బాహుబలి కలెక్షన్స్ రికార్డ్ ని జవాన్ బ్రేక్ చేస్తుందా!

లాంగ్ గ్యాప్ తర్వాత పఠాన్ సినిమాతో హిట్టందుకున్న షారుక్ ఖాన్..తాజాగా సౌత్ దర్శకుడు అట్లీతో చేసిన జవాన్ తో ఆ సక్సెస్ ను కంటిన్యూ చేశాడు. అయితే జవాన్ జోరు చూస్తుంటే పఠాన్ మూవీ రికార్డ్ ని మాత్రం బ్రేక్ చేయడమే కాదు బాహుబలికి దగ్గరగా వచ్చే అవకాశం ఉందంటున్నారు ట్రేడ్ వర్గాలు…

‘బాహుబలి 2’కి చేరువగా వచ్చిన ‘పఠాన్’
భారత్ లో హైయెస్ట్ కలెక్షన్స్ సాధించిన సినిమాల జాబితాలో మొదటి స్థానంలో ఉంది ‘బాహుబలి 2’. ‘దంగల్’ రెండు వేల కోట్లకి పైగా కలెక్ట్ చేసిన వాటిలో మెజారిటీ షేర్ చైనా మార్కెట్ నుంచి వచ్చిందే. ఇండియాలో పెద్దగా వసూళ్లు లేవు. ఒక్క హిందీలోనే బాహుబలి 2 ఏకంగా 725 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. దీనిని ‘పఠాన్’ సినిమాతో షారుఖ్ ఖాన్ అందుకోవాలని ట్రై చేశాడు కానీ ఈ మూవీ ఫైనల్ గా 640 కోట్ల గ్రాస్ దగ్గర ఆగిపోయింది. రీసెంట్ గా ‘గద్దర్ 2’బ్లాక్ బస్టర్ హిట్ టాక్ సొంతం చేసుకొని రికార్డు స్థాయిలో కలెక్షన్స్ రాబడుతోంది. అయితే ఈ మూవీ కూడా నెట్ కలెక్షన్స్ పరంగా బాహుబలి 2ని బీట్ చేసింది. కానీ గ్రాస్ పరంగా మాత్రం అందుకోలేదు. బాహుబలి 2ని బ్రేక్ చేసి హిందీ సినిమా స్టామినాని చూపించాలని అక్కడ దర్శక, నిర్మాతలు, హీరోలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు జవాన్ పైనా అదే ఆశతో ఉన్నారు…

బాహుబలిని బీట్ చేయడం తేలికేం కాదు
గ్రాస్ కలెక్షన్స్ పరంగా బాహుబలి 2ని బ్రేక్ చేయడం అంత తేలికైన విషయం కాదు. షారుఖ్ ఖాన్ అట్లీ దర్శకత్వంలో చేసిన జవాన్ మూవీ ఇప్పటికే గ్రాస్ పరంగా ప్రపంచ వ్యాప్తంగా 600 కోట్లు దాటిపోయింది. అయితే హిందీ బెల్ట్ లో కలెక్షన్స్ చూసుకుంటే నాలుగు రోజుల్లో 252 కోట్ల కలెక్షన్స్ సొంతం చేసుకుంది. బాహుబలి 2ని బ్రేక్ చేయాలంటే ఇంకా 600 కోట్ల వరకు కలెక్ట్ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ మొత్తం అందుకోవడం అంత ఈజీ అయితే కాదు. నిలకడగా భారీ కలెక్షన్స్ ని రాబడుతూ కనీసం రెండు వారాలు కొనసాగాలి. అప్పుడే బాహుబలి 2 రికార్డుని బ్రేక్ చేసే అవకాశం ఉంటుంది. అయితే ‘జవాన్’ సినిమా ‘పఠాన్’ మూవీ రికార్డ్ ని మాత్రం బ్రేక్ చేసే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నారు. లాంగ్ రన్ లో షారుఖ్ ఖాన్ ఖాతాలో మరో వెయ్యి కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన చిత్రంగా జవాన్ నిలిచే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇప్పటికే 600 కోట్లు రావడంతో మరో వారంలో వెయ్యికోట్లు పక్కా అంటున్నారు.

ఏదేమైనా ఇప్పటి వరకూ బాహుబలి 2ని దాటే గ్రాస్ కలెక్షన్లు సాధించే సినిమా రాలేదు. ఇక సెట్స్ పై ఉన్న భారీ ప్రాజెక్టులు ఏమైనా రికార్డ్ బ్రేక్ చేస్తాయేమో వెయిట్ అండ్ సీ…