ఉమ్మడి అనంతపురం జిల్లా రాయదుర్గం టీడీపీ అభ్యర్థిగా కాల్వ శ్రీనివాసులను చంద్రబాబు ఖరారు చేశారు. జేసీ బ్రదర్స్ కుటంబసభ్యుడైన దీపక్ రెడ్డి అక్కడ టిక్కెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. అయితే చంద్రబాబు ఆయనను పక్కన పెట్టేసి అభ్యర్థి ఎవరో తన పర్యటనలో తేల్చేశారు. కుప్పంలో తాను ఎలానో.. రాయదుర్గంలో కాల్వ అని చంద్రబాబు స్పష్టం చేశారు. దీంతో జేసీ కుటుంబానికి చంద్రబాబు షాకిచ్చినట్లయింది.
గత ఎన్నికల్లో ఓడిన కాల్వ
బీసీ ఓటర్లు అధికంగా ఉండే నియోకజవర్గంలో గత ఎన్నికల్లో కాల్వ శ్రీనివాసులు ఓడిపోయారు. రాయదుర్గం పట్టణం, మండలంతో పాటు బొమ్మనహళ్, కణేకల్, గుమ్మగట్ట, డి. హీరేహల్ మండలాలతో రాయదుర్గం నియోజవర్గం ఏర్పడింది. నియోకజవర్గంలో ముందు నుంచి కాంగ్రెస్, టీడీపీ మధ్య పోరు నెలకొంది. రాష్ట్ర విభజన తర్వాత వైసీపీ, టీడీపీ హోరాహోరీగా తలపడ్డాయి. టీడీపీలో వర్గ పోరు ప్రతీ సారి మైనస్ అవుతోంది. టీడీపీలో గ్రూపు రాజకీయాలను తమకు అనుకూలంగా మల్చుకుని గత ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించిది. నియోజకవర్గంలో ఎక్కవుగా బడుగు బలహీనవర్గాలవారే ఉండడంతో వారిని కాల్వ ఆకట్టుకుంటారని చంద్రబాబు అనుకుంటున్నారు.
వరుసగా రెండు సార్లు ఎవరూ గెలవని నియోజవర్గం రాయదుర్గం
ఒకసారి గెలిచిన పార్టీ రెండోసారి గెలవడం రాయదుర్గంలో ఇప్పటివరకూ జరగలేదు. 1989 నుంచి ఈ సంప్రదాయం కొనసాగుతోంది. 1989లో కాంగ్రెస్, 1994లో టీడీపీ గెలవగా, 1999లో కాంగ్రెస్, 2004లో టీడీపీ, 2009లో కాంగ్రెస్, 2014లో టీడీపీ , 2019లో వైసీపీ విజయం సాధించింది. మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులును ఆయన ప్రాతినిధ్యం వహించిన రాయదుర్గంలో ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి వ్యతిరేకిస్తున్నారు. తనకు టికెట్ ఇవ్వకుంటే కాలవకు సహకరించడం కష్టమే. మరో సీనియర్ నేత మెట్టు గోవిందరెడ్డి గత ఎన్నికలకు ముందే వైసీపీలో చేరిపోయారు. సెంటిమెంట్ ప్రకరం చూస్తే వైసీపీకి డేంజర్ బెల్స్ ఉన్నాయన్న వాదన వినిపిస్తోంది.
దీపక్ రెడ్డి ఇప్పుడేం చేస్తారు ?
రాయదుర్గంలో టికెట్‌ను ఒకప్పుడు కాల్వ కోసం దీపక్ రెడ్డి త్యాగం చేశారు. అప్పట్లో త్యాగం చేసిన సీటును 2024 ఎన్నికల్లో తనకే కావాలని ఎమ్మెల్సీ దీపక్ గట్టిగా పట్టుబడుతున్నారట. ఇంతకీ దీపక్ ఎవరంటే జేసీ బ్రదర్స్ లో ఒకరైన జేసీ ప్రభాకరరెడ్డికి అల్లుడే. ఆర్ధికంగానే కాకుండా రాజకీయంగా కూడా చాలా బలమైన స్ధితిలో ఉన్నారు దీపక్. కాల్వలాగే దీపక్ కూడా చంద్రబాబు, లోకేష్‌కు సన్నిహితుడే . ఇప్పుడు టిక్కెట్ నిరాకరించడంతో దీపక్ రెడ్డి ఏం చేస్తారన్నదానిపై టీడీపీలో చర్చ జరుగుతోంది.