీఎం కేసీఆర్ పెరిగిన పెట్టుబడి ధరలకు ఎందుకూ సరి పోని రైతుబంధు పేరు చెప్పి రైతులను నిలువునా మోసం చేస్తున్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్యవైఖరి వల్ల రాష్ట్రంలో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని గుర్తు చేశారు.
బీజేపీకి ఒక్క అవకాశం ఇవ్వాలి !
‘ఈ రైతు వ్యతిరేక ప్రభుత్వం పోవాలి. బీజేపీకి ఒక్క అవకాశం ఇవ్వండి, ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో రైతు అనుకూల ప్రభుత్వాన్ని అందజేస్తాం, అది రైతు సంఘాలను కూడా తన ఖాతాలో వేసుకుంటుందవి విష్ణువర్ధన్ రెడ్డితో పాటు ప్రచారంలో పాల్గొన్న కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే భరోసా ఇచ్చారు. వచ్చే నెలన్నర పాటు విష్ణువర్ధన్ రెడ్డితో పాటు ఇరవై ఆరు మందితో నియమించిన కేంద్ర కమిటీ .. తెలంగాణ వ్యాప్తంగా విస్తృతంగా పర్యటనలు చేయనుంది.