‘పుష్ప 2’ లో సినిమాలో రమ్యకృష్ణ.. ఏ క్యారెక్టరో తెలుసా!

పుష్ప సినిమాకి వచ్చిన క్రేజ్ పుష్ప 2 తో అంతకుమించి అనిపించాలని మేకర్స్ స్ట్రాంగ్ గా డిసైడ్ అయ్యారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న ఈ మూవీకి సుకుమార్ దర్శకుడు. ఈ మూవీకి సంబంధించి తాజాగా ఇంట్రెస్టింగ్ అప్ డేట్ వచ్చింది..

సినీ ప్రియులు ఈగర్ గా వెయిట్ చేస్తున్న భారీ ప్రాజెక్ట్స్ లలో ‘పుష్ప2’ కూడా ఒకటి .ఈ మూవీ విషయంలో సుకుమార్ చాలా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు . పుష్ప1తో పాన్ ఇండియా రేంజ్ ని ఊపేసిన సుకుమార్ పుష్ప2తో గ్లోబల్ స్థాయిలో రికార్డులు బద్దలు కొట్టాలని డిసైడ్ అయిపోయాడు . అందుకే పుష్ప2 ని ఆస్కార్ కి నామినేట్ చేసే విధంగా తన సినిమాలో మార్పులు చేర్పులు చేస్తున్నట్టు తెలుస్తోంది. భారీ బడ్జెట్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్నాడు. నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. అయితే మరో బాలీవుడ్ బ్యూటీ కూడా ఇందులో నటిస్తోందని అది సర్ ప్రైజ్..నేరుగా తెరపైనే చూడబోతున్నారని టాక్. దీనికి తోడు ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే..పుష్ప 2లో రమ్యకృష్ణ కూడా కీ రోల్ లో కనిపించబోతోందట.

రవీనా-నదియాను వెనక్కు నెట్టిన రమ్య
నిజానికి పుష్ప 2 లో ఈ రోల్ కోసం చాలామంది బ్యూటీస్ ని సెలెక్ట్ చేసుకున్నారట. కేజీఎఫ్ లో రమికాసేన్ గా నటించిన రవినాటాండన్, తల్లి పాత్రల్లో అదిరిపోయే నదియాను తీసుకోవాలని అనుకున్నారట. కానీ కళ్ళల్లో గాంభీర్యం..మాటల్లో పొగరు కనిపించే రమ్యకృష్ణ అయితే ఈ రోల్ కి పర్ఫెక్ట్ అని ఫిక్సయ్యారట. ఆన్ స్క్రీన్ పై బన్నీ- రమ్యకృష్ణ మధ్య వచ్చే సీన్స్ అదిరిపోతాయని టాక్. నిజంగా రమ్యకృష్ణ పుష్ప2 సినిమాలో ఉంటే మాత్రం నిజంగా ఇది క్రేజీ అప్ డేటే అని చెప్పాలి. దీనిపై అఫీషియల్ అనౌన్స్ మెంట్ త్వరలోనే రాబోతోందని టాక్…

15 ఆగస్టు 2024 విడుదల
ఈ సినిమాపై ఉన్న క్రేజ్ తో ఈ మూవీ డిజిటల్ హక్కుల కోసం తీవ్ర పోటీ ఏర్పడినట్లుగా తెలుస్తోంది. ప్రముఖ ఓటిటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ పుష్ప ద రూల్ ఓటిటీ హక్కుల కోసం ట్రై చేస్తోంది. రికార్డ్ ప్రైస్ ని పుష్ప 2 కోసం కోట్ చేసినట్లుగా చెబుతున్నారు. ప్రస్తుతం ఓటిటీ దిగ్గజాల్లో నెంబర్ 1 పొజిషన్ లో ఉన్న నెట్ ఫ్లిక్స్ కే పుష్ప 2 రైట్స్ సొంతమవుతాయని అంటున్నారు. ఆగష్టు 15, 2024 న విడుదల తేదీని లాక్ చేశారు. అంటే వరసగా నాలుగు రోజుల లాంగ్ వీకెండ్ కలిసిరానుండడంతో వారాంతంలో బాక్సాఫీసుని పుష్ప 2 చెడుగుడు ఆడేయడం పక్కా అని ప్రేక్షకులు ఫిక్సైపోయారు.