ప్రపంచం మొత్తం ఇప్పుడు భారత్ వైపు చూస్తోంది. భారత నాయకత్వాన్ని కోరుకుంటోంది. అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందుతున్న దేశాలకు భారతదేశం దిక్సూచిగా నిలిచే కార్యక్రమమే జీ-20 సదస్సుగా చెప్పక తప్పదు. కేంద్రంప్రభుత్వంలో ఉన్న ప్రతీ ఒక్కరూ రెండు రోజుల జీ-20 సదస్సును సూపర్ సక్సెస్ చేసేందుకు తమ వంతు కర్తవ్యాన్ని నిర్వర్తించారు. తమ సొంత కార్యక్రమంగా. దేశ ప్రతిష్టకు సంబంధించిన అంశంగా పరిగణిస్తూ అహరహం పనిచేశారు..
అందరికంటే ముందు వచ్చిన మోదీ..
మోదీ అంటే కమిట్మెంట్. మోదీ అంటే పంక్చువాలిటీకే పంక్చువాలటీ..ప్రపంచం రేపు ఆలోచించేదీ మోదీ ఇవాళే అమలు చేస్తారు. జీ-20 సదస్సును భారత్లో నిర్వహించాలని నిర్ణయించినప్పటి నుంచి, జీ -20 ప్రెసిడెన్సీ భారత్ కు అప్పగించినప్పటి నుంచి మోదీ నిద్రపోలేదు. సభ ఏర్పాట్లపైనే ఆయన ఆలోచిస్తూ అందుకు తగిన చర్యలు తీసుకుంటున్నారు. ఇవాళ కూడా మోదీ అందరికంటే ముందు సభ జరిగే భారత్ మండపానికి వచ్చి ఏర్పాట్లను పరిశీలించారు. ఆయన వెంట విదేశాంగమంత్రి ఎస్.జయశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఉన్నారు. ప్రతీ ఒక్క అంతర్జాతీయ అతిథిని స్వయంగా ఆహ్వానించాలన్న తపన ఆయనలో కనిపించింది. అతిథ్యానికి ఎలాంటి లోటు లేకుండా చూసుకోవాలన్న ఆకాంక్షతో ఆయన ముందే సభా స్థలికి చేరుకున్నారు.
అతిథులను ఆహ్వానించిన చల్లని వాతావరణం
సాధారణంగా సెప్టెంబరు నెల ఢిల్లీలో మైల్డ్ గా ఎండ ఉంటుంది. జీ-20కి మాత్రం ప్రత్యేకమైన వాతావరణం కనిపించింది. ఢిల్లీలోని అనేక ప్రాంతాల్లో ఉదయమే వర్షం కురిసింది. కొన్ని చోట్ల చిరుజల్లుల సింహనాదం వినిపించింది. దీని వల్ల ఎండ తాపం తగ్గి.. చల్లని వాతావరణంతో విదేశీ అతిథులను ఆహ్వానించామని ఢిల్లీ జనం అంటున్నారు. రేపు కూడా రాజధాని హస్తినలో అక్కడక్కడ వాన పడుతుందని భారత వాతావరణ శాఖ ప్రకటించడంతో అమెరికా, యూరప్ దేశాల నుంచి వచ్చిన గెస్ట్స్ కు ఊరటనిచ్చే అంశంగా చెప్పుకోవాలి..
సదస్సును భారత సంక్షేమానికి వినియోగించనున్న మోదీ
జీ-20 సదస్సును భారతదేశానికి అనుకూలంగా మార్చుకోవాలని ప్రధాని మోదీ ఆలోచనా విధానంగా కనిపిస్తోంది. అంతర్జాతీయ సదస్సులో చర్చించాల్సిన అంశాలపై దృష్టి పెడుతూనే.. ద్వైపాక్షక సంబంధాలపై ప్రధాని మోదీ చర్చలు జరుపుతున్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఢిల్లీలో అడుగు పెట్టిందే తడవుగా మోదీ ఆయనతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు.ప్రపంచ అభివృద్ధికి ఇరుదేశాల వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్దామని బైడెన్ వద్ద మోదీ ప్రస్తావించారు. ఈ ఏడాది జూన్లో మోదీ అమెరికా పర్యటన సందర్భంగా జరిగిన చర్చల సారాంశం మరోమారు చర్చకు రాగా.. అన్నింటికీ కమ్మిట్ అయి ఉన్నామని మోదీ ప్రకటించారు. మరో పక్క భారత్ ను పశ్చిమసియాకు అనుసంధానం చేసే రైల్వే, పోర్టు ప్రాజెక్టులపై దృష్టి పెట్టాలని మోదీ నిర్ణయించారు. ఈ దిశగా అమెరికా, సౌదీ అరేబియా దేశాలతో ఒప్పందం చేసుకున్నారు. ఎమిరేట్స్ దేశాలు, ఐరోపా యూనియన్ కూడా దీనిలో భాగమవుతాయి.