సౌత్ లో రాబోతున్న క్రేజీ ప్రాజెక్ట్స్ లో ‘లియో’ ఒకటి. ఖైదీ, విక్రమ్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ తర్వాత లోకేష్ కనగరాజ్ తెరకెక్కిస్తోన్న సినిమా కావడంతో లియోపై భారీ అంచనాలున్నాయి. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా సిద్ధమవుతోన్న ఈ చిత్రం దసరాకి ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. త్వరలోనే ప్రీ రిలీజ్ ఈవెంట్ ని తెలుగులో నిర్వహించబోతున్నారు. ఈ సినిమా తెలుగు రైట్స్ ని ప్రముఖ నిర్మాత సూర్య దేవర నాగవంశీ తీసుకున్నాడు. తమిళం లో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కొన్ని కారణాల వల్ల క్యాన్సిల్ అవడంతో తెలుగు లో గ్రాండ్ గా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
స్పెషల్ గెస్ట్ గా పవన్ కళ్యాణ్
ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని పిలవాలని ఫిక్సయ్యాడట నిర్మాత వంశీ. పవన్ కళ్యాణ్ వంశీ కి ఎంతో మంచి సన్నిహితుడు. వంశీ ఎన్నో సందర్భాలలో కళ్యాణ్ గారు మా కుటుంబ సభ్యుడు అని చెప్పాడు కూడా. దీనికి తోడు హీరో విజయ్ కూడా పవన్ కళ్యాణ్ కి పెద్ద ఫ్యాన్ అనే విషయం స్వయంగా చెప్పాడు. దీంతో ఈ వేడుకకు పవన్ కళ్యాణ్ పక్కాగా హాజరవుతారని ఫిక్సైపోయారు. విజయ్ ఇప్పటి వరకు తన సినిమాలకు సంబంధించి ఒక్కసారి కూడా తెలుగు ప్రొమోషన్స్ లో పాల్గొనలేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ని ముఖ్య అతిథిగా పిలవబోతున్నాము అని నాగవంశీ చెప్పగానే కచ్చితంగా నేను కూడా వస్తాను అని మాటిచ్చాడట. తెలుగు లో పవన్ కళ్యాణ్ – విజయ్ ని ఇష్టపడే అభిమానులు ఎంతో మంది ఉన్నారు. సౌత్ లో బిగ్గెస్ట్ స్టార్ హీరోలైన వీళ్లని ఒకే వేదికపై చూడడం అంటే ఇరు ఫ్యాన్స్ కి కన్నుల పండువే..
హాలీవుడ్ మూవీకి కాపీనా!
తాజాగా రిలీజైన ఈ మూవీ ట్రైలర్ పై డివైడ్ టాక్ వస్తోంది. హాలీవుడ్ లో వచ్చిన ది హిస్టరీ ఆఫ్ వైలెన్స్ మూవీనే లియోగా లోకేష్ కనగరాజ్ తెరకెక్కించారని విమర్శలు వెల్లువెత్తాయి. ది హిస్టరీ ఆఫ్ వైలెన్స్ మూవీ హాలీవుడ్ లో 2005లో వచ్చి సూపర్ హిట్ అయ్యింది. ఒక కామన్ మెన్ అనుకోకుండా ఇద్దరు దొంగలని హత్య చేస్తాడు. తనని గ్యాంగ్ స్టార్ అని భావించి మాఫియా వాళ్ళు వెంటపడుతూ ఉంటారు. వారి నుంచి కుటుంబాన్ని కాపాడుకోవడానికి ముందు తప్పించుకునే ప్రయత్నం చేస్తాడు…ఆ తర్వాత ఎదురుతిరిగి పోరాటం చేసే క్రమంలో గ్యాంగ్ స్టర్ గా మారుతాడు. సేమ్ స్టోరీ లియో ట్రైలర్లో కనిపిస్తోంది. మరి ఈ ఆరోపణలకు లోకేష్ కనగరాజ్ ఎలా చెక్ పెడతాడో చూడాలి. ఇంతకీ ఖైదీ,విక్రమ్ తో తర్వాత హ్యాట్రిక్ కొడతాడా వెయిట్ అండ్ సీ..