కల్వకుర్తి నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ బలంగా ఉంది. గత రెండు ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి తల్లో జు ఆచారి రెండో స్థానంలో నిలిచారు. తెలంగాణలో బీజేపీ వేవ్ కనిపిస్తూండటానికి తోడు.. రెండు సార్లు ఓడిపోయిన సానుభూతి కనిపిస్తోంది. ఒక సారి కేవలం 32 ఓట్ల తేడాతో ఆచారి ఓడిపోయారు. మరోసారి మూడు వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. అందుకే ఈసారి ఆచారికి చాన్సివ్వాలన్న భావన అక్కడ ప్రజల్లో కనిపిస్తోంది.
గందరగోళంలో కాంగ్రెస్
రాజకీయంగా చైతన్యం కలిగి విలక్షణ తీర్పులిచ్చే కల్వకుర్తిలో కాంగ్రెస్ ఎక్కువ సార్లు గెలిచింది. ఇప్పటి వరకు 15 సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే 9సార్లు హస్తానికే జైకొట్టారు. ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఇక్కడ కాంగ్రె్‌సలో స్తబ్దతే నెలకొంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చెందిన మాజీ ఎమ్మెల్యే చల్లా వంశీచంద్‌రెడ్డి ఢిల్లీ రాజకీయాలకే పరిమితమమయ్యారు. ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్సీని చేర్చుకుని టిక్కెట్ ఇస్తున్నారు. ఇప్పటి వరకూ నియోజకవర్గ స్థాయిలో పార్టీని సమన్వయ పరిచే నాయకుడు లేక ఆ పార్టీ క్యాడర్ నిర్వీర్యమైపోయింది.
బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేపై వ్యతిరేకత
సిట్టింగ్ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌కు మరోసారి టికెట్ ఇస్తామని బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ప్రకటించారు. ఆ పార్టీ ఎన్నికలకు సమాయత్తమవుతోంది. జైపాల్ ఎన్నికల ప్రచార రథాలను కూడ సిద్ధం చేసుకొని ప్రచారానికి వెళ్లేలా సమాయత్తం అవుతున్నారు. ఈ నియోజకవర్గ బీఆరెస్ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ పై సొంత పార్టీ నాయకులే తీవ్ర మైన ఆరోపణలు చేస్తున్నారు. నియోజకవర్గాన్ని పట్టించుకోవడం లేదని, అభివృద్ధి పనులు చేయడం లో పూర్తి నిర్లక్ష్యం వహించడం, కార్యకర్తలను విస్మరించడం వంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నారన్న విమర్శలున్నాయి. సొంత పార్టీ ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి, సీనియర్ నాయకులు బాలాజీ సింగ్, పలువురు ఎంపీపీ లు ఎమ్మెల్యే తీరును ఎండగడుతున్నారు. జైపాల్ యాదవ్ కు టికెట్ ఇస్తే ఓడిస్తామని వారంతా ఇదివరకే పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. అయినా టిక్కెట్ ఇవ్వడంతో ఆయనకు పార్టీ నేతలు సహకరించడం కష్టంగా మారింది.
తల్లోజు ఆచారికి సానుభూతి అస్త్రం
బీజేపీ అభ్యర్థిని ప్రకటించకపోయినా ఇప్పటికే ఐదుసార్లు పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోతున్న తల్లోజు ఆచారి ఆరోసారి బరిలో నిలవడం ఖాయంగా కనిపిస్తోంది. కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ వంశీ చంద్ రెడ్డి (42,229) చేతిలో ఓడిపోయారు. ఆచారికి ఇది (42,197)ఘోరా పరాజయమేమీ కాదు, తేడా కేవలం వందలోపు ఓట్లు మాత్రమే. అందువల్ల ఈసారి గెలుపు నాదే అంటున్నారు ఆచారి. ఆపుడు టిఆర్ ఎస్ అభ్యర్థి జైపాల్ యాదవ్ (29,687)మూడో స్థానంలో ఉన్నారు. త్రిముఖ పోటీలో బిజెపి రెండో స్థానంలో ఉండటం గమనించాల్సిన విషయం. అందునా కూడా తెలంగాణ సెంటిమెంట్ బలంగా ఉన్న 2014లో పరిస్థితి ఇది. ఈ సారి బిజెపి బలపడిందని, మోదీ ప్రభావం ఉంటుందని కూడా ఆచారి నమ్ముతున్నారు. రెండు సార్లు రెండో స్థానంలో ఉన్నారు. ఆమనగల్ పంచాయతీ సభ్యుడిగా రాజకీయ జీవితం ప్రారంభించిన ఆచారి మహబూబ్ నగర్ జిల్లా బిజెపి అధ్యక్షుడిగాపని చేశారు. 1999,2004,2009,2014 ఎన్నికల్లో నిలబడ్డారు. 2004,2014లలో రెండో స్థానంలో నిలబడ్డారు. పలుసార్లు ఓడిపోవడం, రెండుసార్లు విజయానికి చేరువగా రావడంతో ప్రజల్లో బాగా గుర్తింపు వచ్చిందని, ఈ సారి ప్రజలను సానుభూతితో ఓటేసి గెలిపిస్తారని ఆయన బాగా నమ్ముతున్నారు.