బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగన రనౌత్ సౌత్‌లో సెటిలవ్వాలనుకున్న ప్రతిసారీ ఎదురుదెబ్బ తగులుతోందా? అప్పుడెప్పుడో వచ్చిన ఏక్ నిరంజన్ నుంచి రీసెంట్ గా వచ్చిన చంద్రముఖి 2 వరకూ వరుస ఫ్లాపులే. దీంతో కంగనాకి సౌత్ కలసి రాదనే సెంటిమెంట్ బలపడిపోతోంది..
బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ హీరోయిన్ గా తనకంటూ స్పెషల్ క్రేజ్ సంపాదించుకుంది. హీరోల ఇమేజ్ కి పోటీగా కెరీర్ ని బిల్డ్ చేసుకుని ఏకంగా వంద కోట్ల మార్కెట్ ని బాలీవుడ్ లో క్రియేట్ చేసుకుని ఫీమేల్ సెంట్రిక్ స్టోరీలకు కేరాఫ్ అనేంతలా మారింది. అయితే నాలుగైదేళ్లుగా కంగనా రనౌత్ కి ఆశించిన స్థాయిలో సక్సెస్ రావడం లేదు. 2019లో జడ్జిమెంటల్ డే సినిమా నుంచి ఇప్పటి వరకు ఆమె నటించిన సినిమాలేవీ పెద్దగా సక్సెస్ కాలేదు. ఇలాంటి టైమ్ లో చంద్రముఖి 2 కలిసొస్తుంది అనుకుంటే అది కూడా సేమ్ రిజల్ట్ వచ్చింది. దీంతో కాంట్రవర్శీ క్వీన్ కి సౌత్ కలసిరాదేమో అనే చర్చ జరుగుతోంది.
ప్రభాస్-పూరీ జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన ఏక్ నిరంజన్ మూవీలో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది కంగనా. అందం, నటనలోనూ మంచి మార్కులే సంపాదించుకుంది కానీ ఆ తర్వాత మళ్లీ తెలుగులో కనిపించలేదు. 2021లో తలైవి మూవీలో నటించింది. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా కోసం లుక్ కూడా మార్చుకుంది కానీ ఈ ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయింది. మళ్లీ రెండేళ్ల గ్యాప్ తర్వాత చంద్రముఖి 2 తో మళ్లీ అదృష్టం పరీక్షించుకోవాలి అనుకున్నా అదీ వర్కౌట్ కాలేదు భారీ అంచనాల మధ్య పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అయన ఈ మూవీ ఏ భాషలోనూ హిట్టవలేదు. జ్యోతిక నటనతో కంపేర్ చేసి విమర్శలు గుప్పించారు నెటిజర్లు. దీంతో ఓవరాల్ గా చూస్తే దక్షిణాది భాషల్లో నటించినా కంగనా సక్సెస్ అందుకోలేదేమో అనే సెంటిమెంట్ బలపడిపోయింది.
కంగన ప్రస్తుతం హిందీలో నటిస్తున్న రెండు సినిమాల్లో..తాను నటిస్తూ డైరెక్ట్ చేస్తున్న పొలిటికల్ కాంట్రవర్సీ మూవీ ఎమర్జన్సీ నవంబర్ 24న రిలీజ్ అవుతోంది. మరో మూవీ తేజస్ కూడా షూటింగ్ పూర్తైంది. మరి ఐదేళ్లుగా సరైన హిట్టులేని కంగనాకు ఈ మూవీస్ ఎలాంటి రిజల్ట్ ఇస్తాయో చూడాలి. ఇవి సక్సెస్ అయితే బీటౌన్‌లో ఇంకొన్నాళ్లు తిరుగులేదు..లేదంటే బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్..అన్ని ఇండస్ట్రీల లోనూ కష్టకాలమే. మరి కంగనా అదృష్టం ఎలా ఉందో చూడాలి..