బాలకృష్ణ- అనిల్ రావిపూడి కాంబోలో వస్తోన్న భగవంత్ కేసరి మూవీ తండ్రీ-కూతుర్ల సెంటిమెంట్ అని ట్రైలర్ చూస్తే అర్థమైపోతోంది. ఈ బ్యాక్ డ్రాప్ లో టాలీవుడ్ సహా ప్రపంచ భాషల్లో ఎన్నో సినిమాలు వచ్చాయి. తండ్రీ-కూతుళ్ల బంధంపై వచ్చిన మూవీస్ దాదాపు ప్రేక్షకులను మెప్పించాయి. అయితే త్వరలో రిలీజ్ కానున్న భగవంత్ కేసరి మాత్రమే కాదు..మరికొన్ని సినిమాలు కూడా ఇదే బ్యాక్ డ్రాప్ లో వస్తున్నాయి. అవేంటో చూద్దాం..
సౌత్ లో విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాల్లో నాలుగు సినిమాలు..లియో, భగవంత్ కేసరి, సైంధవ్, హాయ్ నాన్నా.. ఈ చిత్రాల కథల వెనుక ఉన్న ఆసక్తికర ఎలిమెంట్ తండ్రి కూతుళ్ల అనుబంధం.
భగవంత్ కేసరి
రీసెంట్ గా రిలీజైన ట్రైలర్ చూస్తే భగవంత్ కేసరి మూవీ మొత్తం తండ్రి-కూతురి ఏమోషన్ చుట్టూనే నడవనుందని అర్థమవుతోంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో బాలకృష్ణ- శ్రీలీల మధ్య తండ్రీ కూతుళ్ల సెంటిమెంట్ మరో లెవల్లో వర్కవుట్ కానుందని టాక్.
లియో
విజయ్ లియోలో గాయపడిన కుమార్తె తో ఉన్న ఎమోషనల్ బాండింగ్ తనని గ్యాంగ్ స్టర్ దిశగా నడిపించనుందని తెలుస్తోంది. లియోలో విజయ్ తన కుటుంబాన్ని కూతురిని కాపాడుకునే పాత్రలో నటించాడు. ఫ్యామిలీమెన్ గ్యాంగ్ స్టర్ గా ఎందుకు మారాడో తెరపై చూడాలి. ఫ్యామిలీ సెంటిమెంట్ కుమార్తె ఎలిమెంట్ ని ఇందులో దర్శకుడు లోకేష్ కనగరాజ్ బలంగా చూపించాడని సమాచారం.టట
సైంధవ్
సైంధవ్ సినిమాలో.. పిల్లలలో అరుదైన వ్యాధికి చికిత్స చేయడానికి ఉపయోగించే ఖరీదైన ఔషధం దుర్వినియోగం చేసేవారి ఆటకట్టించే క్యారెక్టర్లో నటిస్తున్నాడు విక్టరీ వెంకటేష్ నటిస్తున్నారు. బేబీ సారా పాత్ర ఇందులో కీలకమైనది. వెంకీ- సారా మధ్య ఉన్న ఎమోషనల్ బాండింగ్ ఈ చిత్రానికి కీలకం అని టాక్ వినిపిస్తోంది.
హాయ్ నాన్న
నాని-మృణాల్ ఠాకూర్ లేటెస్ట్ మూవీ హాయ్ నాన్నా
. ఈ మూవీలో ఒంటరి తండ్రి తన గారాల కుమార్తె చుట్టూ తిరిగే కథతో రూపొందుతోంది.
గతంలో తండ్రీ-కూతురు బ్యాక్ డ్రాప్ లో వచ్చిన మూవీస్ అన్నీ దాదాపు హిట్టే. డాడీ, నువ్వే నువ్వే, నేను శైలజ, పరుగు, ఆకాశమంత, నువ్వు నాకు నచ్చావ్ వీటిలో తండ్రి – కుమార్తెల మధ్య అనుబంధం, భావోద్వేగాలు, ప్రేమ ప్రేక్షలు హృదయాలను హత్తుకునేలా తెరకెక్కించారు. మరి త్వరలో విడుదలకానున్న భగవంత్ కేసరి, లియో, సైందవ్, హాయ్ నాన్నలో… ఏ తండ్రి కూతురు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతారో వెయిట్ అండ్ సీ..