గ్రేటర్ హైదరాబాద్‌లో దుమ్ము రేపనున్న బీజేపీ – కార్పొరేషన్ ఫలితాలను మించి ఉండబోతున్నాయా ?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గ్రేటర్ హైదరాబాద్ తో పాటు ఆ చట్టుపక్కల ఉన్న ముఫ్పై నియోజవర్గాల్లో బలంగా కనిపిస్తోంది. పాతబస్తీలో మజ్లిస్ కు పోటీ ఇచ్చేది కూడా బీజేపీనే. గ్రేటర్‌లో ఒకటి రెండు నియోజకవర్గాలు మినహా మిగిలిన అన్ని నియోజకవర్గాల్లో పార్టీ కోసం పని చేసిన బలమైన నేతలు ఉన్నారు. గ్రేటర్‌లో ఒక్కో నియోజకవర్గం నుంచి 20కి పైగా దరఖాస్తులు స్టేట్‌ బీజేపీ ఆఫీసుకు చేరాయి. అందరూ బలమైన నేతలే. అన్ని సమీకరణాలను చూసుకుని అభ్యర్థుల్ని ఖరారు చేయనున్నారు.

బలంగా బీజేపీ క్యాడర్

గ్రేటర్ హైదరాబాద్‌లో బీజేపీ క్యాడర్ మొదటి నుంచి బలంగా ఉంది. గ్రేటర్ ఎన్నికల్లో ఈ విషయం రుజువు అయింది. బీజేపీ అభ్యర్థులు 48 వార్డులు గెలిచారు. బీజేపీ ఎల్బీనగర్‌ జోన్ లో 15, సికింద్రాబాద్‌లో 14, ఖైరతాబాద్‌లో 9, చార్మినార్‌లో 7, కూకట్‌పల్లిలో 2 వార్డులు గెలుచుకుంది. షేరిలింగంపల్లిలో ఒక వార్డులో విజయం సాధించింది. అంటే నగరం నలుమూలలా బీజేపీ ప్రభావం చూపినట్లే. అప్పటి నుంచి బీజేపీ మరింత గా బలపడింది.

అన్ని చోట్లా బలమైన అభ్యర్థులు పోటీ

కిషన్ రెడ్డి సొంత నియోజకవర్గం అంబర్‌పేటలో బీజేపీ తిరుగులేని ప్లేస్‌ల ోఉంది. గత రెండు ఎన్నికల్లో గోషామహల్‌ లో బీజేపీ విజయం సాధించింది. గ్రేటర్‌లో మిగిలిన నియోజకవర్గాల్లోనూ బీజేపి గెలుపుపై నమ్మకం ఉండటంతో ేఎంక్కువ మంది పోటీ పడుతున్న ారు. కంటోన్మెంట్‌, సికింద్రాబాద్‌, ముషీరాబాద్‌, ఖైరతాబాద్‌, ఎల్బీనగర్‌, మలక్‌పేట, నాంపల్లి తదితర నియోజకవర్గాల్లో కార్పొరేటర్ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలతో క్యాడర్ జోష్ లో ఉన్నారు. అందుకే టిక్కెట్ల కోసం భారీ పోటీ ఉంది. కంటోన్మెంట్‌ టికెట్‌ కోసం 22 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ ప్రాంతం నుంచి ఉద్యోగ సంఘం నాయకుడు, మరొక జాతీయ కార్యవర్గ సభ్యురాలు ఆ టికెట్‌ కోసం ప్రయత్నిస్తున్నారు.

త్రిముఖ పోరులో భారీ విజయాలు బీజేపీకి ?

గ్రేటర్ లో త్రిముఖ పోరు జరనుంది. పాతబస్తీలో ద్విముఖ పోరు జరుగుతుంది. పాతబస్తీలో బీజేపీ వర్సెస్ మజ్లిస్, మిగిలిన చోట్ల బీజేపీ, బీఆర్ఎస్ , కాంగ్రెస్ మధ్యపోరు సాగుతుంది. కాంగ్రెస్ ఇప్పటికే గ్రేటర్ లో నిర్వీర్యం అయిపోయింది. గత రెండు కార్పొరేటర్ ఎన్నికల్లో ఆ పార్టీకి రెండు సీట్లు మాత్రమే దక్కాయి. అందుకే.. ఈసారి గ్రేటర్ పరిధిలో బీజేపీ ఘన విజయాలు ఖాయమన్న వాదన వినిపిస్తోంది.