సిరిసిల్ల నియోజకవర్గంలో కేటీఆర్‌కు గడ్డు పరిస్థితి కనిపిస్తోంది. సెంటిమెంట్ తో భారీ విజయాలు సాధిస్తున్న ఆయనకు ఈ సారి నెగెటివ్ సెంటిమెంట్ ఎదురొస్తోంది. గత లోక్ సభ ఎన్నికల్లో సిరిసిల్లలో అతి తక్కువ ఆధిక్యత వచ్చింది . ఈ సారి అసెంబ్లీ ఎన్నికల్లో అది కూడా కనిపించకుండా పోయే అవకాశం ఉంది.
సెంటిమెంట్ తో గెలుస్తూ వస్తున్న కేటీఆర్
2009లో జరిగిన తొలి ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి కేకే మహేందర్ రెడ్డిపై రామారావు 171 ఓట్ల స్వల్ప మెజారిటీతో గెలుపొందారు. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమ సెంటిమెంట్ తో భారీ మెజార్టీలు సాధించారు. 2018 ఎన్నికలలో 80వేల మెజార్టీ సాధించారు. కానీ ఆరు నెలలు తిరిగే సరికి జనం కర్రుకాల్చి వాత పెట్టారు. పార్లమెంట్ ఎన్నికల్లో సిరిసిల్ల సెగ్మెంట్ లో కేవలం ఐదు వేల లోపు మెజార్టీ మాత్రమే వచ్చింది. . బండి సంజయ్ బీజేపీ తరపున ఎనభై వేలకుపైగా ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.
ఈ సారి కేటీఆర్ పై బండి సంజయ్ పోటీ
ఈ ఏడాది ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తెలంగాణలో మిషన్ 90 నినాదంతో ప్రచారం నిర్వహిస్తున్న భారతీయ జనతా పార్టీ ఐటీ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రిపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌కుమార్‌ను పోటీకి దింపాలని యోచిస్తోంది. సిరిసిల్ల అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి కేటీఆర్‌పై పోటీ చేసేందుకు బండి సంజయ్ కుమార్ సరైన అభ్యర్థి అని బీజేపీ హైకమాండ్ అభిప్రాయపడింది. 2017లో నేరెళ్లలో దళితులపై పోలీసుల దౌర్జన్యాలు, ఇసుక మాఫియాపై బీజేపీ కరీంనగర్ పట్టణ అధ్యక్షుడిగా సంజయ్ కుమార్ లేవనెత్తారని గుర్తుచేస్తూ, సంజయ్ కుమార్‌కు ఈ సెగ్మెంట్లో మంచి యూత్ ఫాలోయింగ్ ఉంది
బండి సంజయ్‌కు స్పెషల్ క్రేజ్
కరీంనగర్ లోక్‌సభ నియోజక వర్గంలో ప్రస్తుత ఎంపీ బండి సంజయ్ కుమార్ 89,508 ఓట్ల ఆధిక్యతతో టీఆర్ఎస్ అభ్యర్థి బీ వినోద్ కుమార్‌పై విజయం సాధించడం గుర్తుండే ఉంటుంది. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో ఏడు సెగ్మెంట్లలో నాలుగు అసెంబ్లీ సెగ్మెంట్లలో బీజేపీ అభ్యర్థి ఆధిక్యం సాధించారు. కరీంనగర్, మానకొండూర్, చొప్పదండి, వేములవాడ అసెంబ్లీ సెగ్మెంట్లలో సంజయ్ ఆధిక్యం సాధించారు. ఇటీవల సెస్ ఎన్నికల్లో బీఆర్ఎస్ మద్దతు ఉన్న అభ్యర్థులకు గట్టిపోటీ ఇవ్వడం ద్వారా మొత్తం 15 డైరెక్టర్ పదవులకుగానూ ఐదు డైరెక్టర్ పదవుల్లో బీజేపీ మద్దతు ఉన్న అభ్యర్థులు మంచి పనితీరు కనబరిచారు. వివిధ కారణాల వల్ల బిజెపి మద్దతు ఇచ్చిన అభ్యర్థులు ఎన్నికలలో ఓడిపోయినప్పటికీ, నియోజకవర్గంలోకి సమర్థవంతంగా చొచ్చుకుపోవడం ద్వారా పార్టీ తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. అందుకే ఈ సారి కేటీఆర్‌కు గడ్డు పరిస్థితులు తప్పవంటున్నారు.