పులిపిర్ల సమస్య చాలామందిని వేధిస్తోంది. శరీరంలో ఏ భాగంలో అయినా ఇవి వస్తాయి. ఎక్కువగా ముఖం, మెడ భాగాల్లో ఎక్కువగా కనిపిస్తాయి. వీటిని వదిలించుకునేందుకు తిప్పలు పడుతుంటారు. అయితే కాఫీ పొడితో అ సమస్యకు చెక్ పెట్టేయండి అంటున్నారు నిపుణులు…
పులిపిర్లు ఎందుకొస్తాయి
పులిపిర్లు హ్యూమన్ పాపిలోనా వైరస్ అనే వైరస్ ఇన్ఫెక్షన్ కారణంగా వస్తాయి. గాయాలు, దెబ్బలు తగిలినప్పుడు ఈ వైరస్ శరీరంలోకి ప్రవేశించి కణాలన్ని ఒకే దగ్గర పెరిగేలా చేస్తుంది. ఈ కణాలన్ని చర్మంపై పెరిగి గట్టిపడి క్రమంగా పులిపిర్లుగా మారతాయి.
కట్ చేయొద్దు
శరీరంలో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారికి, చర్మం పొడిగా ఉండే వారిలో పులిపిర్లు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. చాలా మంది పులిపిర్లను గిల్లడం, బ్లేడుతో కట్ చేయడం చేస్తుంటారు. ఇలా అస్సలు చేయకూడదని నిపుణులు సూచిస్తున్నారు. చేతి వేళ్ల చుట్టూ వచ్చే పులిపిర్లను కామన్ వార్ట్స్ అని అంటారు. పాదాలపై వచ్చే పులిపిర్లను ప్లాంటార్ వార్ట్స్ అంటారు. ముఖం, మెడ మీద వచ్చే పులిపిర్లను ఫ్లాట్ వార్ట్స్ అని అంటారు. కొంతమందికి జననాంగాలపై కూడా ఇవి ఏర్పడతాయి. వాటిని జనైటల్ వార్ట్స్ అని పిలుస్తారు.
పులిపిర్లు తగ్గించే చిట్కాలు
పులిపిర్లు ఉన్నవారు ఇంటి చిట్కాలను ఉపయోగించుకుంటే సులభంగా తగ్గించుకోవచ్చు. ఈ చిట్కాలను ఫాలో అవడం చాలా సులభం. పులిపిర్లు వాటంతట అవే రాలిపోతాయి. అలాగే ఎటువంటి దుష్ప్రభావాలు, నొప్పి, బాధ కూడా ఉండవు.
- ఆర్గానిక్ పసుపు, వంటసోడా, సున్నాన్ని సమాన మోతాదులో తీసుకుని అందులో నిమ్మరసం వేసి పేస్టులా చేసుకోవాలి. ఇందులో కాఫీ పొడి వేసి కలపాలి. కాఫీ పొడిని వాడడం వల్ల చర్మం ఎర్రగా మారకుండా, దెబ్బతినకుండా ఉంటుంది. ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని దూదితో లేదా ఇయర్ బడ్ తో పులిపిర్లపై రాయాలి. ఈ మిశ్రమం ఆరిన తర్వాత మళ్లీ మళ్లీ రాస్తుండాలి. ఇలా రోజుకి 5 నుంచి 6 సార్లు రాయాలి. కొన్ని రోజులు ఇలా చేయడం వల్ల పులిపిర్లు వాటంతట అవే రాలిపోతాయి.
- 4 వెల్లుల్లి రెబ్బల నుంచి రసాన్ని తీసుకోవాలి. ఇందులో కొద్దిగా నిమ్మరసం, వంటసోడా, సున్నం కలిపి పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్నిదూదితో లేదా ఇయర్ బడ్ తో పులిపిర్లపై రాయాలి. ఈ మిశ్రమం ఆరే కొద్దీ రాస్తుండాలి.ఈ చిట్కా కూడా కొన్ని రోజులు ఫాలో అయితే పులిపిర్లు వాటంతట అవే రాలిపోతాయి.
- దూదిని యాపిల్ సిడర్ వెనిగర్‌లో ముంచి పులిపుర్లు ఉన్నచోట అద్దితే చాలు. వారంలో కనీసం ఐదు రోజులు ఇలా చేస్తే పూర్తిగా మాయమవుతాయి.
- కలబందలో ఉండే మేలిక్ యాసిడ్ పులిపిర్లలోని ఇన్ఫెక్షన్లతో పోరాడుతుంది. కలబంద జిగురు పులిపిర్లపై రాస్తే చాలు.
- ఆముదంలో కాస్త బేకింగ్ పౌడర్ వేసి బాగా కలపండి. దాన్ని పులిపిర్లపై రాసి బ్యాండేజ్ వేయండి. అలా రాత్రంతా వదిలిపెట్టండి. ఇలా రెండు నుంచి మూడు రోజులు చేసినట్లయితే పులిపిర్లు పూర్తిగా తొలగిపోతాయి.
- అరటి పండు తొక్కతో రోజు పులిపిర్లపై రుద్దితే అది క్రమేనా కనుమరుగు అవుతుంది.
గమనిక: ఆరోగ్య నిపుణులు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. దీనిని ఏ మేరకు విశ్వశించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం.