జగన్ ఇచ్చిన చివరి చాన్స్‌నూ మిస్ అయిన రోజా – ఇక టిక్కెట్ కష్టమేనా ?

రోజా ఫైర్ బ్రాండ్ .. సొంత పార్టీ నేతలపైనా చూపిస్తూండటంతో.. ఇంటా బయటా ఆమెకు శత్రవులే ఎక్కువ అయ్యారు. మళ్లీ ఆమెకు టిక్కెట్ ఇస్తే ను నగరిలో ఓడించేందుకు సొంత పార్టీ నేతలు రెడీ అయ్యారు. దీనిపై స్పష్టమైన నివేదికలు ఉండటంతో …. ఓ పథకం బటన్ నొక్కే కార్యక్రమాన్ని నగరిలో ఏర్పాటు చేసిన జగన్.. నేతల మధ్య సయోధ్య కుదిర్చేందుకు ప్రయత్నం చేశారు. కానీ కలవకపోవడంతో ఇప్పుడు హైకమాండ్ కు ఏదో ఓ నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

వరుసగా రెండు సార్లు గెలిచిన రోజా

ఆర్కే రోజా.. 2014,2019 వరుసగా రెండు సార్లు చిత్తూరు జిల్లా నగరి నియోజక వర్గం నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అంతేకాక సీఎం జగన్ మోహన్ రెడ్డి మంత్రివర్గంలో చోటు కూడా దక్కించుకున్నారు. పార్టీ కోసం రోజా చేసిన కృషి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమెకు జగన్ మోహన్ రెడ్డి పదవి ఇచ్చిన, ఇవ్వకున్న.. పార్టీ కోసం, జగన్ కోసం గట్టిగా పనిచేసింది. కానీ స్థానిక నేతలతో సత్సంబంధాలను కోల్పోయారు. మంత్రి పెద్దిరెడ్డి వర్గం పూర్తిగా దూరమయింది. ఆయన ప్రోద్భలంతోనే నగరిలోని వైసీపీ నేతలు మండలాల వారీగా రోజాకు వ్యతిరేకంగా గ్రూపులు కడుతున్నారనేది బ హిరంగ రహస్యమే.

సఖ్యతగా ఉండాలని చాన్స్ ఇచ్చిన జగన్

సీఎం జగన్ చేసిన నగరి పర్యటనలోనూ వైసీపీ నేతల అంతర్గబేధాలు బట్టబయలు అయ్యాయి. రోజాను మరోసారి గెలిపించుకునేందుకు స్వయంగా సీఎం జగన్ రంగంలోకి దిగినట్లు టాక్ వినిపిస్తోంది. అందుకే రోజాతో ఆమెకు వ్యతిరేకంగా రాజకీయాలు చేస్తున్న ఈడిగ కార్పొరేషన్ ఛైర్ పర్సన్ కేజే శాంతిని కలపారు. రోజాతో చేతిలో శాంతి చేయివేయించి.. వారిద్దరని కలిపారు. సీఎం జగన్ స్వయంగా రావడంతో.. శాంతి ఇష్టం లేకున్న అలా ఏదో చేయిలో చేయి వేసింది. ఈ క్రమంలో గ్రూపుల విషయంలో సీఎం చాలా సీరియస్ గా ఉన్నారని.. పార్టీకి నష్టం అవుతుందని.. అందరూ కలిసి పని చేయాలని ఆయన గట్టిగానే చెబుతున్నారు.

కలిసేందుకు సిద్ధపడని రెండు వర్గాలు

రోజాకు టిక్కెట్ ఇవ్వకపోతే… జరిగే రచ్చ ఎక్కువగా ఉంటుంందని.. అందుకే.. ఆమెకు వ్యతిరేకంగా ఇతరుల్ని బుజ్జగించాలని జగన్ అనుకుంటున్నారు. కానీ రోజా వ్యవహారశైలి వల్ల తాము తీవ్రంగా ఇబ్బంది పడుతున్నామని.. ఆమె నీడ కూడా పడటానికి ఇష్టపడబోమని నియోజకవర్గ నేతలుచెబుతున్నారు. వారు పార్టీ ఫ్లెక్సీల్లో ఎక్కడా రోజా బొమ్మ కూడా వేయడం లేదు. సీటు పోగొట్టుకోవడానికి జగన్ రెడీగా ఉండరని కఠిన నిర్ణయం తీసుకుంటారన్న వాదన వినిపిస్తోంది.