ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న వ్యవహారాలపై బీజేపీని నిందించేవారు ఎక్కువగా ఉన్నారు. ఇన్ని అరాచకాలు జరుగుతున్నా కేంద్రం స్పందించడం లేదంటే… ఆ పార్టీ ప్రమేయం.. బీజేపీ ఆశీస్సులు ఉన్నాయని ప్రచారం చేస్తున్నారు. కానీ ఇదంతా అబద్దమని అందరికీ తెలుసు. కానీ నిజాయితీగా ఈ విషయాన్ని ఒప్పుకునే ఒక్క పవన్ కల్యాణ్ మాత్రమే. అవనిగడ్డ బహిరంగసభలో పవన్ ప్రకటనలే ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.
సమాఖ్య స్ఫూర్తి గురించి చెప్పిన పవన్
ఏపీలో జరుగుతున్న అన్ని అంశాలపై కేంద్రానికి సమాచారం ఉంటుంది. అందులో ఉటుంది. కానీ ప్రతి విషయంలోనూ కేంద్రం జోక్యం చేసుకోగలదా అంటే సాధ్యం కాదు. ఇదే విషయాన్ని పవన్ కల్యాణ్ సూటిగా స్పష్టంగా చెప్పారు. మనది సమాఖ్య దేశం. రాష్ట్రాల ప్రభుత్వాలను కూడా ప్రజలు ఎన్నుకున్నారు. ఆయా ప్రభుత్వాల విధుల్లో కేంద్రం జోక్యం చేసుకోలేదు. చేసుకోవడం రాజ్యాంగ వ్యతిరేకం అవుతుంది. పవన్ కల్యాణ్ కూడా అదే చెప్పారు. ఏపీలో జరుగుతున్నవన్నీ కేంద్రానికి తెలుసని సమాఖ్య స్ఫూర్తిని గౌరవించకపోతే రాజ్యాంగం కుప్పకూలుతుందని చెప్పారు. ఆ నిజం అందరికీ తెలుసు. కానీ బీజేపీపై నిందలేస్తున్నారు.
బెంగాల్ లో ఇంకా ఘోరమైన పరిస్థితులు – బీజేపీ గీత దాటలేదు కదా !
ఏపీలో అరాచకాలు ఉన్నాయని ఏపీ బీజేపీ నేతలుకూడా పోరాడుతున్నారు. స్వయంగా వారు కూడా బాధితులే. పలుమార్లు దాడులకు గురయ్యారు.. ఇంత కంటే ఘోరమైన పరిస్థితులు బెంగాల్ లో ఉంటాయి. బెంగాల్ లో రాజకీయ హింస ఎక్కువగా ఉంటుంది. అయినా అక్కడ బీజేపీ రాజ్యాంగ స్ఫూర్తిని గౌరవిస్తుంది. ప్రజా ప్రభుత్వ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవాలనుకుకోలేదు. ఇక్కడే బీజేపీ సమాఖ్య స్ఫూర్తిని ఎలా గౌరవిస్తుందో అర్థం చేసుకోవచ్చు. ఏపీలో జరుగుతున్న వ్యవహారాల్లో బీజేపీ హస్తం ఉందని లేగా మద్దతు ఉందని చెప్పడంలో ఎంత కుట్ర ఉందో అర్థం చేసుకోవచ్చు.
బీజేపీపై కుట్రలను తిప్పికొట్టేందుకు నేతలు రెడీ
చంద్రబాబు అరెస్ట్ అక్రమం అని అందరి కంటే ముందు బీజేపీ ఖండించిది. అయినా బీజేపీ మద్దతు లేకుండా అరెస్టు చేస్తారా అని కొంత మంది దీర్ఘాలు తీస్తున్నారు. ఇదంతా బీజేపీపై కుట్రతో చేస్తున్నదే. సీఐడీ సహా. .. చంద్రబాబు .. స్కిల్ కేసు విషయంలో మొత్తం ప్రమేయం రాష్ట్రం చేతుల్లోనే ఉంది క. కేంద్రం వరకూ రాలేదు. రాష్ట్ర చేతుల్లో ఉన్న వాటిని కంద్రం ఎలా నియంత్రించగగలదు ? ఈ విషయం తేలితే అందరికీ క్లారిటీ వచ్చేస్తుంది.