ఏపీ బీజేపీ చెప్పింది కూడా అదే – గ్రామ, వార్డు సచివాలయాలు రాజ్యాంగ వ్యతిరేకమన్న కాగ్ !

పంచాయతీలను నిర్వీర్యం చేసి మహాత్ముడి ఆశయాలను నీరుగారుస్తున్న ఏపీ ప్రభుత్వ వైఖరిని బీజేపీ గతంలోనే బయటపెట్టింది. సర్పంచ్‌ల నిధుల మళ్లింపుపై చేసిన ఉద్యమంలో గ్రామ, వార్డు సచివాలయాల ఏర్పాటును తప్పు పట్టింది. ఇప్పుడు కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ రిపోర్టు కూడా అదే వెల్లడించింది.

రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసిన గ్రామ, వార్డు సచివాలయాలు

సచివాలయ వ్యవస్థ కీ రాజ్యాంగ స్ఫూర్తిని నీరుగార్చేలా ఉంది. 74వ రాజ్యాంగ సవరణ చట్టం పట్టణ స్థానిక సంస్థలకు రాజ్యాంగ హోదాను అందించింది. ఈ చట్టం భారత రాజ్యాంగంలోని 12వ షెడ్యూల్‌లో పేర్కొన్న 18 విధులు నిర్వహించేందుకు పట్టణ స్థానిక సంస్థలకు అధికారం ఇచ్చింది. వాటిలో 13 విధులను పూర్తిగాను, మూడు విధులను పాక్షికంగానూ నగర పాలక సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది. స్థానిక సంస్థలు ఎన్నికైన ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం లేకుండా రాష్ట్రప్రభుత్వ కనుసన్నల్లో… ప్రత్యేక అధికారుల పాలనలోనే మగ్గుతున్నాయి. ఎన్నికైన ప్రజాప్రతినిధులు, పౌరులను భాగస్వామ్యం చేయడం, పౌరులకు పాలనను చేరువ చేయడం స్థానిక స్వపరిపాలన ప్రధాన లక్ష్యం. రాష్ట్రంలో ఎక్కడా వార్డు కమిటీలను ఏర్పాటు చేయనే లేదు. ఇక పౌరులను భాగస్వామ్యం చేసే పరిస్థితి అసలు లేదు. ఇవి రెండూ చేపట్టకుండా వార్డు స్థాయిలో సచివాలయాల వ్యవస్థ రూపుదిద్దుకోవడం స్థానిక స్వపరిపాలనకు ఉద్దేశించిన రాజ్యాంగ స్ఫూర్తిని నీరుగార్చడమేనని కాగ్ స్ప,్టం చేసింది.

గత ప్రభుత్వాల నుంచి అమరావతికి నష్టం

గత, ప్రస్తుత ప్రభుత్వాలు అనుసరిస్తున్న నిర్వాకం రాజధాని అమరావతికి తీవ్ర నష్టాన్ని కలిగించాయి. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు మారినా… ప్రజలకు సేవ చేసే విషయంలో పోటీపడి, ప్రజాధనానికి నష్టం కలగకుండా చేయాల్సిన బృహత్తర కర్తవ్యం పాలకులది. ఆ స్ఫూర్తిని ప్రభుత్వాలు మంటగలిపితే… కలిగే అనర్థాలకు అమరావతి ఓ సజీవ సాక్ష్యం. 2019 నుంచి అమరావతికి బడ్జెట్‌ సహకారం లేకపోవడం, రూ.33,476 కోట్లు రుణంగా సమీకరిరచు కోవాల్సి ఉరడగా, రూ.8,540 కోట్లే సమీకరించడం, కాలపరిమితి లేకురడా ఉన్న 55 ప్యాకేజిల ఒప్పందాలపై అనిశ్చితి, వాటిని పూర్తి చేయడానికి అవసరమైన రూ.28,048 కోట్లపై స్పష్టత లేకపోవడం… ఇలా ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణిని కాగ్‌ ఎండగట్టింది.

ప్రభుత్వ భూములు కాకుండా.. ప్రైవేటు భూముల్లో రాజధాని వల్ల భారీ భారం

భూసమీకరణకు రూ.2,245 కోట్లు సిఆర్‌డిఎ వ్యయం చేయగా, ఆ భూమంతా నిరుపయోగంగా పడి వుంది. ఈ విషయంలో అమరావతిని ఒక భ్రమరావతిలా కంప్యూటర్‌ గ్రాఫిక్స్‌ చూపిన గత ప్రభుత్వ నిర్వాకం కూడా ఉంది. ప్రభుత్వ భూములను వదిలేసి ప్రైవేటు భూములనే రాజధానికి సేకరించడం, 70 శాతాన్ని భూసమీకరణ ద్వారా సేకరిరచాలని అప్పట్లో తీసుకున్న నిర్ణయాన్ని కాగ్‌ నివేదిక ఆక్షేపించింది. ఈ నిర్ణయం కారణంగా రానున్న కాలంలో భారీ ఆర్థిక భారం పడనుందని హెచ్చరించింది. బీజేపీ కూడా ఇదే విషయాన్ని పలుమార్లు స్పష్టం చేసింది. ఇప్పుడు రైతులు అన్యాయమైపోయారు.