వైసీపీలో ఐ ప్యాక్ అలజడి – సర్వేల పేరుతో ఎమ్మెల్యేలను బెదిరిస్తున్నారా ?

[14:28, 10/2/2023] A: ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న వ్యవహారాలపై బీజేపీని నిందించేవారు ఎక్కువగా ఉన్నారు. ఇన్ని అరాచకాలు జరుగుతున్నా కేంద్రం స్పందించడం లేదంటే… ఆ పార్టీ ప్రమేయం.. బీజేపీ ఆశీస్సులు ఉన్నాయని ప్రచారం చేస్తున్నారు. కానీ ఇదంతా అబద్దమని అందరికీ తెలుసు. కానీ నిజాయితీగా ఈ విషయాన్ని ఒప్పుకునే ఒక్క పవన్ కల్యాణ్ మాత్రమే. అవనిగడ్డ బహిరంగసభలో పవన్ ప్రకటనలే ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.

సమాఖ్య స్ఫూర్తి గురించి చెప్పిన పవన్

ఏపీలో జరుగుతున్న అన్ని అంశాలపై కేంద్రానికి సమాచారం ఉంటుంది. అందులో ఉటుంది. కానీ ప్రతి విషయంలోనూ కేంద్రం జోక్యం చేసుకోగలదా అంటే సాధ్యం కాదు. ఇదే విషయాన్ని పవన్ కల్యాణ్ సూటిగా స్పష్టంగా చెప్పారు. మనది సమాఖ్య దేశం. రాష్ట్రాల ప్రభుత్వాలను కూడా ప్రజలు ఎన్నుకున్నారు. ఆయా ప…
[14:28, 10/2/2023] A: వైసీపీలో ఐ ప్యాక్ అలజడి – సర్వేల పేరుతో ఎమ్మెల్యేలను బెదిరిస్తున్నారా ?

వైసీపీలో ఐ ప్యాక్ అలజడి రేపుతోదంి. ఇటీవల జరిగిన సమావేశంలో ముఫ్పై మందికిపైగా టిక్కెట్లు ఇచ్చేది లేదన్న సంకేతాలను పార్టీ అధ్యక్షుడు, సీఎం జగన్ ఇవ్వడంతో ఐ ప్యాక్ రిపోర్టులపై ఎమ్మెల్యేల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. పీకే టీం ఇచ్చే రిపోర్టులు… నివేదికల ఆధారంగానే అన్నీ జరుగుతున్నాయి. అయితే పీకే టీం సభ్యులు తప్పుడు రిపోర్టులిస్తున్నారన్న అనుమానాలు వైసీపీ నేతల్లో ఉన్నాయి.

వైసీపీ విజయం వెనుక ప్రశాంత్ కిషోర్

2019 ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజయం వెనుక ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు ఉన్నాయి. ఆయన జగన్మోహన్ రెడ్డి కోసం ప్రత్యేకంగా పని చేశారు. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ సొంత రాజకీయం చేసుకుంటూ బీహార్‌లో పాదయాత్ర చేస్తున్నారు కానీ.. ఏపీలో ఐ ప్యాక్ టీం మాత్రం పని చేస్తోంది. పీకేకు సన్నిహితుడైన రిషి రాజ్ నేతృత్వంలో ఏపీలో పీకే టీం పని చేస్తోంది. ఇటీవల తెలంగాణలో పీకే టీం పని ఆపేసింది. ఆ సిబ్బంది అంతా ఏపీకి వచ్చారు. దీంతో నియోజకవర్గాల్లో పరిస్థితులను వారు ఎప్పటికప్పుడు ఆరా తీస్తూ జగన్‌కు నివేదికలు ఇస్తున్నారు. వారిపైనే జగన్ ఎక్కువగా ఆధారపడుతున్నారు.

మంత్రులు, ఎమ్మెల్యేల అసంతృప్తి

ఐ ప్యాక్ టీం అంటే… మంత్రులకూ ఇబ్బందికరంగా మారింది. గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం కూడా పూర్తిగా ఐ ప్యాక్ టీం పర్యవేక్షణ చేస్తోంది. ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు.. ఇంచార్జులు ఎలా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారనేది ప్రతీ రోజూ నివేదికలు పంపుతున్నారు. ఎమ్మెల్యేలు ఎవరెవరు గడప గడపకూ వెళ్లడంతో లేదో.. నేరుగా జగన్‌కే చెబుతున్నారు. అదే సమయంలో నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపిక పూర్తిగా పీకే టీం నివేదికలపై ఆధారపడి ఉంటుందని జగన్ పదే పదే చెబుతున్నారు. పనితీరు మెరుగుపర్చుకోవాలని సూచిస్తున్నారు. అయితే తాము గడప గడపకూ తిరిగినా తిరగలేదని నివేదికలు ఇస్తున్నారన్న ఆరోపణలు వారు చేస్తున్నారు.

పీకే బదులుగా రిషిరాజ్

రిషిరాజ్ ఐ ప్యాక్ ప్రతినిధి. ప్రశాంత్ కిషోర్ ప్రత్యక్ష స్ట్రాటజీల నుంచి విరమించుకుని బీహార్‌ లో రాజకీయ యాత్రలు చేసుకుంటున్నారు. ఆయనకు బదులుగా రిషిరాజ్ బాధ్యతలు తీసుకున్నారు. నిజానికి ఈ రిషిరాజ్ గత ఎన్నికల్లో వైసీపీ కోసం పని చేసిన కీలక వ్యక్తుల్లో ఒకరు. పీకే స్ట్రాటజీలు చెబితే.. పక్కాగా అమలు చేసేవాడు రిషిరాజ్. అందుకే జగన్ కు ఈయనపై చాలా నమ్మకం ఏర్పడింది. ఎన్నికల తర్వాత ..సీఎంగా జగన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత యూపీలో రిషిరాజ్ పెళ్లి జరిగితే ప్రత్యేక విమానంలో సతీసమేతంగా జగన్ వెళ్లారు. అంత నమ్మకం పెట్టుకున్న ఆయన… ఇప్పుడు పార్టీని పూర్తిగా చేతుల్లో పెట్టేశారని అంటున్నారు. ఇది పార్టీకి మంచిది కాదని భావిస్తున్నారు.