అనకాపల్లిలో మంత్రి గుడివాడకు టిక్కెట్ ఉందా ? దాడి ఫ్యామిలీ పార్టీలో ఉంటారా ?

ఉమ్మడి విశాఖ జిల్లాలో రాజకీయ కంద్రంగా ఉన్న అనకాపల్లి నుంచి రెండవసారి ఎమ్మెల్యేగా తానే పోటీ చేస్తానని గుడివాడ అమరనాధ్ ప్రకటించారు. కానీ ఆయనకు చాన్స్ ఉందా లేదా అన్నదానిపై చర్చ జరుగుతూనే ఉంది. గుడివాడ అమర్నాథ్ వేరే నియోజకవర్గంపై కన్నేశారని కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. ఆయన కనుక షిఫ్ట్ అయితే అనకాపల్లి సీటు మాజీ మంత్రి దాడి వీరభద్రరావు కుమారుడు దాడి రత్నాకర్ కి దక్కుతుందని ఆయన వర్గం ఆశలు పెట్టుకుంది.

టీడీపీ నుంచి వైసీపీలో చేరి కనుమరుగు అవుతున్న దాడి ఫ్యామిలీ

2019లోనే టికెట్ కోసం వైసీపీలో చేరిన దాడి ఫ్యామిలీకి ఏ పదవీ దక్కలేదన్న ఆవేదన ఉంది. ఎమ్మెల్యే సీటు విషయంలోనే ఇంతకాలం ఓపిక పట్టారని అంటున్నారు. ఇపుడు ఎటూ సీటు దక్కదని తేలిపోయింది. స్వయంగా మంత్రి తానే మళ్లీ అనకాపల్లి నుంచి పోటీ చేస్తాను అని చెబుతున్న నేపధ్యంలో హై కమాండ్ కూడా ఆయనకే ఓటేసింది అని అంటున్నారు. అనకాపల్లి గవర సామాజికవర్గం ఎక్కువగా ఉంటుంది. ఆలాగే కాపులు కూడా ఎక్కువే. దాంతో పాటు మంత్రి కూడా దూకుడుగా వ్యవహరిస్తున్నారు.

దాడి పార్టీలో ఉంటారా ?

దాడి ఫ్యామిలీ ఈసారి సహాయ నిరాకరణ చేసినా కూడా గెలిచి చూపించాలని అమర్నాథ్ అనుకుంటున్నారు. మంత్రి వర్సెస్ దాడి అన్నట్లుగా వైసీపీలో సాగుతున్న అంతర్గత పోరు ఇక మీదట బాహాటం అవుతుందా అన్న చర్చ కూడా వస్తోంది. దాడి ఫ్యామిలీ వేరే పార్టీ వైపు చూస్తుందా అన్న చర్చ మొదలైంది. దాడి ఫ్యామిలీకి ఆప్షన్లు ఏమి ఉన్నాయన్నది కూడా ఆలోచిస్తున్నారు. జనసేనలోకి రావాలని 2019లో పవన్ కళ్యాణ్ స్వయంగా దాడి ఇంటికి వెళ్లి ఆహ్వానించారు. కానీ నాడు చేరలేదు. ఇపుడు పొత్తుల్లో భాగంగా టిక్కెట్ వస్తుందేమో అని ఆశపడే అవకాశం ఉంది. అందుకే దాడి పార్టీ మారవచ్చన్న ప్రచారం జరుగుతోంది.

టీడీపీలో చాన్స్ లేదు !

ఏది ఏమైనా దాడి ఫ్యామిలీకి వైసీపీలో టికెట్ లేదని పక్కాగా క్లారిటీ వచ్చేసింది అని అంటున్నారు. అనకాపల్లిలో ఈసారి వైసీపీ వర్సెస్ టీడీపీ గట్టిగానే పోరు సాగుతుంది అని అంటున్నారు. టీడీపీతో పొత్తులు ఉంటే జనసేన సాయం కూడా వైసీపీకి టఫ్ గా మారుతుంది. ఇక గత ఎన్నికల్లో సహకరించిన దాడి వర్గం ఈసారి మైనస్ అయితే మంత్రి గుడివాడ ఎలా బయటపడతారు అన్నది చర్చకు వస్తున్న మరో విషయం. అయితే వైసీపీకి సాలిడ్ గా ఓటు బ్యాంక్ ఉందని, గత అయిదేళ్లలో చేసిన సంక్షేమ పధకాలే తమకు శ్రీరామ రక్ష అని మంత్రి వర్గం అంటోంది. ఇక సామాజిక సమీకరణలు తమకు సహకరిస్తాయని కూడా బలంగా నమ్ముతోంది.