మూత్రం ఈ రంగులో వస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి!

శ‌రీరంలో ఎప్ప‌టిక‌ప్పుడు ఉత్ప‌త్తి అయ్యే వ్య‌ర్థాలు మూత్రం, చెమ‌ట‌, మ‌లం ద్వారా బ‌య‌ట‌కు వెళ్తుంటాయి. అయితే మూత్రం చాలా మందికి క్లియ‌ర్‌గానే ఉంటుంది. కానీ కొంద‌రికి రంగు మారి వ‌స్తుంది. దీనికి కారణాలేంటి..ఏ రంగులో వచ్చినప్పుడు అప్రమత్తం అవ్వాలో చెబుతూ వైద్య నిపుణులు కొన్ని సూచనలిచ్చారు..అవేంటో చూద్దాం..

వ్య‌క్తుల‌కు ఉండే అనారోగ్య స‌మ‌స్య‌లు, వాడే మందులు, తింటున్న ఆహారం.. ఇవన్నీ కూడా మూత్రం క‌ల‌ర్ మారడానికి కారణం కావొచ్చు. అయితే కొన్ని ర‌కాల క‌ల‌ర్‌ల‌తో మూత్రం త‌ర‌చూ వ‌స్తుంటే మాత్రం జాగ్ర‌త్త వ‌హించాల్సిందే. కొన్ని వ్యాధులు అటాక్ చేయడానికి సిద్ధంగా ఉన్నాయని గ్రహించాలి.

@ మూత్రం క్లియ‌ర్‌గా లేత ప‌సుపు రంగులో వ‌స్తుంటే మీరు స‌రిగ్గానే నీళ్ల‌ను తాగుతున్నారని ఎలాంటి వ్యాధులు లేవ‌ని అర్థం చేసుకోవాలి

@ డార్క్ ప‌సుపు రంగు లేదా గోధుమ రంగులో వ‌స్తుంటే అది డీహైడ్రేష‌న్‌ను సూచిస్తుంది. అంటే మీరు తాగుతున్న నీరు శ‌రీరానికి స‌రిపోవ‌డం లేద‌ని మ‌రిన్ని నీళ్ల‌ను తాగాల్సి ఉంటుంద‌ని అర్థం

@ నారింజ రంగులో మూత్రం వ‌స్తుంటే అందుకు మీరు వాడుతున్న ప‌లు మెడిసిన్లు కార‌ణం కావ‌చ్చు. లేదా కొన్ని ర‌కాల ఆహారాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల‌, డీహైడ్రేష‌న్ బారిన ప‌డ‌డం వ‌ల్ల కూడా ఇలా నారింజ రంగులో మూత్రం వ‌స్తుంది. లివ‌ర్ లేదా పిత్తాశ‌య స‌మ‌స్య‌లు ఉన్నా కొంద‌రికి ఇలా మూత్రం నారింజ రంగులో వ‌స్తుంది.

@ కొందరికి మూత్రం పింక్ లేదా ఎరుపు రంగులో వ‌స్తుంది. మూత్రాశ‌య ఇన్‌ఫెక్ష‌న్లు, కిడ్నీ స్టోన్లు, యూరిన‌రీ ట్రాక్ట్ ఇన్‌ఫెక్ష‌న్లు, కిడ్నీ వ్యాధులు ఉన్న‌వారికి ఈ క‌ల‌ర్‌లో మూత్రం వ‌స్తుంది. ఈ రంగులో మూత్రం వ‌స్తుంటే ఏమాత్రం ఆల‌స్యం చేయ‌కుండా వెంట‌నే డాక్ట‌ర్‌ను క‌ల‌సి ప‌రీక్ష‌లు చేయించుకోవాలి.

@ లివ‌ర్ వ్యాధులు ఉన్న‌వారికి, తీవ్ర‌మైన డీహైడ్రేష‌న్ బారిన ప‌డిన వారికి, కండ‌రాల క‌ణ‌జాలం న‌ష్టానికి గుర‌య్యే వ్యాధి ఉన్న‌వారికి బ్రౌన్ క‌ల‌ర్‌లో వ‌స్తుంది. ఈ క‌ల‌ర్‌లో మూత్రం వ‌చ్చినా స‌రే జాగ్ర‌త్త ప‌డాల్సిందే.

@ కొంద‌రికి నురుగుతో లేదా మ‌డ్డిగా వ‌స్తుంది. సాధార‌ణంగా చీము, ఇన్‌ఫెక్ష‌న్లు, కిడ్నీ వ్యాధులు ఉన్న‌వారికి ఇలా మూత్రం వ‌స్తుంది. క‌నుక ఇలా మూత్రం వచ్చినా స‌రే డాక్టర్‌ను క‌లిసి ప‌రీక్ష‌లు చేయించుకోవాలి.

రోజూ త‌గిన‌న్ని నీళ్ల‌ను తాగ‌డం, తాజా పండ్లు, కూర‌గాయ‌లు తీసుకోవడం మంచిది. ఏ చిన్న వ్యత్యాసం గమనించినా వెంటనే వైద్యులను సంప్రదించాలి.

గమనిక: ఆరోగ్య నిపుణులు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. దీనిని ఏ మేరకు విశ్వశించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం.