స్పీడ్ అందుకోలేకపోతున్న ఏపీ బీజేపీ – సనాతనం, భారత్‌పై ప్రజల్లోకి వెళ్లే ఆలోచనే లేదా ?

ఆంధ్రప్రదేశ్ బీజేపీ… తన సోల్ మిస్సవుతోంది. ఎన్ని అవకాశాలు వస్తున్నా అందుకోలేకపోతున్నారు. అందుకు రెండు ప్రత్యక్షఉదాహరణలు సనాతన ధర్మంపై ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు, భారత్ పేరు విషయంలో జరుగుతున్న చర్చ. ఈ రెండింటిని ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజల అభిమానాన్ని పొందడానికి ఉన్న ప్రయత్నాల్లో ఏపీ బీజేపీ నేతలు పెద్దగా పట్టుదల చూపించడం లేదు. ఫలితంగా దేశంలో అన్ని చోట్లా బీజేపీ పేరు మార్మోగిపోతోంది కానీ ఏపీలో మాత్రం పెద్దగా కనిపించడం లేదు.

సనాతన ధర్మంపై ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలతో మండిపోతున్న ప్రజలు

దేశంలో సనాతన ధర్మం గురించి .. ప్రజల జీవన విధానంలో భాగం అయి నదాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సమాజాన్ని సక్రమ మార్గంలో పయనింప చేసేదే సనాతన ధర్మం. రాజకీయ అవసరాల కోసం ఈ సనాతన ధర్మానాన్ని అవమానించడాన్ని ఎవరూ సహించరు. ఈ విషయంపై గట్టిగా స్పందించడంలో ఏపీ బీజేపీ నేతలు విఫలమయ్యారని అనుకోవచ్చు. మన కు సంబంధం లేదని విషయమని ఎక్కువ మంది సైలెంట్ ఉండిపోయారు. అత్యంత కీలక పదవులు పొందిన వారు సైతం పెద్దగా స్పందించకపోవడంతో… ఏపీ బీజేపీ డీలాపడిపోయిందన్న వాదన వినిపిస్తోంది.

భారత్ పై తమ వాదన వినిపించరేం ?

ఇండియా అనే పేరు ను రాజకీయంగా వాడుకునేందుకు విపక్షాలు సిద్ధమయ్యాయి. అయితే ఇండియా అనేది బ్రిటిష్ వారిచ్చిన పేరు. ఇండియన్స్ అనేదానికి గతంలో అడవుల్లో జీవించే వారు అనే అర్థం కూడాఉండేదని గూగుల్ చెబుతోంది. అద్భుతమైన భారత్ అనే పేరు ఉండగా.. ఇండియాను పాపులర్ చేశారు. ఈ పరిస్థితిని మార్చడానికి కేంద్రం రంగం 0సిద్ధం చేసింది. ప్రెసిడెంట్ ఆప్ భారత్, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ భారత్ అని సంబోధించడం ప్రారంభించింది. దీనిపై బీజేపీ విధానాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంతో ఏపీ బీజేపీ నేతలు పెద్దగా చొరవ చూపడం లేదు.

కొత్త కమిటీలో అంతా పని చేయలేని వారే ఉన్నారా ?

పురందేశ్వరి కొత్త బీజేపీ చీఫ్ అయ్యాక… బీజేపీ పూర్తిగా డల్ అయినట్లుగా కనిపిస్తోంది. ఆమె ప్రెస్ మీట్ పెడితే పెట్టినట్లుగా లేకపోతే లేదన్నట్లుగా ఇప్పుడు పంరదేశ్వరి వాయిస్ కూడా గట్టిగా ప్రజల్లోకి వెళ్లడం లేదు. సోషల్ మీడియాను ఉపయోగించుకోవడం లేదు. కొత్త కమిటీలో నేతలు ఇంత పార్టీని ముందుకు తీసుకెళ్తారనుకుంటే.. అత్యంత కీలక సమయంలో ఇలా నీరసంగా ఉన్నారేమిటన్న అసంతృప్తి పార్టీ క్యాడర్ లో కనిపిస్తోంది.