మంత్రి ధర్మాన రిటైర్మెంంట్ కోరుకుంటున్నారా ? అందుకే వివాదాస్పద ప్రకటనలు

మంత్రి ధర్మాన ప్రసాదరావు వ్యవహారశైలి వైసీపీ ఇబ్బందికరంగా మారింది. ఆయన పార్టీకి నష్టం చేసేలా పదే పదే వ్యాక్లు చేస్తున్నారు. ప్రతిపక్షాలపైనే కాదు, ప్రజలపై, సొంత పార్టీ నేతలపై కూడా ధర్మాన విరుచుకుపడటం సహజంగా మారిపోయింది. ఈసారి ఆయన సొంత పార్టీ నేతల్ని టార్గెట్ చేశారు. పార్టీలోనే కొనసాగుతూ పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్న వారిని బహిష్కరిస్తామని వార్నింగ్‌ ఇచ్చారు. పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్న వారిని ఇప్పటికే గుర్తించామని, ఏరివేత చర్యలు త్వరలో మొదలవుతాయని హెచ్చరించారు. మరోవైపు వలంటీర్లపై కూడా ఆయన మండిపడ్డారు. వలంటీర్లతో అప్రమత్తంగా ఉండాలని, పార్టీకి వారు చేటు తెచ్చే అవకాశాలున్నాయని అన్నారు.

సైకిల్ గుర్తును ఎందుకు ప్రమోట్ చేస్తున్నారు ?

ప్రజలంతా సైకిల్ గుర్తుకు ఓటేస్తామంటున్నారని.. కానీ జగన్ ను గెలిపించాలనుకుంటున్నారని ప్రజలకు అవగాహన కల్పించాలని అంటున్నారు. గత ఎన్నికల్లో చంద్రబాబును గెలిపించాలని ప్యాన్ గుర్తుకు ప్రజలు ఓటేశారా అనే సెటైర్లు వినిపిస్తున్నాయి. ఆయన ఏ కార్యక్రమంలో పాల్గొన్నా.. లబ్దిదారులను ఎవరి ఓటేస్తారని అడగడం.. వారు సైకిల్ కు అని చెప్పడం కామన్ అయింది. కావాలని చెప్పిస్తున్నారా అన్న సందేహాలు కూడా కనిపిస్తున్నారు. ఇలాంటివి ఎన్ని జరుగుతున్నా.. ఓటెవరికి ధర్మాన అడుగుతూనే ఉన్నారు. అసలు అంతా తెలిసి ఎందుకు ఇలా అడుగుతారు సార్ అని అయన అనచరులు గొణుక్కుంటూ ఉంటారు.

ఓటర్లను బెదిరించేలా – ఉపాధ్యాయులను కించ పరిచేలా వ్యాఖ్యలు

ఇటీవలి కాలంలో ఆయన ఓటర్లను బెదిరించేలా మాట్లాడుతున్నారు. మీరంతా సైకిల్ గుర్తు మాయలో ఉన్నారని నేరుగానే అంటున్నారు. తాజాగా ఆయన జగన్ ను సైకో, క్రాక్ అంటున్నారని మండిపడ్డారు. సీఎం జగన్‌ను పిచ్చోడు, క్రాక్ అంటున్నారని .. మీకు ఇష్టముంటే ఓటేయండి లేకపోతే మానేయండి అంతే కానీ సీఎం జగన్ ను ఇలా అంటారా అని జనంను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. జనం అంతా జగన్ ఖాతాల్లో వేస్తున్న డబ్బులతోనే బతుకుతున్నారన్నట్లుగా చెప్పుకొస్తున్నారు. ఆమధ్య అమరావతి రైతుల అరసవెల్లి యాత్ర సందర్భంలో కూ . ఉత్తరాంధ్రకు వచ్చి మా పీక కోస్తారా అని ప్రశ్నించారు. వారిని రాజకీయంగా చితక్కొట్టాలని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత ఓ సభలో.. వైసీపీకి ఓటు వేయకపోతే వారి చేయిని వారే నరుక్కున్నట్టు అంటూ కలకలం రేపారు ధర్మాన. తన సభనుంచి వెళ్లిపోతున్న మహిళలను ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇక ఉపాధ్యాలు ప్రభుత్వం వద్ద జీతాలు తీసుకుంటూ వ్యాపారాలు చేస్తారన్న ఆరోపణలూ చేశారు.

ధర్మాన కుమారుడికి టిక్కెట్ కోసమేనా ?

ధర్మాన ఈ సారి రాజకీయాల నుంచి రిటైర్మెంట్ తీసుకోవాలనుకుంటున్నారు. ఆయన కుమారుడికి టిక్కెట్ ఇవ్వాలని జగన్ ను కోరారు. కానీ ఈ సారి వారసులకు చాన్స్ లేదని.. మీరే పోటీ చేయాలని జగన్ రెడ్డి అంటున్నారు. దీంతో హైకమాండే తనను వద్దనేలా చేసేందుకు ఇలాంటి కామెంట్లు చేస్తున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన వ్యూహం ఏమిటో కానీ వైసీపీకి ఇబ్బందికరంగా మారింది.