ఎక్కువ నీళ్లుతాగినా ప్రమాదమేనా – ఎందుకో తెలుసా!

శరీరానికి తగినంత ఆహారం, నీరు అందితేనే సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉంటాం. నిజానికి ఆహారం కన్నా నీరు చాలా ముఖ్యం. శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుతుంది. శరీరంలో వ్యర్ధాలను తొలగించడం, అవయవాల పనితీరును క్రమబద్ధీకరించడానికి సహాయపడుతుంది. మన శరీరంలో 70% వరకు నీరు ఉంటుందని అందరకీ తెలుసు. కానీ శరీరంలో నీటి శాతం ఎక్కువైతే అది అనేక అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. రోజుకు కనీసం ఎనిమిది గ్లాసుల నీరు తాగాలని చెబుతున్నారు వైద్య నిపుణులు. కొంతమంది రోజుకు 8 నుండి 9 గ్లాసుల కంటే ఎక్కువ నీటిని త్రాగుతారు. మరి ఒక రోజులో ఎంత మోతాదులో నీరు తాగితే శరీరానికి మేలు కలుగుతుంది? ఎక్కువ నీరు తాగడం వల్ల ఎలాంటి దుష్ఫలితాలు కలుగుతాయి? ముఖ్యంగా ఏఏ సందర్భాల్లో నీళ్లు తాగకూడదో తెలుసా…

నీళ్లు ఎక్కువ తాగితే ఏమవుతుందంటే
@ అధిక నీరు శరీరంలో సోడియం స్థాయిలను తగ్గిస్తుంది. ఎక్కువ నీరు త్రాగడం వల్ల శరీరంలో అసమతుల్యత ఏర్పడుతుంది. ఇది వికారం, వాంతులు, తిమ్మిరి, హైపోనాట్రేమియా, అలసట వంటి పరిస్థితులకు దారితీస్తుంది.

@ తలనొప్పి అనేది ఓవర్ హైడ్రేషన్ లేదా డీహైడ్రేషన్ రెండింటీ లక్షణం. మీరు ఎక్కువ నీరు త్రాగినప్పుడు, మీ రక్తంలో ఉప్పు శాతం తగ్గుతుంది. ఇది మీ శరీరంలోని అవయవాలలో వాపుకు కారణమవుతుంది.

@ ఎక్కువ నీరు త్రాగినప్పుడు ఎలక్ట్రోలైట్ స్థాయిలు పడిపోతాయి. తక్కువ ఎలక్ట్రోలైట్ స్థాయిలు కండరాల తిమ్మిరికి కారణమవుతాయి.

@ ఎక్కువ నీటిను త్రాగడం వలన మూత్రపిండాలపై పనిభారం పెరిగి, అది హార్మోన్లపై ప్రభావం చూపుతుంది. దీంతో శరీరానికి ఒకరకమైన అలసట ఆవహిస్తుంది.

@ నీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల పొటాషియం లోపానికి దారి తీస్తుంది. పొటాషియం అనేది శరీరంలో ముఖ్యమైన మినరల్. దీని లోపం వల్ల వల్ల కాళ్లలో మంట, ఛాతీ నొప్పి మొదలైన లక్షణాలు కనిపిస్తాయి.

@ మీరు ఎక్కువ నీరు త్రాగినప్పుడు, మీకు తరచుగా మూత్ర విసర్జన సమస్యలు తలెత్తుతాయి. నీరు ఎక్కువగా తాగడం వల్ల శరీరం పోషకాలను గ్రహించదు, మూత్రం రూపంలో విలువైన పోషకాలు శరీరం నుంచి బయటకు వెళ్లిపోతాయి.

ఈ 3 సందర్భాల్లో నీళ్లు తాగొద్దు

  1. నిద్రపోయే ముందు నీళ్లు తాగొద్దు
    చాలామంది నిద్రపోయే ముందు నీళ్లు తాగేసి పడుకుంటారు. కానీ నిద్రించే ముందు ఎక్కువ నీరు తాగడం మంచిది కాదు. రాత్రి నిద్రపోయాక మూత్రపిండాల పనితీరు చాలా మందగిస్తుంది. ఈ సమయంలో నీరు ఎక్కువగా ఉంటే మూత్రపిండాలు రాత్రిపూట సరిగా పనిచేయలేక ఇన్ఫ్లమేషన్ వచ్చే అవకాశం ఉంది.
  2. వ్యాయామం చేయగానే నీళ్లు తాగొద్దు
    వ్యాయామం చేసేటప్పుడు మన శరీర ఉష్ణోగ్రత ఎక్కువవుతుంది. ఈ సమయంలో చాలామంది నీరు అధికంగా తాగుతారు. వ్యాయామం చేసేటప్పుడు నీరు తాగితే శరీర ఉష్ణోగ్రతలో హఠాత్తుగా మార్పులు వచ్చేస్తాయి. ఇవి ఆరోగ్యం పై ప్రభావం పడుతుంది. అందుకే వ్యాయామం చేశాక 20 నిమిషాల పాటు నీళ్లు తాగకపోవడమే మంచిది.
  3. ఆహారానికి ముందు-వెనుక నీళ్లు తాగొద్దు
    ఆహారం తీసుకునే సమయంలో కూడా చాలామంది ఎక్కువ నీళ్లు తాగేస్తూ ఉంటారు. ఇలా నీళ్లు తాగడం వల్ల శరీరానికి సరిపడా ఆహారం తీసుకోలేరు. ఆహారం తినడానికి అరగంట ముందు, ఆహారం తిన్న అరగంట తర్వాత నీళ్లు తాగకపోవడమే మంచిది. ఆహారం తింటున్న మధ్యలో, ఆహారానికి తినడానికి అరగంట ముందు, తిన్న అరగంట తర్వాత ఎలాంటి నీటిని తాగకపోవడమే ఉత్తమం.

అతిగా నీరు తాగితే శరీరంలో నీటి నిల్వలు పెరిగిపోతాయి. మూత్రపిండాలపై అధిక భారం పడుతుంది. జీర్ణ సంబంధ వ్యాధులు రావచ్చు. పొట్ట ఉబ్బరం వచ్చే అవకాశం కూడా పెరుగుతుంది.

గమనిక: ఆరోగ్య నిపుణులు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. దీనిని ఏ మేరకు విశ్వశించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం.