వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో నోరున్న నేతల్లో పేర్ని నాని ఒకరు. మంత్రిగా వున్న సమయంలో తన శాఖ వ్యవహారాల సంగతెలా వున్నా, రాజకీయ ప్రత్యర్థులపై సెటైర్లు వేయడంలో ముందుండేవారు. అప్పటి మంత్రుల్లో పేర్ని నాని తర్వాతే ఎవరైనా మంత్రి పదవికి సంబంధించి కొనసాగింపు లభించలేదు పేర్ని నానికి. అయినాగానీ, తన వాయిస్‌ని పార్టీ తరఫున బలంగా వినిపించడంలో పేర్ని నాని తన ప్రత్యేకతను చాటుకుంటూనే వచ్చారు. అలాంటి పేర్ని నాని, రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించేశారు. పోటీ చేయబోనని అవసరం లేకపోయినా ప్రకటిస్తున్నారు.
కుమారుడి కోసం పేర్ని నాని ప్రయత్నం
పేర్ని నాని ముఖ్యమంత్రి పాల్గొన్న ఓ సభలోనే తాను ఎన్నికల్లో పోటీ చేయబోనని ప్రకటించారు పేర్ని నాని కొంత కాలంగా తాను పోటీ చేయబోనని చెబుతున్నారు కానీ రిటైర్మెంట్ గురించి చెప్పడం లేదు. తన కుమారుడికి చాన్సివ్వాలని ఆయన కోరుతున్నారు. అయితే జగన్ అందుకు సిద్ధంగా లేరని. పేర్ని నాని పోటీ చేయకపోతే వేరే నేతకు టిక్కెట్ ఇస్తారు కానీ పేర్ని నాని కొడుక్కి మాత్రం ఇవ్వబోరన్న ప్రచారం జరుగుతోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ తన కుమారుడికే టిక్కెట్ కావాలంటున్న పేర్ని నాని జగన్ పై ఒత్తిడి తేవడానికి ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారని కొంత మంది అంటున్నారు.
మచిలీపట్నం ఎంపీ బాలశౌరి తో విభేదాలు
గుంటూరుకు చెందిన వల్లభనేని బాలశౌరికి జగన్మోహన్ రెడ్డి సామాజిక సమీకరణాల కారణంగా మచిలీపట్నం ఎంపీ టిక్కెట్ ఇచ్చారు. అక్కడ ఆయన విజయం సాధించారు. మచిలీపట్నం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన పేర్ని నానికి ఆయనకు విభేధాలొచ్చాయి. ఎంపీ తన నియోజకవర్గంలో వేలు పెడుతున్నారని పేర్ని నాని అసహనానికి గురవుతున్నారు. వారి మధ్య పలుమార్లు వివాదాలు రావడంతో.. హైకమాండ్ జోక్యం చేసుకుని సర్దుబాటు చేసింది. కలసి పని చేయాలని సూచించింది. అయినా మార్పు రాలేదు. దీంతో పేర్ని నాని చిన్న బుచ్చుకోవాల్సి వస్తోంది. ఇది కూడా ఓ కారణం అంటున్నారు.
పేర్ని కిట్టుకు టిక్కెట్‌పై జగన్ వ్యతిరేకత ?
పేర్ని నాని మంత్రిగా బిజీగా ఉన్న సమయంలో పార్టీ వ్యవహారాలను పేర్ని కిట్టు చూసుకున్నారు. ఇంకా చెప్పాలంటే మచిలీపట్నం వరకూ ఆయనే మంత్రి అన్నట్లుగా వ్యవహరించారు. అధికారిక సమీక్షలు కూడా చేశారు. కొన్ని సార్లు వివాదాస్పదమయ్యాయి కూడా . అయితే సర్వేల్లో పేర్ని కిట్టు పరిస్థితి బాగోలేదని వస్తోందని అందుకే జగన్ ఈ సారి పేర్ని నానినే పోటీ చేయాలంటున్నారని చెబుతున్నారు.