ప్రధానమంత్రి నరేంద్రమోదీ దేశ రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చేస్తున్నారు. రాజకీయాల్లో అంతరించిపోతున్న విలువలు. పెరిగిపోతున్న అసమానతలను చక్కదిద్దడానికి కీలక నిర్ణయం తీసుకున్నారు. మహిళా రిజర్వేషన్ల బిల్లు ఆమోదం పొందబోతోంది. ఇది తీసుకు రాబోయే మార్పుల గురించి ఊహించడం అంత తేలిక కాదు. ముఫ్పై మూడు శాతం అంటే… చిన్న విషయం కాదు. అంతే ఇవ్వాలన్న రూలేం లేదు. అంత ఖచ్చితంగా ఇవ్వాలి. దీని వల్ల మహిళలు రాజకీయాల్లోకి వస్తారు. వారి సామర్థ్యం దేశానికి ఉపయోగపడుతుంది. అన్నింటికీ మించి రాజకీయాలలో విలువలు పెరుగుతాయి.
రాజకీయాల్లో మహిళా ప్రాతినిధ్యం పెరిగితే దేశానికెంతో మేలు
న్యూజిలాండ్ వంటి రాష్ట్రాల్లో చిన్న వయసులోనే మహిళలు ప్రధానమంత్రులు అవుతున్నారు. కానీ మన దేశంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు అవడానికే కష్టపడాల్సి వస్తోంది. దేశంలో మహిళా ఓటర్లు …. పురుష ఓటర్ల కంటే ఎక్కువే ఉన్నారు. కానీ వారి ప్రాతినిధ్యం పది .. పదిహేను శాతానికి మించడం లేదు. అదీ కూడా రాజకీయ పార్టీలు తప్పనిసరిగా ఇవ్వాలన్నట్లుగా ఇస్తున్నాయి. నిజంగా నాయకత్వం వహించగలిగే మహిళలకు అవకాశాలు దక్కడం లేదు. ప్రస్తుతం ప్రధాని మోదీ తీసుకు వస్తున్న బిల్లు వల్ల మహిళా లోకం ముందుకు వస్తుంది. దేశాన్ని ముందుకు తీసుకెళ్లడానికి మహిళా నేతల శక్తి ఉపయోగపడుతుంది.
రాజకీయాల్లో విలువలు మెరుగుపడే అవకాశం
రాజకీయాల్లో విలువలు రోజు రోజుకు దిగజారిపోతున్నాయి. రాజకీయాలంటే ఇంత ఘోరంగా ఉండాలా అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు. అధికార దాహంతో ఏం చేయాడానికైనా వెనుకాడటం లేదు. పాతుకుపోయిన నేతలు.. తమ రాజకీయం కోసం తాత్కలిక ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇలాంటి వాటిని చూస్తే… మహిళా నేతలు మరింత బాధ్యతతో ఉంటారని భావిస్తున్నారు. అందుకే.. మహిళ ప్రాతినిధ్యం ఎంత పెరిగితే.. రాజకీయాల్లో అంతగా విలువలు పెరిగే అవకాశం ఉంది. ఈ దిశగా మోదీ చేస్తున్న కృషి దేశ రాజకీయాల్లో కీలక మార్పులు తెచ్చే అవకాశం ఉంది.
ఈ సెషన్లోనే మరిన్ని కీలక నిర్ణయాలు
ఈసెషన్లోనే మరిన్ని కీలక నిర్ణయాలను కేంద్రం ప్రకటించే అవకాశం ఉంది. యూసీపీ, భారత్, జమిలీ ఎన్నికలపైనా నిర్ణయం తీసుకుంటే… కొత్త పార్లమెంట్ భవనం సాక్షిగా.. దేశానికి కొత్త చరిత్ర ప్రారంభమయినట్లు అవుతుంది. కాలానికి అనుగుణంగా ప్రజాస్వామ్యంలో కీలకమైన మార్పులు తెచ్చినట్లు అవుతుంది. దీనికి ప్రజలంతా మద్దతుగా ఉండటం అసలు విశేషం.